ప్రేమ బీజాన్ని నాటిన సాయి ….. సాయి@366 మార్చి 7….Audio



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba



Voice Support By: Mrs. Jeevani


చివుకుల చెల్లయ్య గారు అంటే సాయి భక్తులకు తెలియదు. శుద్ధానంద భారతి అంటే అందరూ గుర్తిస్తారు.

తిలక్‌, కపర్దేలతో కలిసి సాయిబాబాను దర్శించానికి వచ్చాడు శుద్ధానంద భారతి.

తిలక్‌, కపర్దేలకు తిరిగి వెళ్ళిపోవానికి సాయిబాబా అనుమతిచ్చాడు గాని శుద్ధానందకు మాత్రం ఇవ్వలేదు.

ఆయనకు సాయిని వీడి వెళ్ళాలనిపించ లేదు. ఆయన 3 నెలలు అక్కడే ఉన్నారు. ఎన్నో విశేషాలను తెలిపారు సాయిని గురించి.

సాయిబాబా గుప్పెడు వేపాకులను ఆయనకు ఇచ్చారు. వాటిని ఆయన తిన్నాడు. అవి తియ్యగా ఉన్నాయి ”చేదు కూడా నీ స్పర్శతో మధుర మైనది సాయి” అని ఆయన సాయిని కీర్తించారు.

ఒక రోజు సాయంకాలం సాయి అతని తలను, చెవులను కప్పుతూ ఒక కాషాయపు బట్టను కట్టారు.

అప్పుడు శుద్ధానందులకు ఓంకార స్వరం వినబడింది. ఆయనకు ధ్యానం గాఢంగా కుదిరింది.

మరో రోజు సాయంకాలం సాయిబాబా ఉన్నట్టుండి ”ఘోడా! టీక్ కడో, టీక్ చలో ” (ఓ గుర్రమా! సరిగ్గా నిలబడు, సరిగ్గా పో!) అన్నాడు.

అక్కడున్న వారికి ఏమీ అర్ధం కాలేదు అప్పుడు. ఒక గంట గడిచింది. జట్కా బండి నుండి ఒక సాయి భక్తుడు దిగాడు.

ఆ భక్తుడు చెప్పిన దేమిటంటే ఆ జట్కా గుర్రం అదుపు తప్పింది. బండి తిరగబడింది. భక్తుడు క్రింద పడ్డాడు. అయినా సాయి నామ స్మరణ చేస్తున్నాడు.

గుర్రం వెంటనే మామూలు అయింది. గుర్రాన్ని బండికి కట్టారు. బయలుదేరి సాయిని దర్శించుకున్నాడు ఆ భక్తుడు.

”బిడ్డా! అల్లా తన భక్తులను కాపాడుతుంటాడు. ఆయన చేసే ఆశ్చర్యాలను గమనిస్తూ, ఆయనపై నమ్మకాన్ని మరింత పెంచుకోవటమే మనం చేయవలసినది” అని సాయి చెప్పారు అప్పుడు.

శుద్ధానందులు సాయి మహత్మ్యాన్ని తెలుగులోను, తమిళం, హిందీ మొదలైన భాషలలో వ్రాశారు.

శుద్ధానంద భారతి గారి కొన్ని మధుర వాక్యాలు ఆయన మహాసమాధి దినమైన మార్చి 7న స్మరిద్దాం.

”ప్రేమించే ప్రతి ప్రాణిలోను వసించు

ప్రియతమ పూజ్య దైవం మన బాబా

మౌనంగా ప్రేమ బీజాన్ని నాటాడు నాలో

మహత్తర విశ్వ ప్రేమను చూపాడు మన బాబా

ఏది మంచిదో మనకు అది చేస్తాడు

సేవిద్దాం పరిపూర్ణ హృదయంతో

దరిచేరుస్తాడు మన బాబా” ..

Compiled  By:- ముళ్ళపూడి పాండురంగ సాయినాథ్ & మున్నలూరి బోస్

Collected and Presented By: Mr:Sreenivas Murthy

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Have any Question or Comment?

One comment on “ప్రేమ బీజాన్ని నాటిన సాయి ….. సాయి@366 మార్చి 7….Audio

Madhavi

చాలా బాగుంది.ఎందరో మహానుభావులు.అందరికి వందనములు.జై సాయి నాథ్.

Comments are closed for this post !!

Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles