Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
అనంతకోటిబ్రహ్మాండ నాయకరాజాధిరాజయోగిరాజపరబ్రహ్మశ్రీసచ్చిదానందసమర్థసద్గురుసాయినాథ్మహరాజ్కీజై!!
ముందు భాగం కోసం ఇక్కడ క్లిక్ చేయండి
(సాయి బాబా వారి భక్తులకి మనవి : బాబా జీవిత చరిత్రను చిన్న చిన్న కథల రూపం లో పిల్లలకు అందచేసే విధముగా రచయిత వ్రాశారు. కల్పితాలు అనుకోవద్దు అని మనవి.)
గోవా నుంచి వచ్చిన ఇద్దరు వ్యక్తుల్లోనూ ఒక వ్యక్తిని అడిగి మరీ దక్షిణ తీసుకున్నారు బాబా. తానెందుకు ఆ దక్షిణను స్వీకరించిందీ ఆ వ్యక్తి నోటి వెంటే తెలియజేశారాయన.
ఆత్రపడుతున్న రెండో వ్యక్తిని చూశారు. అతని చేతిలోని డబ్బుని గమనించారు.‘‘ఏమిటది?’’ అడిగారతన్ని.‘‘నేను మీకు ముప్పయి అయిదు రూపాయలు బాకీ పడ్డాను. స్వీకరించండి.’’ అందివ్వబోయాడు. అందుకోలేదు బాబా.
అడిగారిలా.‘‘ఎలా బాకీ పడ్డావు?’’చెప్పడానికి సంశయించాడతను.‘‘పర్వాలేదు, చెప్పు’’ రెట్టించారు బాబా.
‘‘నా దగ్గర ఓ వంటవాడున్నాడు. ముప్పయి అయిదు సంవత్సరాలుగా నా దగ్గరే ఉంటున్నాడు. వాడు ఓ రోజు, నా బీరువాలోంచి ముప్పయి వేల రూపాయలు దొంగిలించాడు. పరారయ్యడు. అంత డబ్బు పోగొట్టుకోవడంతో రాత్రీపగలూ ఏడ్చాను. ఒకరోజు కలలో ఓ పకీరు కనిపించాడు.
‘నీ డబ్బు నీకు దొరికితే శిరిడీకి వెళ్ళి బాబా దర్శనం చేసుకుంటానని మొక్కుకో’ అన్నారు. మొక్కుకున్నాను. అలా మొక్కుకున్నానో లేదో రెండంటే రెండే రెండు రోజుల్లో దొంగిలించిన డబ్బుతో పాటుగా వంటవాడు తిరిగి వచ్చాడు.
నా డబ్బు నాకు ఇచ్చి, క్షమించమని వేడుకున్నాడు. క్షమించాను వాణ్ణి. తర్వాత వ్యాపారరీత్యా తీరిక లేకపోవడంతో శిరిడీకి రాలేకపోయాను. మొక్కు సంగతి కూడా మరచిపోయాను.
ఒకరోజు పకీరు మళ్ళీ కలలో కనిపించాడు.‘‘నీ మొక్కు ఎప్పుడు తీరుస్తున్నావు?’’ అడిగాడు. అప్పుడు గుర్తు వచ్చింది బాబా దర్శనం. పరిగెత్తుకుని వచ్చానిక్కడికి.’’ చెప్పాడు ఆ వ్యక్తి.
‘‘దర్శనం మాత్రమే మొక్కుకున్నావు. దక్షిణ ఇస్తానని మొక్కుకోలేదు. అవునా?’’ అడిగారు బాబా.‘అవును’’‘‘అలాంటప్పుడు దక్షిణ ఎందుకు చెల్లిస్తున్నావు? నాదయితేనే నేను తీసుకుంటాను. కాకపోతే నాకెందుకు బరువు?’’ నవ్వారు బాబా.
శ్యామాని తీసుకుని కొంచెం ముందుకు నడిచారు.‘‘నేనేదీ ఊరకే తీసుకోను శ్యామా. నాకు ఇవ్వాల్సి ఉంటేనే అడిగి మరీ తీసుకుంటాను. ఒక్క రూపాయి తీసుకున్నాననుకో, పది రూపాయలు తిరిగి ఇస్తాను.
నీకో సంగతి తెలుసా? దక్షిణ రూపంలో భక్తుల దగ్గర నుంచి నేను తీసుకుంటున్నది డబ్బు కాదు, వారి పాపం తీసుకుంటున్నాను.’’ అన్నారు బాబా.
నిజమేననిపించింది శ్యామాకి.‘‘దేవుడిచ్చిన డబ్బుని దానం చెయ్యాలి. లేదంటే దక్షిణగా ఆ డబ్బుని దేవుడికే తిరిగి ఇవ్వాలి.’’ అన్నారు బాబా.అవునవును అనుకున్నాడు శ్యామా.
‘‘అయినా నేనడిగే దక్షిణ నాకెవరూ ఇవ్వరు. పైసా ఓరిమి, పైసా నిష్ఠ దక్షిణగా కావాలంటాను. ఇచ్చే నాథుడేడి? లేడు.’’ అన్నారు బాబా. శ్యామాని నవ్వుతూ చూశారు.
‘‘ఆవేశపడకూడదు శ్యామా! దేనికయినా ఓరిమి కావాలి. ఓరిమితోనే అన్నీ తెలుసుకోగలం.’’ అన్నారు బాబా. చేసిన తప్పు తెలిసింది. క్షమించమన్నట్టుగా చేతులు జోడించాడు శ్యామా.
తరువాత భాగం కోసం ఇక్కడ క్లిక్ చేయండి
ప్రియమైన సాయి భక్తులకు ఒక మనవి. బాబా తో మీకు జరిగిన అనుభవాలను మాతో పంచుకో గలరు
మా ఈమెయిలు: saibabaleelas@gmail.com
Latest Miracles:
- ‘మనసుంటే మార్గం ఉంటుంది. ఆలోచించు. నీ దగ్గర డబ్బు లేకపోవడమేమిటి?’
- హనుమంతుని ముందరా?…..సాయి@366 సెప్టెంబర్ 26….Audio
- ఇస్తానన్న దక్షిణ మర్చిపోతే స్వప్నం ద్వారా గుర్తు చేసారు బాబా
- బాబా సాధువయినపుడు ,బాబా కి డబ్బు ఎందుకవసరము—Audio
- వద్దంటే డబ్బు…..సాయి@366 జూలై 2….Audio
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
2 comments on “భక్తుల దగ్గర నుంచి నేను తీసుకుంటున్నది డబ్బు కాదు, వారి పాపం తీసుకుంటున్నాను”
Maruthi.Velaga
February 20, 2017 at 8:10 amSri Sachhidananda sadguru Sainath Maharaj Ki Jai..
Maruthi.Velaga
February 20, 2017 at 8:10 amSri Sachhidananda sadguru Sainath Maharaj Ki Jai..