వద్దంటే డబ్బు…..సాయి@366 జూలై 2….Audio



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba



Voice support by: Mrs. Jeevani


సాయిబాబాను దర్శించిన కళాకారులలో బోడాస్‌ ఒకరు. బోడాస్‌ పూర్తి పేరు గణేశ గోవింద బోడాస్‌.

అందరూ ఆయనను గణపత్‌రావ్‌ బోడాస్‌ అని పిలిచేవారు. మరాఠీ నాటకరంగంలో కొన్ని సంవత్సరాలపాటు ఒక వెలుగు వెలిగిన వ్యక్తి బోడాస్‌.

ఈయనను గురించి హేమాడ్‌పంత్‌ ‘సాయి సచ్చరిత్ర’ 14వ అధ్యాయంలో వ్రాశారు. ఈయన 2 జూలై 1880న షేగాం అనే గ్రామంలో జన్మించాడు.

1965లో మరణించే వరకు నాటకరంగాన్ని సేవించాడు. చిన్నతనములోనే నాటకాల పట్ల, సంగీతము పట్ల ఈయనకు గల అభిరుచి వలన కిర్లోస్కర్‌ నాటకమండలిలో సభ్యత్వము పొందినాడు.

ప్రతి చిన్న విషయాన్ని సూక్ష్మంగా పరిశీలించి అవగాహన చేసుకునేవాడు. ఈయన ఏ మహనీయుని దర్శించలేదు. పైగా విమర్శించే వాడు కూడా.

కోపర్గాంలో మమలతదారుగా పనిచేస్తున్న బాలా సాహెబ్‌ మిరీకర్‌ ఈయన స్నేహితుడు. ఒకసారి బోడాస్‌ అహ్మద్‌నగర్‌లో మిరీకర్‌ ఇంట్లో దిగారు.

బోడాస్‌కు ఎందుకో దగ్గరలో ఉన్న షిరిడీలోని సాయి బాబాను దర్శించాలనే కోరిక కలిగింది. బోడాస్‌, బాలా సాహెబ్‌ మిరీకర్‌ ఒక సోమవారంనాడు షిరిడీకి వెళ్ళి బాబాను దర్శించుకున్నారు.

ఇద్దరూ సాయి బాబాకు సాష్టాంగ నమస్కారాలు చేశారు. ఒక కొబ్బరికాయను సమర్పించారు.

సాయిబాబా బోడాస్‌కు తన ఖాళీ చిలుంను పొగాకుతో నింపి ఇవ్వమని ఇచ్చారు. ఇది అరుదైన సంఘటన అని అందరూ చెప్పుకుంటారు.

 ”ఎట్లా ఉన్నావు?” అని బోడాస్‌ను అడిగారు సాయి. బోడాస్‌ను దక్షిణ అడిగారు సాయి. బోడాస్‌ వెంటనే ఒక రూపాయి ఇచ్చాడు.

బోడస్‌ భోజనానికి వెళ్ళగా అక్కడ ఎవరో ”సాయి నిన్ను దక్షిణ అడిగితే పర్సులోని మొత్తం ఇచ్చి ఉండవలసింది” అన్నారు.

అలా ఇచ్చి ఉంటే ఎంత బాగుండేదో కదా అని తన మనసులో అనుకున్నాడు బోడాస్‌.

ఈ విషయం అంతర్యామి అయిన సాయికి తెలియకుండా ఉంటుందా? వీడ్కోలు సమయంలో సాయి పాదాలకు నమస్కరించాడు బోడాస్‌. ”వెళ్ళిరండి. దక్షిణ ఇవ్వు’ అన్నారు సాయి.

వెంటనే తన దగ్గరున్న డబ్బునంతా సాయికి ఇచ్చాడు బోడాస్‌. ”నీవు నాకు దక్షిణ ఇచ్చావు. నారాయణుడు నిన్ను తగు విధంగా చూస్తాడులే” అన్నారు సాయి.

బోడాస్‌ ఇక తన జీవితంలో ఏ మహనీయుని దర్శించలేదు. బోడాస్‌కు ధనం కుప్పలు, తెప్పలుగా వచ్చిపడేది.

”నేను ఎవరి దగ్గరనుండైనా ఒక రూపాయి తీసుకుంటే దానికి పదిరెట్లు ఇస్తాను” అన్నదానికి ఇది ఒక చక్కని ఉదాహరణ.

Compiled  By:- ముళ్ళపూడి పాండురంగ సాయినాథ్ & మున్నలూరి బోస్

Collected and Presented By: Mr: Sreenivas Murthy

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles