కాదు సుమా కల! నిజమేలే!!….. సాయి@366 మార్చి 16….Audio



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba



Voice Support By: Mrs. Jeevani


ధూలియాలో సాయి భక్తుడు రావ్‌జీ బాలకృష్ణ ఉపాసనీ ఉండేవాడు.

రావ్‌జీ కొడుకు అనారోగ్యానికి గురయ్యాడు. డాక్టర్లు ఆశ వదులుకున్నారు. ఆ రాత్రి బాలుని వద్ద డాక్టరు, రావ్‌జీ ఉన్నారు.

రావ్‌జీ గాఢ నిద్రలో ఒక కలగన్నాడు.  ఆ కలలో సాయిబాబా తన కొడుకుకు ఊది రాస్తున్నట్లు అనిపించింది.

రావ్‌జీని చూస్తూ సాయి ”ఇప్పుడు ఇంకా బాధపడకు, కొన్ని గంటలలో నీ కొడుక్కి చెమట పడుతుంది. అతడి పరిస్థితి మెరుగవుతుంది. అతడు పూర్తిగా కోలుకున్నాక షిరిడీకి తీసుకురా” అన్నారు.

 రావ్‌జీ నిద్రలేచాడు. రాత్రి రెండు గంటలయింది. కొడుకుని గమనిస్తూ కూర్చున్నాడు. సాయి చెప్పినట్లే జరిగింది. కొడుకు శరీరానికి చెమటలు పట్టాయి. అది చూసి అక్కడనే ఉన్న డాక్టరు కూడా ఆశ్చర్యపోయాడు.

షిరిడీ నుండి శ్యామా ఉత్తరం వ్రాసాడు. అందులో ”సాయిబాబా ధూలియాకు వెళ్ళి నా స్నేహితుని చూచినట్లు చెప్పారు. నా స్నేహితుడు ఎవరంటే నీ పేరు చెప్పారు ఇంకా సాయిబాబా అప్పుడప్పుడు ధూలియాకు పోతుంటానని చెప్పారు. ఇలా వ్రాయి అని కూడ చెప్పారు” అని ఉన్నది.

కుర్రవాడు ఆరోగ్యవంతుడవుతున్నాడు. రావ్‌జీ, భార్య, కుర్రవాడు షిరిడీకి బయలు దేరారు. దారిలో కోపర్గాంలో దిగి స్నానం చేశారు.

ఇక షిరిడీకి బయలు దేరారు బండిలో. రావ్‌జీ మధ్యాహ్న ఆరతికి సాయి సన్నిధిలో ఉండలనే  తపనతో ఉన్నాడు. ఈ విషయమై బండి వానితో గొడవ కూడా జరిగింది.

షిరిడీలో ఆరతి సమయమయింది. కాసేపు ఆగమన్నారు సాయి.

”ధూలియా నుండి బంధువులు రాబోతున్నారు” అన్నాడు సాయి శ్యామాతో.

రావ్‌జీ ధూలియా నుండి సాయి దర్శనానికి బయలుదేరుతామని ఎవరికి ఉత్తరం వ్రాయలేదు. కనుక రావ్‌జీ వస్తాడని శ్యామా ఊహించలేదు.

రావ్‌జీ కుటుంబంతో షిరిడీకి వచ్చి సాయి సన్నిధి చేరాడు. సాయి ఆ కుర్రవానిని దగ్గరకు తీసుకుని ”నీకు ఒంట్లో బాగాలేనప్పుడు, నేను మీ ఇంటికి వచ్చి నిన్ను చూచాను, నీకు తెలుసా?” అన్నారు.

ఆ మాటలు విన్న రావ్‌జీకి మరింత ఆశ్చర్యం కలిగింది. అంటే, ఆ రోజు రాత్రి తనకు వచ్చింది కలకాదన్నమాట. నిజమేనన్నమాట. సాయిపై మరింత ప్రేమ కలిగింది రావ్‌జీకి.

రావ్‌జీ అంతి ప్రేమ మనకూ కలుగును గాక!

Compiled  By:- ముళ్ళపూడి పాండురంగ సాయినాథ్ & మున్నలూరి బోస్

Collected and Presented By: Mr:Sreenivas Murthy

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles