Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Voice Support By: Mrs. Jeevani
సాయి అందరకూ తెలిపేది శ్రద్ధ వహింపుమని, సబూరీ (ఓర్పు) చూపుమని.
నాగుల వెల్లటూరు వాస్తవ్యుడు శ్రీరాములు నాయుడు. ఈయన గొలగలమూడి వెంకయ్య స్వామిని ఆరాధించేవాడు.
ప్రతి రోజు వెంకయ్య స్వామి పటమునకు నైవేద్యమును రెండు వేళలా సమర్పించేవాడు.
పటము – ఏ సత్పురుషుని పటమైనా ఒకటే. అది సజీవమే.
ఒకనాడు ఆయన పుల్లని నిమ్మపండును కోసి, స్వామి వారికి నైవేద్యంగా ఉంచాడు.
ఆయన ఆ నిమ్మపండు రుచి చూడలేదు. ఆ పూట గడచినది. ఇంటి వద్దనుండి ఆయనకు పేలపిండి వచ్చినది.
దానిలో కొంత రాత్రికి దాచుకుని, కొంత భాగమును స్వామి వారి పటమునకు నైవేద్యముగా పెట్టాడు.
కొంచెం పిండిని తన నోటిలో వేసుకున్నాడు. అది పుల్లగా ఉన్నది.
అదేమిటని రాత్రికి దాచి ఉంచుకున్న పిండిని తిని చూస్తే అది మామూలుగానే ఉన్నది.
వెంటనే వెంకయ్య స్వామివారి పటం వైపు చూచాడు. ”నాకైతే నిమ్మపండు నైవేద్యం పెట్టావే? ఆ పులుపు నీవు తినగలవా?” అని వెంకయ్య స్వామి వారి వాక్కు వినిపించింది.
ఆ పులుపు తినలేకనే శ్రీరాములునాయుడు నిమ్మ పండును రుచి చూడలేదు.
తనకు పనికిరాని పండును నైవేద్యంగా పెట్టటమా? నాయుడుగారికి తెలిసివచ్చింది తన తప్పిదము.
చేసే పని శ్రద్ధగా చేయాలని స్వామి తినగలిగిన పదార్ధాలనే సమర్పించి ఉండవలసినది.
సాయిబాబా మహాసమాధి చెందాడు. స్థూల శరీరం మహాసమాధిలోనే ఉన్నది.
ఆ మహాసమాధికి మంగళ స్నానాలు చేయిస్తారు. అనంతరం రుతువును బట్టి వలువలను అంటే వస్త్రాలను ఆ మహాసమాధిపైన కప్పటం జరుగుతుంది.
వేసవి కాలంలో ప్రత్తి వస్త్రాలను, శిశిర కాలంలో ఉన్ని వస్త్రాలను కప్పుతారు.
ఆ రోజు మార్చి 8, 1936. అది కాకాడ ఆరతి సమయం. సాయి మహాసమాధిపై ఉన్ని వస్త్రాలు సమాధికి దూరంగా పడి ఉన్నాయి.
సమాధిలో నున్న సాయికి వేసవి వేడి తగలకుండా ఆ వస్త్రాలు ప్రక్కకు జరిగాయి.
ప్రత్తి వస్త్రం మాత్రం కప్పబడి ఉన్నది. ఈ వింతను శ్యామా మొదలైన వారెందరో చూచారు.
ఆ నాటి నుండి వేసవిలో ప్రత్తి వస్త్రాలను, శీతాకాలంలో ఉన్ని వస్త్రాలను కప్పనారంభించారు సమాధిపై.
జీవమున్న మనమే కాదు నిర్జీవములు (వస్త్రములు) సహితము బాబా సేవలో తరించాయి, తరిస్తాయి కూడా.
మహనీయుల చిత్రపటాలైనా, మహాసమాధులైనా అవి సదా సజీవములే. వాటి నుండే వారు తమ భక్తులను కాపాడుతుంటారు.
ప్రతి పనిని శ్రద్ధగా చేతుము గాక!
Compiled By:- ముళ్ళపూడి పాండురంగ సాయినాథ్ & మున్నలూరి బోస్
Collected and Presented By: Mr:Sreenivas Murthy
Latest Miracles:
- గండాలు తప్పించే ‘గుండం’…..సాయి@366 ఆగస్టు 24….Audio
- నేనందంగా లేనా? …..సాయి@366 మార్చి 25….Audio
- పామరులకు మరింత చేరువలో …. మహనీయులు – 2020… మార్చి 12
- మీమాంస ….. సాయి@366 మార్చి 11….Audio
- ఆనాడు ఈనాడూ అదే సాయి ….. సాయి@366 మార్చి 14….Audio
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
One comment on “శ్రద్ధ….. సాయి@366 మార్చి 8….Audio”
maruthi.sainathuni
March 8, 2020 at 9:40 pm🙏