బాబాకు సంతుష్టిగా భోజనము పెట్టుట ఎట్లు?



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


అఖిలాండకోటి బ్రహ్మండనాయక రాజది రాజ యోగిరాజా పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై

సాయి బంధువులారా మరియు దివ్యాత్మ స్వరూపులారా అందరికీ సాయి శుభాశీస్సులు

బాబాకు సంతుష్టిగా భోజనము పెట్టుట ఎట్లు?

ఈ రోజు  సాయి సత్ చరిత్రలో ఒకముఖ్యమైన ఘట్టాన్ని (9 వ. అధ్యాయము) ఒక సారి మననం చేసుకుందాము.

ఒకప్పుడు ఆత్మారాం తార్ఖడ్ భార్య షిరిడీలో ఒక ఇంటి యందు దిగారు. మధ్యాహ్న భోజనము తయారయింది. అందరికీ వడ్డించారు. అంతలో ఆకలితో ఉన్నకుక్క ఒకటి వచ్చి మొఱగసాగింది. వెంటనే తార్ఖడ్ భార్య లేచి ఒక రొట్టె ముక్కను విసిరింది. ఆ కుక్క ఎంతో మక్కువగా ఆరొట్టె ముక్కని తిని వెళ్ళిపోయింది.  

ఆనాడు సాయంకాలము ఆమె మసీదుకు వెళ్ళినప్పుడు బాబా ఆమెతో “తల్లీ నాకు కడుపు నిండ గొంతు వరకు భోజనము పెట్టావు. నా  జీవశక్తులు సంతుష్టి చెందినవి. ఎల్లప్పుడు యిలాగే చేస్తూ ఉండు. యిది నీకు సద్గతి కలుగచేస్తుంది. ఈ మసీదులో కూర్చుండి నేనెన్నడు అసత్యమాడను. నాయందు యిలాగే దయ ఉంచు. మొదట ఆకలితో ఉన్న జీవికి భోజనముపెట్టిన పిమ్మట నీవు భుజింపుము. దీనిని జాగ్రత్తగా జ్ఞప్తియందుచుకొనుము” అని అనేటప్పటికి తార్ఖడ్ గారి భార్యకు ఏమీ అర్ధం కాలేదు.

అప్పుడు ఆమె “బాబా నేను నీకెట్లా భోజనము పెట్టగలను. నేనే నా భోజనానికి యితరుల మీద ఆధారపడి ఉన్నాను. నేను వారికి డబ్బు ఇచ్చి  భోజనము చేస్తున్నాను” అన్నారు.

అప్పుడు బాబా యిలా జవాబిచ్చారు. “నీవు ప్రేమపూర్వకముగా పెట్టిన ఆ రొట్టె ముక్కను తిని యిప్పటికీ త్రేనుపులు తీయుచున్నాను. నీ భోజనమునకు ముందు ఏ కుక్కను చూచి నువ్వు రొట్టె పెట్టావో అదియు నేను ఒక్కటే. అలాగే, పిల్లులు, పందులు, ఈగలు, ఆవులు మొదలైనవన్నీ కూడా నా అంశములే. ఎవరయితే సకల జీవకోటిలో నన్ను చూడగలుగుదురో వారే నా ప్రియ భక్తులు. అందుచేత నేను వేరు, తక్కిన జీవరాశి అంతయు వేరు అనే ద్వంద్వభావమును, భేదమును విడిచి నన్ను సేవింపుము”.

ఈ విధముగా బాబా చెప్పిన అమృతవాక్కులు ఆమె హృదయాన్ని కదిలించాయి. ఆమె నేత్రములు అశ్రువులతో నిడిపోయాయి. గొంతు గద్గదమయింది. ఆమె ఆనందానికి అంతులేదు.

సాయి భక్తులారా! చదివారు కదా! యిక్కడ బాబా గారు చెప్పినది మనం తూ.చా. తప్పకుండా ఆచరిస్తే ఆయన అనుగ్రహానికి మనం పాత్రులమవుతాము. ఆకలితో ఉన్న జీవిని తృప్తి పరుస్తే బాబాని సంతుష్టిని చేసినట్లే. ఆకలితో ఉన్న జీవి అంటే జంతుజాలాలే కాదు, మానవుడని కూడా.

యిక్కడ మనం ఒక విషయం గమనించాలి. మనం సాధారణంగా మన యింటిలో మనం ఎంగిలి చేసినవి, మనం తినడానికి పనికి రాకుండా పాడయిన పదార్ధాలను సామాన్యంగా పిల్లులకు, కాకులకు, బిచ్చగాళ్ళకు, లేక మన యింటిలో పని మనుషులకు వేస్తూ ఉంటాము. ఆవిధముగా చేయడం పొరపాటు. మనం యితరులకు పెట్టినా, జంతుజాలాలకు పెట్టినా మనం తినగలిగేదే పెట్టాలి.

మీకొక అనుమానం రావచ్చు. మరి పాడయిపోయిన పదార్ధాలను బయట పడవేస్తున్నాము కదా! మరి అవి పక్షులు, పిల్లులు తింటాయి కదండీ అని. ఒకటి గుర్తు ఉంచుకోండి.మీరు కావాలని మాత్రం పెట్టవద్దు. పాడయిన పదార్ధాలను సహజంగా బయటపడవేస్తు ఉంటాము.

కాని వాటిని ఏజీవికి పిలిచి మాత్రం పెట్టకండి. వాటిని యితర జంతుజాలాలు యిష్టమయితే తింటాయి లేకపోతే వాసన చూసి వదలివేస్తాయి. మనం అనుకుంటాము. బిచ్చగాడే కదా! వాడు ఏది పెట్టినా తింటాడులే అని. కాని ఒకటి గుర్తు ఉంచుకోండి. బిచ్చగాడు ప్రతీ రోజు అటువంటి ఎంగిలి పదార్ధాలను, పాడయిపోయిన పదార్ధాలను తింటూ ఉండవచ్చు. ఒక్కసారి మీరు కనక శుభ్రమైన ఆహారాన్ని అతనికి పెట్టారనుకోండి. అతను తన జీవితంలో మొదటిసారిగా తిన్నప్పుడు ఎంత తృప్తిపడతాడొ ఊహించుకోండి. అవునంటారా కాదంటారా?

మీరు పండగనాడు, బూరెలు, పులిహార చేసుకున్నారు. వాటిని కొంచెం పెట్టి చూడండి. ఎంత తృప్తిగా ఆరగిస్తారో? సాధారణంగా మనము ఏమి చేస్తాము? ఆరోజు తిన్నంత తిని, మిగిలినవి మరుసటిరోజు బాగుంటే తింటాము బాగుండకపోతే బిచ్చగాడికి వేస్తాము? అవునా? మరి? ఒక రెండో లేక నాలుగో ఆరోజే దానం చేసేయండి. దానివల్ల మనకున్నదానిలో ఏమీ తరిగిపోదు కదా?

ప్రతీరోజు భోజనానికి కూర్చునే ముందు మొదటగా అన్నం కొంచెం తీసి బయట పెట్టండి. ఆకలితో ఉన్న ఏ పక్షి అయినా దానిని తింటుంది. బయటపెట్టిన తరువాత మీరు భోజనం చేయండి.

బాబాని సంతుష్టుడిని చేయడానికి, ఆయన అనుగ్రహానికి పాత్రులవడానికి మనము ఉపవాసాలు చేయనక్కరలేదు. బాబాకు పెద్ద పెద్ద దండలు వేసి అలంకరించనక్కరలేదు. ప్రతీ జీవిలోను ఆయనని చూడాలి. ఆకలిగొన్న వారికి అన్నం పెట్టాలి. బాబా సంతుష్టి చెందుతారు. అప్పుడే బాబాకు మీరు మీ ఇష్టమైనదీ మీ శక్తికొలదీ సమర్పించండి. బాబా మీద మీ ప్రేమను, భక్తిని తెలుపుకొనండి.

ఈ సమాచారం ఈ  లింక్ http://telugublogofshirdisai.blogspot.co.ke/ ద్వార సేకరించడం జరిగింది.

సర్వం సాయినాథర్పాణమస్తు 

ప్రియమైన సాయి భక్తులకు ఒక మనవి. బాబా తో మీకు జరిగిన అనుభవాలను మాతో పంచుకో గలరు
మా ఈమెయిలు: saibabaleelas@gmail.com

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Have any Question or Comment?

0 comments on “బాబాకు సంతుష్టిగా భోజనము పెట్టుట ఎట్లు?

Maruthi.Velaga

Jai Saibaba..

Comments are closed for this post !!

Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles