బాబాకు సంతుష్టిగా భోజనము పెట్టుట యెట్లు?



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


రాజాధిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సమర్ద సద్గురు సాయినాధ్ మహరాజ్‌ కీ జై!!

This Audio prepared by Mr Sreenivas Murthy

  1. Art-4 బాబాకు సంతుష్టిగా భోజనము పెట్టుట యెట్లు 2:41

ఒకప్పుడు ఆత్మారుముని భార్య షిరిడీలో నొక ఇంటియందు దిగెను. మధ్యాహ్నభోజనము తయారయ్యెను.

అందరికి వడ్డించిరి. ఆకలితోనున్న కుక్క యొకటి వచ్చి మొఱుగుట ప్రారంభించెను.

వెంటనే తర్ఖడ్ భార్యలేచి యొక రొట్టెముక్కను విసరెను. ఆకుక్క ఎంతో మక్కువగా ఆ రొట్టెముక్కను తినెను.

ఆనాడు సాయంకాలము ఆమె మసీదుకు పోగా బాబా యిట్లనెను”.

తల్లీ! నాకు కడుపునిండ గొంతువరకు భోజనము పెట్టినావు.

నా జీవశక్తులు సంతుష్టి చెందినవి. ఎల్లప్పుడు ఇట్లనే చెయుము. ఇది నీకు సద్గతి కలుగజేయును.

ఈ మసీదులో గూర్చుండి నేనెన్నడసత్యమాడను. నాయందట్లే దయ యుంచుము. మొదట యాకలితో నున్న జీవికి భోజనము పెట్టిన పిమ్మట నీవు భుజింపుము.

దీనిని జాగ్రత్తగా జ్ఞప్తియందుంచుకొనుము”. ఇదంతయు ఆమెకు బోధపడలేదు. కావున ఆమె యిట్లు జవాబిచ్చెను.

‘బాబా! నేను నీ కెట్లు భోజనము పెట్టగలను? నా భోజనముకొర కితరులపై ఆధారపడి యున్నాను.

నేను వారికి డబ్బిచ్చిభోజనము చేయుచున్నాను.’

అందులకు బాబా యిట్లు జవాబిచ్చెను”. నీ విచ్చిన ప్రేమపూర్వకమైన యా రొట్టెముక్కను తిని యిప్పటికి త్రేనుపులు తీయుచున్నాను.

నీ భోజనమునకుపూర్వ మేకుక్కను నీవు జూచి రొట్టె పెట్టితివో అదియు నేను ఒక్కటియే. అట్లనే, పిల్లులు,

పందులు, ఈగలు, ఆవులు మొదలుగా గలవన్నియు నా యంశములే. నేనే వాని యాకారములో తిరుగుచున్నాను. ఎవరయితే జీవకోటిలో నన్ను జూడగలుగుదురో వారే నా ప్రియభక్తులు.

కాబట్టి నేనొకటి తక్కిన జీవరాశి యింకొకటి యను ద్వంద్వభావమును భేదమును విడిచి నన్ను సేవింపుము“.

ఈ యమృతతుల్యమగు మాటలు విని యామె మనస్సు కరగెను.

ఆమె నేత్రములు కన్నీటితో నిండెను. గొంతు ఆర్చుకొనిపోయెను. ఆమె యానందమునకు అంతులేకుండెను.

సంపాదకీయం: శ్రీ సాయి సత్ చరిత్రము

ప్రియమైన సాయి భక్తులకు ఒక మనవి. బాబా తో మీకు జరిగిన అనుభవాలను మాతో పంచుకో గలరు

మా ఈమెయిలు: saibabaleelas@gmail.com

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles