Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Voice Support By: Mrs. Jeevani
సాయి సచ్చరితలో కనబడే పేరు వామన్ గోండ్‌కర్. సాయిబాబా భిక్ష స్వీకరించిన ఐదు గృహాలలో ఒకటి.
ఈయన గృహంలోనే రాధాకృష్ణ మాయి కొంతకాలం నివసించింది. ఆమె అనేక సాయి మహిమలను ఈ గృహంలోనే చూపించింది.
సాయిబాబా భిక్ష చేసే ఈ గృహం ద్వారా కొన్ని విశేషాలను గ్రహించ వచ్చును.
సాయిబాబా ఈ గృహాన్ని ఒక వైపు నుండి ఎక్కి రెండవ వైపు నుండి దిగాడు నిచ్చెన ద్వారా.అందువలన రాధాకృష్ణమాయికి జ్వరం తగ్గటం సాయి మహిమగా పేర్కొంటారు. ఇది ఒక వింత మార్గము, జబ్బును నయం చేసేందుకు.
గృహన్ని ఎక్కటం, దిగటం ఒక నిచ్చెన ద్వారా చేశాడు సాయి.
ఆ నిచ్చెన తెచ్చిన వ్యక్తికి అణానో, బేడో ఇవ్వక రెండు రూపాయలు ఇవ్వటం అందరినీ ఆశ్చర్య పరచింది.
సాయి చెప్పారు ”సేవను ఉచితంగా ఎవరూ పొందరాదు. కష్టమునకు తగిన ప్రతిఫలాన్ని ఇవ్వాలి!” ఇక్కడ తగిన ప్రతి ఫలము లేదా కూలీ అంటే, సేవ చేయించుకున్న వాడు ఆ సేవకు ఇవ్వ గలిగిన దానికంటే కొంచెం ఎక్కువగానే అనుకోవాలి.
ఆ రెండు రూపాయల విషయంలోని అసలు రహస్యాన్ని శ్రీ శివనేశన్ స్వామి గారు తెలిపారు.
ఆ నిచ్చెన తెచ్చినది వెంకూ షింపే కాంబ్లేకర్. అతనికి సంతానం లేదు.
సాయి ఇచ్చిన రెండు రూపాయలను మహా ప్రసాదంగా స్వీకరించాడు. వాటిని పూజా మందిరంలో పెట్టుకుని పూజించాడు.
రెండు రూపాయలు ఇద్దరి కుమారులకు ప్రతీక కాబోలు. ఇరువురు పుత్రులు జన్మించారు వెంకూ షింపే కాంబ్లేకర్‌కు. ఆతని కోర్కె అలా తీర్చారు గోండ్కర్ గృహం ముందు రెండు రూపాయలిచ్చి.
సాయిబాబా కష్టానికి తగిన కూలీ నివ్వటమే గాక కాంబ్లేకర్ కోరకున్నను అతని ఇచ్ఛను నెరవేర్చాడు.
ఈ సంఘటన జరిగినది వామన్ గోండ్కర్ ఇంటి వద్ద.
గోండ్కర్ షిరిడీలో భూస్వామి. అతనే లెండీ బాగ్‌ను మోరేశ్వర్ ప్రధాన్‌కు విక్రయించాడు సాయి బాబా కోసం. ప్రధాన్ దానిని సంస్థానానికి సమర్పించాడు.
వామన్ గోండ్కర్ 15 మార్చి 1964న సమాధి చెందాడు. వామన్ గోండ్కర్ వలె సాయికి సేవ చేస్తూ భక్తులకు సాయపడుదుము గాక!
Compiled By:- ముళ్ళపూడి పాండురంగ సాయినాథ్ & మున్నలూరి బోస్
Collected and Presented By: Mr:Sreenivas Murthy
Latest Miracles:
- వామన్ శశి ఇస్లాంపూర్ కర్…..సాయి@366 జూన్ 3….Audio
- అదా కారణం!…..సాయి@366 ఆగస్టు 1…Audio
- మత సహనం – మార్పిడి …..సాయి@366 జూలై 17…Audio
- వామన్ తాత్యా
- తొడిమను వీడిన దోసపండు …..సాయి@366 డిసెంబర్ 15….Audio
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Recent Comments