Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Voice Support By: Mrs. Jeevani
డాక్టర్ పి. రామస్వామి, కమలాబాయి దంపతులు. సాయి అంకిత భక్తులు. వారు విజయనగరంలో ఉండగా, మార్చి 17న 1944 జరిగిన సంఘటన.
సాయిబాబా కోర్కెలను తీర్చే కొండంత దేవుడా! ఆధ్యాత్మిక పథంంలో జ్ఞాన ప్రదాతా!! ఈ రెండే కాదు ….
డాక్టర్ రామస్వామిగారి పదేండ్ల పిల్లవాడు జబ్బుతో బాధపడుతున్నాడు. రామస్వామిగారు ఆ పిల్లవాని పక్కనే ఉండి పరిచర్యలు చేస్తున్నాడు.
కమలా బాయి వంట చేస్తోంది. అపస్మారక స్థితిలోనికి పిల్లవాడు పోతున్నాడని డాక్టరు గ్రహించాడు.
నోటిలోనికి మందులు పోసి ‘మింగు’ అని కొంచెం గట్టిగానే అన్నాడు. తెరచిన నోరు తెరిచినట్లే ఉంది.
నోరు మూయటానికి రామస్వామి ప్రయత్నించగా, దవడలు బిగుసుకు పోతున్నాయి.
నాడి చలన రహితమైంది. కనుల ముందే కాలం తీరిన బిడ్డను చూచాడు.
బాధ .. మనసులో బాధ .. తన దైవాన్ని అంటే సాయినాథుని దూషించసాగాడయన.
ఆయన దృష్టి వంటింటిలో వంట చేస్తున్న భార్యను మాటలతో గాయపరచాడు.
ఆమె బిడ్డ వద్దకు వచ్చినది. రామస్వామి వలే ఆమె ఉద్రేకపడలేదు. ”ఇట్లున్నది కాబోలు సాయి ఇచ్ఛ” అనుకొన్నది.
మనసు ఆలోచించినంత దుర్మార్గంగా శతృవు కూడా ఆలోచించడంటారు. ”వంట తయారయిందా? పోయిన వాడితో నేను పోలేను. నాకు ఆకలిగా ఉంది అన్నం తింటాను” అన్నాడు రామస్వామి. ”మీరే పెట్టుకు తినండి” అన్నది కమలాబాయి.
వంట గదిలోనికి పోయి కంచం నిండా అన్ని పదార్ధాలు పెట్టుకున్నాడు రామస్వామి. ఎదురుగా చనిపోయిన కుమారుడు.
తాను ఏమి చేస్తున్నాడు? ఏమిటి ఇదంతా? అర్థం చేసుకోలేక పోతున్నాడు ఆయన.
ఆయనకు ఇంటి గేటు ఎదురుగా ఫకీరు కనబడ్డాడు. ఎవరో కాదు, సాక్షాత్తు సాయి బాబాలాగా ఉన్నాడు.
వెంటనే ”కామూ! గేటు దగ్గరకి ఎవరు వచ్చారో చూడు” అన్నాడు. ఆమె చూచి ”అమ్మా! నాయనా! బాబా వచ్చాడు!” అని అరచింది.
వెంటనే రామస్వామి తన చేతిలో ఉన్న అన్నపు పళ్ళాన్ని తీసుకు వెళ్ళి ఆ ఫకీరు భిక్షా పాత్రలో వేశాడు ఆనందంగా. ఫకీరు ఏమీ మాట్లాడకుండా, నవ్వుకుంటూ వెళ్ళిపోయాడు.
ఇంటి లోపలికి వెళ్ళారు ఆ భార్యాభర్తలు. ”నాన్నా! నాకు దాహంగా ఉంది నీళ్ళివ్వు” అని అడిగాడు కుమారుడు. ఇది సాయి లీల.
అవును ఇది సాయి లీలే .. మానవుడు మృగత్వంలోకి అడుగులు వేసేటప్పుడు సాయి చూపే లీల.
Compiled By:- ముళ్ళపూడి పాండురంగ సాయినాథ్ & మున్నలూరి బోస్
Collected and Presented By: Mr:Sreenivas Murthy
Latest Miracles:
- ఒకరు కాదు ఇద్దరు…..సాయి@366 సెప్టెంబర్ 1….Audio
- షిరిడీయే కాశీ…..సాయి@366 ఏప్రిల్ 27….Audio
- మనసు నిండా భక్తి ….. సాయి@366 మార్చి 4….Audio
- అన్నపూర్ణ సిద్ది …..సాయి@366 మార్చి 30….Audio
- కుదరదా? సరేలే! ….. సాయి@366 మార్చి 13….Audio
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Recent Comments