Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
అఖిలాండకోటి బ్రహ్మండనాయక రాజది రాజ యోగిరాజా పరబ్రహ్మ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై
This Audio Prepared by Mrs Lakshmi Prasanna
- Mir-28 నేను బావిలో పడుచు బాబా అని పిలిచాను 2:41
రామచంద్రదేశముఖ్ షిరిడీ నివాసి. తల్లిదండ్రులు బాబా భక్తులైనప్పటికీ ఇతనికి శ్రీ సాయిబాబా యందు భక్తి లేదు.
1961 లో ఇతని కుమార్తెకు టైఫాయిడ్ వస్తే ఆసుపత్రి చేర్చి వైద్యము చేయించాడు.నెలరోజులు వున్నా జ్వరము తగ్గలేదు.
పెద్దాసుపత్రికి తీసుకెళ్ళమని పంపివేశారు. దేశముఖ్ కు ఏమి చేయాలో తోచలేదు.
షిరిడీలోనే వుంటున్న శ్రీశివనేశన్ స్వామి వారికి చెప్పుకున్నాడు. ఆ పిల్లకు వాడే మందులన్నీ ఆపివేయమని, బాబాపై భారమువేసి బాబా పాద తీర్ధము, ఊధీ యివ్వమని స్వామి దేశముఖ్ కు చెప్పారు.
ఎన్ని మందులువాడిన తగ్గని టైఫాయిడ్ జ్వరము బాబా పాదతీర్ధము, ఊధీతో తగ్గిపోయింది.
అప్పటి నుండి దేశముఖ్ బాబా భక్తుడైనాడు.
దేశముఖ్ కుమార్తెకు పెండ్లి కుదరటం లేదు. శివనేశన్ స్వామికి చెప్పుకుంటే సాయిసచ్చరిత్ర పారాయణ చేయించమన్నారు స్వామి.
పారాయణ పూర్తయ్యేలోపే మగపిల్లవారి వాండ్లు వస్తారని చెప్పారు. అలాగే జరిగింది.
పెండ్లి సమయములో అనుకున్న వారికన్నా ఎక్కవ మంది వచ్చారు. వండిన వంటకములు చాలేటట్లు లేవు.
అప్పుడు స్వామిజీ ఆ వండిన పదార్థ పాత్రలపై గుడ్డకప్పించి ఊధీ వేసి వడ్డన చేయించగా అందరికి సరిపోవుటే కాదు. వండిన పదార్దములు వండినట్లు మిగిలి యున్నవి.
ఒకసారి దేశముఖ్ తల్లి తెల్లవారుఝామున 3 గంటలకు బావి దగ్గరకు వెళ్లగా పొరపాటున కాలుజారి బావిలో పడ్డది.
తెల్లవారిన తరువాత ఆమె ములుగు విని ఆమెను బయటకు తీశారు.ఆశ్చర్యమేమంటే 10 అడుగుల పైన నీరున్నా ఆమె కంఠము వరకే మునిగి పైన కనిపిస్తూనే ఉన్నది అని ఆమె అన్నది.
“నేను బావిలో పడుచు బాబా అని పిలిచాను. బాబా నన్ను నీటిలో మునగకుండా పట్టుకునికాపాడారు” అని చెప్పింది. నమ్మిన వారిని, వారి కుటుంబములోని అన్ని సమస్యల నుండి ఇలా కాపాడుతుంటారు బాబా.
శ్రీ ఆలూరు గోపాలరావు గారి విరచిత శ్రీ సాయి బాబా సత్ చరితము
సంపాదకీయం: సద్గురులీల ( జూన్ – 2014)
ప్రియమైన సాయి భక్తులకు ఒక మనవి. బాబా తో మీకు జరిగిన అనుభవాలను మాతో పంచుకో గలరు
మా ఈమెయిలు: saibabaleelas@gmail.com
Latest Miracles:
- ఆరతి పాడాలి అని కోరుకున్న ప్రతిసారి, భక్తుని కోరికను నెరవేర్చుతున్న బాబా వారు.
- బాబా దయతో ఉబ్బసం వ్యాధి నయం
- సాయి మార్గములో పెద్దలు(శ్రీ పూర్ణానంద స్వామి – శ్రీశైలం)
- బాబా వారి వస్త్రములను శివనేశన్ స్వామికి ఇప్పించుట.
- శివనేశన్ స్వామిని చావడి బాబా అని సంబోధించుట.
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
2 comments on “నేను బావిలో పడుచు బాబా అని పిలిచాను. బాబా నన్ను నీటిలో మునగకుండా పట్టుకునికాపాడారు–Audio”
K ashokkumar
October 11, 2018 at 4:52 pmOmsairam
K ashokkumar
October 11, 2018 at 4:55 pmOm Sai ram