నీది కానిది నీకు వద్దు…..సాయి@366 అక్టోబర్ 10….Audio



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba



Voice support by: Mrs. Jeevani


బాలాజీ పాటిల్‌ నేవాస్కర్‌ సాయి భక్తుడు. మరో సాయి భక్తుడైన విష్ణుక్షీరసాగర్‌ పొలాలను కౌలుకు తీసుకుని వ్యవసాయం చేసేవాడు నేవాస్కర్‌.

ఇలా కొన్ని సంవత్సరాలు గడిచాయి. క్షీరసాగర్‌ మరణించాడు. ఇక బాలాజీ పాటిల్‌ ఆ పంట భూములన్నీ తనవే అన్నాడు.

మధ్యవర్తులు ఎందరో ప్రయత్నించారు. వారి మాటలను వినలేదు ఆయన. చివరకు సాయి కూడా కల్పించుకొనవలసి వచ్చింది. అయినా ఆతడు భూములను తిరిగి ఇవ్వలేదు.

కోర్టు ద్వారా భూములను స్వాధీనపరచుకున్నారు క్షీరసాగర్‌ కుటుంబ సభ్యులు. మనది కాని దానిని మనం ఆశించకూడదు – ముఖ్యంగా సాయి భక్తులు.

సాయి మహా సమాధి చెందాడు. మహా సమాధి ఉత్సవాలు ఆశ్వయుజ శుక్ల పక్షం దశమి, ఏకాదశులతో ముగుస్తాయి.

అనంతరం షిరిడీలో కోజగిరి పున్నమిని జరుపుతారు. అంటే ఆశ్వయుజ పూర్ణిమనాడు ఆ పండుగను షిరిడీలో ఘనంగా జరుపుతారు.

ఈ సంఘటన ఏ సంవత్సరములో జరిగిందో తెలియదు కాని, కోజగిరి పున్నమి తరువాత (వెంటనే) జరిగింది.

ఒకసారి కోజగిరి పూర్ణిమకు డాక్టర్‌ కె.బి.గవాంకర్‌ మరొక సాయి భక్తుడైన చకోర్‌ అజ్‌గాంకర్‌ని ఆహ్వానించాడు.

ఆ రోజు గవాంకర్‌, చకోర్‌ అజ్‌గాంకర్లు ద్వారకామాయిలోని ద్వారకామాయి పటము ఎదురుగా ఉన్నారు.

సాయి పటముపై మూడు మల్లెపూలు ఉన్నాయి. ఆ ఇద్దరూ చూస్తుండగానే ఆశ్చర్యంగా ఒక మల్లెపువ్వు పైకి ఎగిరింది. పైకి ఎగిరిన తరువాత ఆ పువ్వు వారిద్దరి వద్ద పడ్డది. అది సాయి ప్రసాదమే.

సాయి బహుకరించాడని అజ్‌గాంకర్‌ పొంగిపోయాడు. ఈలోగా గవాంకర్‌ వంగి ఆ మల్లెపువ్వును తీసుకుని వెళ్ళిపోయాడు.

గవాంకర్‌, చకోర్‌ అజ్‌గాంకర్‌ కంటే పూర్వపు భక్తుడు. సాయిని దర్శించుకున్న పుణ్యాత్ముడు. బహుశ అందుకే సాయి గవాంకర్‌కు ఇచ్చాడేమో అనుకున్నాడు అజ్‌గాంకర్‌.

అజ్‌గాంకర్‌ గురుస్థానానికి వెళ్ళాడు. గవాంకర్‌ అతని వద్దకు వచ్చి ఆ మల్లెపువ్వును ఇచ్చాడు. ”ఇదేమి?” అని ప్రశ్నించాడు అజ్‌గాంకర్‌.

గవాంకర్‌ ”మిత్రుడా! ఆ మల్లెపువ్వు సాయి అనుగ్రహ ప్రసాదము. నేను దానిని నా వద్ద ఉంచుకొనుటకు ప్రయత్నించితిని. కాని ఆ పువ్వును అజ్‌గాంకర్‌కు ఇవ్వమని బాబా కంఠస్వరము ఆజ్ఞాపించింది. ఈ దివ్య పుష్పము నీదే” అన్నాడు గవాంకర్‌.

ఏది మనకు చెందుతుందో దానినే సాయి మనవద్ద ఉంచుతాడు. పేరాశకు పోవటం సాయికి ఇష్టం ఉండదు.

Compiled  By:- ముళ్ళపూడి పాండురంగ సాయినాథ్ & మున్నలూరిబోస్

Collected and Presented By: Mr: Sreenivas Murthy

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles