Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
This Audio Prepared by Mrs Lakshmi Prasanna
- Mir-161-0712-అప్పాజిసుతార్ 1:55
1929 వ సంవత్సరములో షిరిడి వాస్తవ్యుడైన అప్పాజీసుతార్ కాలిమీద కురుపు లేచి ఎగ్జిమాతో బాధపడుతూ కోపరగాంలోని ఆసుపత్రిలో చేరి వైద్యము చేయించు కోనుచుండెను.
కాని ఫలితము లేకపోయినది. మాధవరావు(శ్యామ) వైద్యము చేసినా తగ్గలేదు. అప్పుడు నాసిక్ లోని హాస్పిటల్ లో చేరినాడు.
ఇతను ఆసుపత్రిలో చేరిన ఎనిమిదవరోజు బాబా స్వప్నములో కన్పించి “నీవు షిరిడీ వెళ్ళి అచట సచ్చరిత్రను పారాయణ చేయుచు ఊదీని సేవించుము” అని చెప్పినారు.
బాబా చెప్పినట్లు అప్పాజీసుతారు షిరిడీ వెళ్ళినాడు. అప్పటి వరకు షిరిడీలో సాయిసచ్చరిత్ర పారాయణ చేసేడి విఠల్ రావు అను భక్తుడు “సిరివాల్” అను ప్రదేశమునకు వెళ్ళెను.
అందుచే అప్పాజిసుతారును శ్రీ సాయిబాబా సచ్చరిత్ర పారాయణ చేయమని అచ్చటి వారు కోరిరి. ఆ విధముగా బాబా కలలో చెప్పినట్లు (ఇతర గ్రంధములతో పాటు) శ్రీ సాయిబాబా జీవిత చరిత్ర పారాయణ చేయుచు,
ఊదీ సేవించుటతో వ్యాధి ఆ వారము రోజులలో తగ్గినది. శ్రీ సాయిబాబా తామేది చెప్పినా అది పూర్తి అగుటకు, తగు ఏర్పాట్లు తానె చేయును. బాలాషింపి మలేరియా వ్యాధి తగ్గుటకు నల్లకుక్కకు పెరుగన్నం పెట్టమని తానె నల్లకుక్క రూపమున వచ్చి దానిని స్వీకరించిరి.
ఇచ్చటను సచ్చరిత్ర పారాయణ ఏర్పాటు తానే చేసిరి. ఇట్టి వైద్యము బాబా అప్పుడు చేసిరా? సచ్చరిత్ర పారాయణ వ్యాధి తగ్గుటకు వైద్యమైనది. ఇటువంటి అద్బుత లీలలు మరుగునపడరాదు.
సంపాదకీయం: సద్గురులీల ( మార్చి – 2014)
ప్రియమైన సాయి భక్తులకు ఒక మనవి. బాబా తో మీకు జరిగిన అనుభవాలను మాతో పంచుకో గలరు
మా ఈమెయిలు: saibabaleelas@gmail.com
Latest Miracles:
- ఆరోగ్యానికి సాయి సచ్చరిత్ర పారాయణ–Audio
- అభిషేక తీర్దముతొ ఆరోగ్యము చెకూరుట–Audio
- సచ్చరిత్ర పారాయణ ఫలం …..సాయి@366 జూన్ 18…Audio
- శ్రీ సాయి సచ్చరిత్రను చదువుతూ ప్రాణం విడిచేలా వరమివ్వు నాకింకేమి వద్దు
- నేను బావిలో పడుచు బాబా అని పిలిచాను. బాబా నన్ను నీటిలో మునగకుండా పట్టుకునికాపాడారు–Audio
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Recent Comments