Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Voice Support By: Mrs. Jeevani
”షిరిడీ మాఝే పండరీపుర, సాయి బాబా రమావర” అంటూ కీర్తిస్తాడు దాసగణు మహారాజ్.
డాక్టర్ రామస్వామి అయ్యంగార్, బచ్చు పాపయ్య శ్రేష్టితో కలసి షిరిడీ యాత్ర చేశారు. రామస్వామి గారికి షిరిడీయే కాశీ క్షేత్రమనిపించింది, దాసగణుకు షిరిడీ పండరీపురం అయినట్లు.
డాక్టర్ రామస్వామి గారు షిరిడీ ని కాశీగా తలంచి, సాయిని విశ్వనాథునిగా సేవించి ఊరుకోలేదు.
కాశీ యాత్ర చేసిన వారు తమకు ఇష్టమైన ఒక దానిని కాశీలో విడచి పెట్టటం సామాన్యంగా జరిగే విషయము.
ఇక్కడ డాక్టర్ రామస్వామి గారు కూడా అలాగే చేయాలని నిశ్చయించు కున్నారు.
చిన్న తనం నుండి తమలపాకులు వేసుకోవటం ఆయనకు అలవాటు. అట్టి తమలపాకులను వదలానికి నిర్ణయించుకున్నాడు.
ఆ ఇద్దరూ సాయిని దర్శించుకుని తిరుగు ముఖం పట్టారు 27 ఏప్రిల్ 1938న.
షిరిడీ నుండి ఎద్దుల బండిపై వారు ప్రయాణం సాగిస్తున్నారు. చెట్టియార్ తన పాన్ డబ్బాను తీసి, తమలపాకులను యథావిధిగా వేసు కుంటున్నాడు.
అయ్యం గారికి తాను షిరిడీ నుండి కాకుండా మద్రాసు నుండి పాన్‌ను వదిలితే బాగుంటుంది అనిపించింది.
పాన్ డబ్బా తీసి ఆకు, వక్కలను నమలసాగాడు. వెంటనే నోరంతా పొక్కింది. నాలుక పుండైంది. ఏదోలే అనుకున్నాడు.
ఈ లోగా రహతా వస్తే తన వెండి పాన్ డబ్బాను బండిలోనే ఉన్న చెట్టియార్ దగ్గర ఉంచి, తమలపాకులు కొని తెచ్చు కున్నాడు.
వాటిని దబ్బాలో పెడదామని చూస్తే డబ్బా కనిపించలేదు! ఏమైంది? చెట్టి గారక్కడే కూర్చున్నారు – ఆశ్చర్యపోయాడు.
ఇక నాలుక, నోరు అయ్యరు గారి స్వాధీనంలోలేవు తమలపాకులు వేసుకోవటం కాదుగదా, చివరకు ఏ పదార్ధాన్ని నమల లేక, మ్రింగలేక పోయాడు. ఇలా 18 రోజులు గడిచాయి.
అయ్యంగారికి తెలిసింది – తాను సాయికి ఇచ్చిన మాటను ఉల్లంఫిుంచి నందుకు అంటు తమలపాకులను అక్కడనే వదలి, మరల అక్కడే వేసుకోవటం. మొదటనే మద్రాసు నుండి వదలి పెడతాను అనుకుని, ప్రయాణంలో వేసుకుని ఉండవచ్చు.
కాని అయ్యంగారు అట్లా చేయలేదు. సాయిపై ప్రేమాభిమానాలు అయ్యంగార్‌కు ఉప్పొంగాయి. తన ప్రతి నడవడికను సాయి గమనిస్తున్నాడని గ్రహించాడు. సాయికి సంపూర్ణ శరణాగతుడయ్యాడు.
ఈ నాడు ఏప్రిల్ 27 సాయితో మొక్కుబడులు, తీర్చడాలు మొదలగు వాటితో జాగ్రత్తగా వ్యవరించాలి అని గ్రహిద్దాం!
Compiled By:- ముళ్ళపూడి పాండురంగ సాయినాథ్ & మున్నలూరి బోస్
Collected and Presented By: Mr: Sreenivas Murthy
Latest Miracles:
- మనసు ….. సాయి@366 మార్చి 17…Audio
- ఒకరు కాదు ఇద్దరు…..సాయి@366 సెప్టెంబర్ 1….Audio
- సాయి స్పీడ్ పోస్ట్…..సాయి@366 జూన్ 27…Audio
- ఆసుపత్రికి కాదు, సాయి వద్దకే!…..సాయి@366 ఏప్రిల్ 19….Audio
- నిర్భయుడవుకమ్ము! …. మహనీయులు – 2020… ఏప్రిల్ 10
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Recent Comments