సాయిని పస్తులుంచిన డాక్టరు! …..సాయి@366 ఏప్రిల్ 28….Audio



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba



Voice Support By: Mrs. Jeevani


సాయిబాబాను సేవించిన వైద్యులెందరో ఉన్నారు. వైద్య విద్యార్ధులు షిరిడీకి వచ్చి సాయిని సేవించారు.

బాల్యంలో ఒకే ఒక్కసారి సాయిని దర్శించిన వారు ఏ వృత్తి చేపడతారో ఎవరికి తెలుసు. సాయిని దర్శించాడు చిన్నారి గవాంకర్‌.

ఈయన ఏప్రిల్‌ 28న, 1906 జన్మించారు. ఏడెండ్ల వయసున్నప్పుడు జ్వరంవచ్చింది. ఎన్నో రకాల చికిత్సలుచేయించారు. గుణం కనబడలేదు. తగ్గని జ్వరంతో, ఛాతి అంతా కఫంతో నిండిపోయింది.

ఆయన ఇంటి దగ్గరలో హేమాడ్‌పంత్‌ అల్లుడు గాల్వంకర్‌ నివసించే వాడు. ఆయన సాయి భక్తుడు.

ఆయన గవాంకర్‌ తల్లి దండ్రులకు సాయిని గూర్చి తెలిపి సాయిని ప్రార్ధించమన్నాడు.

గవాంకర్‌ మేనత్త సాయి బాబాకు మొక్కుకున్నది. పిల్లవానికి ఆరోగ్యం చేకూరితే, షిరిడీకి వెళ్ళి సాయికి పేడాలు సమర్పిస్తామని.

తెల్లవారింది.

ఛాతి మీద చిన్న రంధ్రంలాంటిది కనిపించింది. అందులోంచి చీము, నీరు అంతా బయటకు వెళ్ళిపోయింది. శరీరం తేలికపడింది.

డాక్టరు వచ్చి చూచాడు. ఆయన అయోమయానికి గురయ్యాడు. గండం ఎలా గడిచిందో తెలియలేదు గాని, గండం తప్పిందని డాక్టరు సంతోషించాడు.

మొక్కులు మొక్కినంత తొందరగా వాటిని తీర్చరు.

శ్యామా విషయమూ అంతే,

గోవా భక్తుల విషయమూ అంతే.

ఐదు ఏండ్లు గిచాయి. గవాంకర్‌, తల్లి దండ్రులు, మేనత్త షిరిడీకి 1918లో వెళ్ళి సాయిని దర్శించారు. పేడలను సమర్పించారు.

సాయిబాబా ఆరు పేడలను గవాంకర్‌కు ఇచ్చి మిగిలినవి తాను తినసాగాడు. అక్కడే ఉన్న శ్యామా అదేమిటని ప్రశ్నించాడు.

ఆమె (మేనత్త) ”నన్ను ఆకలితో ఐదేండ్లు ఉంచింది” అన్నారు సాయి.

సాయి తాను ధరించిన కఫ్నీని ఇచ్చారు. శ్యామా ఆ కుర్రవాడు పెద్దవాడైన తరువాత ఇస్తానని తాను జాగ్రత్త చేశాడు. గవాంకర్‌ పెద్దవాడైన తరువాత ఆ కఫ్నీని ఇచ్చాడు.

గవాంకర్‌ డాక్టరు గవాంకర్‌ అయ్యారు.

”షిరిడీ చే సాయి బాబా” మొదలైన గ్రంథాలను రచించాడు.

షిరిడీ సాయి సంస్థానానికి కొంత కాలం ప్రెసిడెంటుగా కూడా చేశాడు.

Compiled  By:- ముళ్ళపూడి పాండురంగ సాయినాథ్ & మున్నలూరి బోస్

Collected and Presented By: Mr: Sreenivas Murthy

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles