Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Voice Support By: Mrs. Jeevani
సాయిబాబాను దర్శించాలంటే పూర్వజన్మ సుకృతము ఉండాలి. ఆ మాటనే సాయి పలికే వారు భక్తులతో.
అందరూ సాయిని షిరిడీ చేరి దర్శించలేరు. భక్తులలో ఉండవలసింది సాయిని దర్శిద్దామనే తపనే.
అది హృదయాన్ని, మనసును కలవరపరచేటంత వ్యాకులంగా ఉండాలి. అలా ఉంటేనే గాని భగవత్ సాక్షాత్కారం కలగదని శ్రీ రామకృష్ణ పరమహంస అనేవారు కూడా!
శ్రీధర్ నారాయణ్ ఖర్కర్ సాయిబాబా సశరీరులుగా ఉండగా దర్శించ లేదు. ఆయన సాయిబాబా మహాసమాధి అనంతరం సాయి భక్తుడయ్యాడు.
ఇక ఆయనకు కొదవేమున్నది? సాయిబాబా తనపైన, తన కుటుంబంపైనా చూపిన కరుణకు అంతేలేదని ఆయనే స్వయంగా తెలిపారు.
ఆయన రెండవ కుమారుడు గోవింద్. తండ్రి ద్వారా సాయి లీలలను విన్నాడు. దర్శించేందుకు సాయి మహాసమాధి చెందాడాయే.
అతడు షిరిడీని సందర్శించాలని, సమాధి మందిరాన్ని చూడాలని, ద్వారకామాయిని వీక్షించాలని ఎంతో తపన పడిపోయేవాడు.
అయితే ఒకసారి అతడు తన కుటుంబంతో పరిచయం ఉన్న సాయి భక్తుల కుటుంబంతో షిరిడీని దర్శించాడు.
అది 1934 శ్రీరామనవమి. అంటే మార్చి 24.
గోవిందుడు ద్వారకామాయిని దర్శించాడు. అక్కడే తైల వర్ణంలో ఉన్న సాయి చిత్రాన్ని కూడా దర్శించాడు.
తన హృదయంలోనికి చొచ్చుకు పోయేటట్లున్న సాయి చూపులకు పరవశించి పోయాడు. అమితమైన ఆనందం పొందాడు.
కన్నులు మూసుకున్నాడు. అప్పుడు ”వచ్చావా?” అనే ఆప్యాయమైన పలకరింపు వినిపించింది.
కనులు తెరచి చూచాడు. చుట్టూ ఎవరూ లేరు. తానొక్కడే సాయి చిత్రం వద్ద ఉన్నాడు. అది సాయి పలకరింపే – సందేహం లేదను కున్నాడు. సాయిని తైల వర్ణ చిత్రంలో దర్శించాడు, మరుక్షణమే ”నేను ఉన్నాను” అనే నిదర్శనం పొందాడు.
ఇది ఒక జీవిత కాలానికి సరిపడే ఆనంద అనుభవం. గోవిందునకు మార్చి 24న కల్గిన అనుభవం మనకు కూడ లభింపచేయమని సాయిని మనసారా వేడుకుందాం!
నాడు సశరీరులుగా బాబా మన ముందు నడయాడాడు. నేడు చిత్రపటాల, విగ్రహాల రూపాలలో మన ముందు సంచరించుచు మనను ఆశీర్వదిస్తున్నాడు.
తెలుసుకుంటే సత్యమింతే నయా!
Compiled By:- ముళ్ళపూడి పాండురంగ సాయినాథ్ & మున్నలూరి బోస్
Collected and Presented By: Mr:Sreenivas Murthy
Latest Miracles:
- నిదర్శనం కోసం దర్శనం…. సాయి@366 ఫిబ్రవరి 15….Audio
- ఓం శ్రీ సాయి హనుమాన్ …..సాయి@366 ఏప్రిల్ 1…..Audio
- సాయి శంకర…..సాయి@366 ఆగస్టు 6….Audio
- తెలియగ లేరే నీ లీలలు …..సాయి@366 అక్టోబర్ 17….Audio
- ప్రేమ బీజాన్ని నాటిన సాయి ….. సాయి@366 మార్చి 7….Audio
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Recent Comments