Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Voice Support By: Mrs. Jeevani
స్వప్నాలను తన మహిమలను చాటుకోవటానికి కాకుండా, భక్తుల ఈతి బాధలను తీసివేయడానికి సాయిబాబా ఉపయోగించాడు. సాయి భీమాజీ పాటిల్‌కు స్వప్నంలో వ్యాధిని నిర్మూలించాడు.
మానవుని నీతిపరునిగా చేయటానికి స్వప్నాన్ని ఉపయోగించారు గోవిందభావు విషయంలో.
భక్తి భావాన్నిపెంపొందింప చేయటానికి కూడా సాయి స్వప్నాలను వాడుకున్నారు.
ఒకసారి బాబా, రామచంద్ర వాసుదేవగైసాస్ అనే భక్తునికి స్వప్నంలో కనిపించి ”53 నాకు భిక్షగా ఇవ్వు” అని అడిగారు.
సాయి తాను బీదవాడు కాబట్టి 53 రూపాయలు కాక 53 కానులను సమర్పింప మన్నారని భావించి, 53 కానులనుసమర్పించాడు.
హేమాడ్‌పంత్, సాయి భావన అది కాదని, 53 అధ్యాయాలున్న ప్రామాణిక గురుచరిత్ర పారాయణ చేయమని అర్థమని తెలుపగా, గైసాస్ దానిని పారాయణ చేసాడు.
ఇంకను సాయి తన భక్తుడైన సాఠేకి స్వప్నములో గురుచరిత్రను చేతిలోపట్టుకుని, దానిలోని విషయములను బోధపరచునట్లు చేసినారు.
ఈ విషయమై సాఠేకాకాకు తెలుపగా, సాయిని దాని భావమేమని అడిగెను. సాయి దానిని మరల సాఠే చదువవలెనని చెప్పెను.
హేమాడ్‌పంత్ సాయిబాబా ఏప్రియల్ 2న బీ.వి. దేవుకు స్వప్నములో కనిపించారని సాయి సచ్చరితలో వ్రాశారు.
లోగడసాయిబాబాదేవుకుజ్ఞానేశ్వరుడురచించినజ్ఞానేశ్వరినిపారాయణచేయవలసినదనిఆదేశించారు. ఆ ఆదేశం ప్రకారం దేవు పారాయణ ప్రారంభించాడు.
ఏప్రియల్ 2న సాయి బీ.వి. దేవుకు స్వప్నములో కనిపించి ”భగవద్గీత బోధపడుచున్నదా? లేదా?” అని ప్రశ్నించాడు. దేవు” లేదు” అన్నాడు. సాయి ”ఇంకా ఎప్పుడు తెలిసికొనెదవు?” అన్నారు.
దేవు కన్నీరు కారుస్తూ ”నీ కృప వర్షించనిదే బోధపడుట కష్టముగా ఉన్నది” అన్నాడు. సాయి ”చదువునపుడు నీవు తొందరపడుచు చదువుతున్నావు. నా ముందర చదువుము నా సమక్షమున చదువుము” అన్నారు.
దీనిని బట్టి పారాయణ చేయునపుడు సాయియే మన ఎదురుగా ఉన్నారని, నెమ్మదిగా పారాయణ చేయవలెనని దేవకే గాక మనందరకూ తెల్పినట్లయినది.
Written by: Mullapudi Panduranga Sainath & Munnaloori Bose.
Collected and Presented By: Mr: Sreenivas Murthy
Latest Miracles:
- గరుడ గమన రారా! …..సాయి@366 ఏప్రిల్ 21….Audio
- ముగ్గురమ్మలు …..సాయి@366 ఏప్రిల్ 24….Audio
- శ్రీ సాయి సచ్చరిత్ర పారాయణతొ అప్పాజిసుతార్ వ్యాధి నయమగుట–Audio
- సలహా…..సాయి@366 ఏప్రిల్ 22….Audio
- జగమే ‘జ్ఞానేశ్వరి’ ….సాయి@366 సెప్టెంబర్ 17…Audio
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Recent Comments