జగమే ‘జ్ఞానేశ్వరి’ ….సాయి@366 సెప్టెంబర్ 17…Audio



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba



Voice support by: Mrs. Jeevani


ఏదైనా ఆపదలో ఉన్నప్పుడు సాయిని ప్రార్ధిస్తే బయటపడే మార్గాలను తెలుపుతారు.

బొంబాయికి చెందిన ఎ.కె. రసాల్‌ సాయి భక్తుడు. ఆ కుటుంబం వారంతా సాయి భక్తులే. నవంబరు 15న (1979) సాయి సచ్చరిత పారాయణ మొదలుపెట్టాడు.

 ఆ రోజు కార్తీక బహుళ ఏకాదశి. ఆ రోజునే జ్ఞానేశ్వరుడు సజీవ సమాధిలోనికి వెళ్ళారు.

ఆ రోజున ఆళందికి వెళ్ళి ఆయన సజీవ సమాధిని దర్శిస్తారు, ఆయన రచించిన జ్ఞానేశ్వరిని పారాయణ చేస్తారు.

అప్పుడు రసాల్‌కు సాయి సచ్చరిత పారాయణ అనంతరం మరల సాయి సచ్చరితను చదవాలా? లేక జ్ఞానేశ్వరిని చదవాలా? తనంతట తాను ఏ సంగతి తెల్చుకోలేకపోయాడు.

ఒక ఆలోచన చేశాడు. 17 సెప్టెంబరు నాడు ఆయన తన వారిని బొంబాయిలోని సాయి సంస్థానం ఆఫీసుకు వెళ్ళి, అచ్చట ఉన్న సాయినాథుని పటం ముందు సాయి సచ్చరిత పారాయణ, జ్ఞానేశ్వరి పారాయణ అనే చీట్లు వేసి, వచ్చిన చిట్టి  ప్రకారం ఆ పవిత్ర గ్రంథాన్ని పారాయణచేద్దాం అనుకున్నాడు.

అక్కడ చీట్లు వేయగా జ్ఞానేశ్వరిని పారాయణ చేయమని వచ్చింది.

ఇక జ్ఞానేశ్వరిని పారాయణ చేయాలి అని రసాల్‌ నిర్ణయించుకున్నాడు. సాయి సచ్చరిత పారాయణ అనంతరం తన ఆఫీసుకు వెళ్ళాడు ఆలస్యంగా.

ఈలోగా తనకు వచ్చిన షిరిడీ సాయి ప్రసాద పొట్లాన్ని, తన మిత్రుడు అందచేశాడు. అది శుభ శకునమనిపించింది.

మధ్యాహ్న విరామ సమయంలో ఆయన వద్దకు 108 సార్లు జ్ఞానేశ్వరి పారాయణ చేయదలచి, అప్పటికి 58 పారాయణలు చేసిన వ్యక్తి కలిసాడు.

ఇంకా, ఆళందిలో జ్ఞానేశ్వరుని సమాధిని దర్శించి, జ్ఞానేశ్వరి పారాయణ పూర్తి చేసి వచ్చిన మరొక స్నేహితుడు కూడా అప్పుడే కలిశాడు.

ఆనాడే జ్ఞానేశ్వరి పారాయణ ప్రారంభించిన సాయి భక్తుడు వచ్చాడు.

ఆఫీసు అనంతరం శ్రీ విష్ణు బువా పింగుళ్‌కర్‌ అనే సాయి భక్తుని కలసి, జ్ఞానేశ్వరి పారాయణ చేయబోతున్నానని తెలిపాడు.

పింగుళ్‌కర్‌ ఆ రోజే తనకు షిరిడీ నుండి వచ్చిన సాయి ప్రసాదాన్ని ఇచ్చాడు.

ఇక ఇంటికి చేరాడు రసాల్‌. తనకు షిరిడీ నుండి వచ్చిన పాకెట్ ను విప్పగా అందులో యుద్ధభూమిలో శ్రీకృష్ణుడు అర్జునునకు భగద్గీతను ఉపదేశిస్తున్న ఫోటో వచ్చింది.

జగమే జ్ఞానేశ్వరమయంగా మారింది ఆ రోజు!

Compiled  By:- ముళ్ళపూడి పాండురంగ సాయినాథ్ & మున్నలూరిబోస్

Collected and Presented By: Mr: Sreenivas Murthy

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles