ఆనాడు ఈనాడూ అదే సాయి ….. సాయి@366 మార్చి 14….Audio



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba



Voice Support By: Mrs. Jeevani


సాయిబాబా అక్టోబరు 15, 1918న మహాసమాధి చెందారు.

సాయి మహాసమాధి, సాయి చిత్రపటం ఆరాధనీయమైనాయి ఆ నాటి నుండి 1954 అక్టోబరు 7వరకు. అనంతరం నిలువెత్తు సాయి విగ్రహం ఆరాధనీయమైంది.

సాయి భక్తుడు శ్రీ స్వామి కేశవయ్యజీ. ఆయన గృహమే ‘సాయి నిలయం’. అది మద్రాసు మహానగరంలో షెనాయ్‌ నగర్‌లో ఉన్నది.

సాయి నిలయం నుండే గురువార పూజలు జరుగుతూ ఉండేవి. తగినంత స్థలం లేకపోవటంచేత కొన్ని గంటల సేపు భక్తులు వీధిలోనే క్యూలో నిలబడేవారు.

ఈ అసౌకర్యం తీర్చటానికి ఎదురుగా ఉన్న ప్రదేశంలో సాయి నిలయం ఏర్పాటు చేశారు. నిర్మాణం పూర్తయింది.

మార్చి 14, 1975న వేలాది మంది భక్తుల సమక్షంలో ప్రారంభోత్సం జరిగింది.

షెనాయ్‌నగర్‌లోని సాయి నిలయం ఆ నాడే రెండవ షిరిడీగా పేరు గడించుకున్నది.

ఆ నాడే మూడున్నర లక్షల రూపాయల వ్యయంతో రూపు దాల్చిన ఈ మందిరం చూడ చక్కని, ప్రశాంత  ప్రదాయిని. ఒకేసారి 3 వేల మంది దర్శించుకోదగ్గ హాలు ఉన్నది.

చక్కని పాలరాళ్ళతో నిర్మితమైన గర్భాలయంలో అంతకంటే చక్కని మందహాసంతో జగదేక సంసేవ్యుడయిన శ్రీ సాయిబాబా నిలువెత్తు చిత్రపటం ఉంచారు.

సాయిబాబా పటానికి ముందు షిరిడీలో వలె పాదుకలు ఉంచ బడ్డాయి. ఒకే మాటలో చెప్పాలంటే జీవకళతో ఉట్టిపడే శ్రీ సాయిబాబా పటం భక్తుల హృదయాలలో నిశ్చలమైన భక్తి భావం కలిగించేది.

ఈ మందిరం నిర్మాణంలో ఉన్న రోజులలో, ఈ మందిరాన్ని తిలకించిన ప్రముఖ వైద్యులు సురేంద్ర గారిలా అనుకున్నారు ”స్వామి కేశవయ్యాజీ అనంతరం ఈ మందిరం ఏమవుతుందో, ఏమిటో ” అని. ఆ రాత్రే ఆయనకు కల వచ్చింది.

సాయిబాబా కలలో కనిపించి ”వెర్రివాడా! నా భక్తులను విడచి పెట్టి నేనెక్కడకు వెడతాను? కంటికి రెప్పలాగా నేను వాళ్ళను కాపాడుతూ ఉంటాను. నేను ఆ మందిరంలోనే ఉంటాను” అంటూ శ్రీ సాయిబాబా మందిరంలోనికి ప్రవేశించి ఆశీనులయినారట.

నేటికి, సాయిబాబా ఆ సుందర దివ్య చిత్రపటంలోనే సాక్షాత్కరిస్తూ ఉంటారు (ఈనాటికి విగ్రహం లేదు).

ఆ నాడు – ఈ నాడు ఆ సాయి వెన్నెల వ్యాపిస్తూ ఉంటుంది. ఈనాడు మార్చి 14 – ఆ సాయి నిలయంలో వలె సాయి మనలో కూడ ఉండుగాక!

Compiled  By:- ముళ్ళపూడి పాండురంగ సాయినాథ్ & మున్నలూరి బోస్

Collected and Presented By: Mr:Sreenivas Murthy

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles