Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Voice support by: Mrs. Jeevani
‘షిరిడీ చే సాయిబాబా” అనే గ్రంథంలో డాక్టరు కేశవ్ భగవంత్ గవాంకర్, రామచంద్ర ఆత్మారాముడు, ఆయన కుటుంబం షిరిడీలోని సాయినాథుని వద్దకు సెప్టెంబరు 7న చేరారని వ్రాసాడు.
తర్కడ్ భార్యకు పార్శ్వపునొప్పితో చాలా కాలం నుండి బాధపడుతోంది. బాంద్రా మసీదులో ఉన్న పీర్ మౌలానా వద్దకు వెళ్ళింది బాధ నివారణ కోసం తన కుమారునితో కలసి.
ఆయన ”నేను ఈ వ్యాధిని నయం చేయలేను” అన్నారు. అయితే వారు నిరాశ చెందకుండా ”మీరు షిరిడీలో సాయిబాబా అనే నా సోదరుడు ఉన్నాడు. ఆయన నీ బాధను నివారిస్తాడు” అని చెప్పాడు.
ఆయన వద్ద సెలవు తీసుకుని గృహానికి చేరుకున్నారు తల్లీ, కుమారులు. పీర్ మౌలానా ఆ వ్యాధిని తగ్గించ గలడు. కాని అలా చేయలేదు.
ఎందుకంటే తర్కడ్ కుటుంబం సాయినాథుని తో బంధం కలిగి ఉన్నది. ఈ సంగతి వారికి చెప్పలేదు.
అయినా సాయినాథుని దర్శింపుమని సలహా ఇచ్చాడు. ఇలాగే మహనీయులు ఎవరు ఏ యోగికి చెందవలసిన వారో ఆ యోగి వద్దకే పంపిస్తారు.
తాజుద్దీన్ బాబా, బుట్టీని సాయినాథుని వద్దకు పంపాడు.
తర్కడ్ భార్య తన కుమారుడైన జ్యోతీంద్రతో కలసి సాయిని దర్శించింది.
వారిని చూడగానే ”అమ్మా! నిన్ను నా సోదరుడు ఇక్కడకు పంపాడు గదా! ఇక నీ జీవితాంతం శిరోభారము ఉండదు” అని తన చేతి వేళ్ళతో ఊదిని ఆమె నుదుట వ్రాశాడు.
ఇక ఆమె శిరోభారాన్ని ఎప్పుడూ అనుభవించ లేదు. ఆమెకు తలనొప్పి అనేది ఒక పీడ కల. ఆమె కుటుంబం సాయి చెంతకు చేరటానికే ఆమెకు శిరోభారం వచ్చింది.
వారి కుటుంబానికి సాయినాథుడే గురువు, దైవము అయ్యారు ఆనాటి నుండి ఎన్నో దివ్య లీలలను సాయి వారికి చూపాడు.
తర్కడ్ భార్య అనాలోచితంగానైనా కుక్కకు, పందికి ఆహారాన్ని కొంతైనా పెట్టటాన్ని శ్లాఫిుంచాడు సాయి.
ఆరు రూపాయల దక్షిణ ఇచ్చే బదులు షడ్రిపులను వదలి వేయ మన్నాడు.
ప్రతి దినం వారి గృహానికి భోజనానికి పోయేవాడని నిదర్శన పూర్వకంగా సాయి తెలిపాడు.
సాయి ఇవన్నీ చేయటానికి కారణం ఒకటే – స్థిరమైన భక్తి. తమ భక్తితో సాయిని మెప్పించిన కుటుంబం వారిది.
అట్టి భక్తి మనకు కూడా కలుగు గాక!
Compiled By:- ముళ్ళపూడి పాండురంగ సాయినాథ్ & మున్నలూరి బోస్
Collected and Presented By: Mr: Sreenivas Murthy
Latest Miracles:
- సాయి నాణెము …..సాయి@366 జూలై 31…Audio
- కథలు – గాథలు …..సాయి@366 జూన్ 15…Audio
- గణేశ శరణం! శరణం గణేశ!!…..సాయి@366 సెప్టెంబర్ 22….Audio
- భక్తి చాలు – సిద్ధులు వద్దు…..సాయి@366 సెప్టెంబర్ 12…Audio
- జగమే ‘జ్ఞానేశ్వరి’ ….సాయి@366 సెప్టెంబర్ 17…Audio
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Recent Comments