Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Voice Support By: Mrs. Jeevani
సాయి భక్తుడు సాయిబాబానే పూజిస్తాడు, అర్చిస్తాడు, సాయి తెలిపిన పారాయణ గ్రంథాలు పారాయణ చేస్తాడు.
ఇలా ఎన్నో మార్గముల ద్వారా సాయిని మదిలో నిలుపుకొనానికి ప్రయత్నిస్తాడు.
సాయి తప్ప వేరెవరినీ ధ్యానించడు, ప్రార్ధించడు, అంటే కేవలం సాయికే అంకితమై ఉంటాడు.
బెంగళారు నివాసి శ్రీ ఎం. రామారావు. ఆయన సాయి పరిధిలోనికి వచ్చాడు.
ఆయన కుమార్తె అత్త వారు మధ్వ సాంప్రదాయానికి చెందిన వారు. ఆయన మనుమరాలు అంటే కూతురు, కూతురు చిన్న బిడ్డ, రామారావుగారి వద్దనే ఉంటోంది.
ఒకసారి ఆ బిడ్డకు నలతగా ఉన్నది. రామారావుగారి భార్య, భర్తను రాఘవేంద్ర స్వామి మఠమునకు పోయి మనుమరాలికి నవగ్రహ తాయత్తును తెమ్మని చెప్పింది.
రామారావు గారు ఎప్పికప్పుడు వాయిదా వేస్తూవచ్చారు, ఆ తాయత్తును తేవటానికి. ఎందుకంటే తాను సాయిని నమ్మినాడు.
వేరొకరి వద్దకు పోయి తాయత్తును తెచ్చుట సాయి భక్తికి భంగమవుననే ఉద్దేశ్యంతో తెచ్చుట లేదు.
కాని, ఒకసారి తెచ్చుట తప్పనిసరి అయినది. అది మార్చి 11న 1986లో జరిగినది.
అలా ఆయన తాయత్తును తెచ్చుట సమంజసమా? కాదా? అనే మీమాంసలో పడినాడు.
ఎటు తేల్చుకొనలేకపోయినాడు ఆయన.
ఆ పరిసర ప్రాంతముల వద్ద నుండు శ్రీ టీ.కే. అయ్యంగార్ అనే సత్పురుషుని తాను చేసినది సబబా? కాదా? అని ప్రశ్నించాడు.
ఆయన (అయ్యంగార్) ఉన్నది ఒకటేనని, అంతా ఏకత్వమనే అభిప్రాయాన్ని చెప్పారు.
పురందరదాసు శైవ సాంప్రదాయకుడు, అయినను హరిని కీర్తించాడు. విజయదాసు మధ్వ యోగి అయినను శివుని కీర్తించాడు.
ఇక సాయి సాహిత్యంలోనికి వస్తే, మాతాజీ కృష్ణప్రియ రాఘవేంద్ర స్వామి భక్తురాలు, చివరకు సాయి భక్తురాలైంది. ఏ యోగి చెప్పినా, యోగులందరూ ఒకటే అనే భావన కలుగుతుంది.
”నా ప్రయాణంలో కాని తీరం చేరుకున్నాను,
తీరా చూస్తే, ఆ తీరంలో ఉన్నది నీవే..” అనే భావన కలిగితే చాలు!
Compiled By:- ముళ్ళపూడి పాండురంగ సాయినాథ్ & మున్నలూరి బోస్
Collected and Presented By: Mr:Sreenivas Murthy
Latest Miracles:
- శ్రద్ధ….. సాయి@366 మార్చి 8….Audio
- ఆనాడు ఈనాడూ అదే సాయి ….. సాయి@366 మార్చి 14….Audio
- నేనందంగా లేనా? …..సాయి@366 మార్చి 25….Audio
- షిరిడీ మసీదులో శ్రీరామనవమి…..సాయి@366 మార్చి 27…..Audio
- వైద్యులకే వైద్యుడు! …..సాయి@366 మే 9….Audio
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Recent Comments