హనుమంతుని ముందరా?…..సాయి@366 సెప్టెంబర్ 26….Audio



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba



Voice support by: Mrs. Jeevani


ఎంతటి భక్తుడైనా తన మేధాస్సును ప్రాపంచిక కార్యాలపై మరల్చ వచ్చును, కానీ సద్గురుని ఆలోచనలకు కలలోనైన సమ ఉజ్జీకాడు.

సద్గురుని చేష్టలను, మాటలను విశ్లేషించలేని వారు, సద్గురువు ఆలోచనలను పసిగట్ట గలరా? అలా అని అనుకోవటం అవివేకమే అవుతుంది.

ఒకసారి సాయిబాబా రేగేను దక్షిణ అడిగాడు. రేగే వద్ద డబ్బు లేదు. ఆ విషయాన్నే సాయికి చెప్పాడు ”నీ వద్ద డబ్బు లేకుంటే ఎవరినైనా అడిగి ఇవ్వు’అన్నారు సాయి.

రేగే ఇద్దరి ముగ్గురి వద్దకు పోయాడు. డబ్బు లభించలేదు. చివరకు నానా సాహెబ్‌ చందోర్కరు వద్దకు వెళ్ళాడు.

నానా ”సాయి దక్షిణ అడిగినప్పుడు లేదంటే ఎంతో సంకటంగా ఉంటుంది. అందుకని నేను సగం డబ్బును కోపర్గాంలో ఉంచి, సగం తెస్తాను.

నా దగ్గర డబ్బు అయిపోగానే, కోపర్గాం నుంచి తెప్పిస్తాను. ఇక నుండి నీవు అలాగే చేయి.

ఇప్పుడు నేను వంద రూపాయలు తెచ్చాను మరో వంద రూపాయలు కోపర్గాంలో ఉంచాను. నా దగ్గర డబ్బు అయిపోగానే కోపర్గాం నుండి తెప్పిస్తాను” అన్నాడు.

రేగే సాయి వద్దకు వెళ్ళి అన్ని విషయాలు చెప్పాడు. నానాను సాయి వెంటనే రమ్మని పిలిచాడు. వెంటనే నానా వచ్చాడు.

సాయి నానాను మొదట 40, రెండవసారి 40 మూడవసారి 20 రూపాయల దక్షిణగా అడిగారు. నానా సంతోషంగా సమర్పించాడు.

నానా వెంటనే కోపర్గాం వెళ్ళి డబ్బును తెమ్మని మనిషిని పంపాడు. ఆ మనిషి వచ్చేలోగా సాయి దక్షణ అడిగాడు. తన వద్ద డబ్బు లేదని చెప్పటానికి సంకోచించాడు, కాని చెప్పక తప్పలేదు.

సాయి ఆలోచనలను మించి (కొన్ని విషయాలలోనైనా) ఎవరూ ఉండలేరు. ప్రయత్నిస్తే విఫలమవుతారు.

ఇటువంటి సంఘటననే సంభారే 26 సెప్టెంబరున తెలియచేశాడు. బొంబాయి నుండి ముద్రణాలయం యజమాని సాయి దర్శనానికి వచ్చాడు.

ఆయనకు సాయికి దక్షిణ ఇవ్వటం ఇష్టంలేదు. డబ్బు తనవద్ద ఉన్నప్పుడు సాయి దక్షిణ అడిగినప్పుడు ”ఇవ్వను” అనలేడు. ”డబ్బు లేదు” అని అబద్దం చెప్పలేడు. కనుక తనవద్ద డబ్బును సంభారేకు ఇచ్చాడు ఉంచమని.

ఆ ఇద్దరు సాయిని దర్శించారు. సంభారేను సాయి 2 రూపాయల దక్షిణ అడగగా సంభారే సంతోషంగా ఇచ్చాడు.

ముద్రణాలయ యజమానిని కూడా రెండు రూపాయల దక్షిణ అడిగాడు. అతను తన దగ్గర డబ్బు లేదన్నాడు.

సాయి సంభారేను చూపి ”ఇతని దగ్గర తీసుకుని ఇవ్వు” అన్నారు. ఇక గత్యంతరం లేక రెండు రూపాయలు ఇచ్చాడు.

హనుమంతుని ముందరనా కుప్పిగంతులు?

Compiled  By:- ముళ్ళపూడి పాండురంగ సాయినాథ్ & మున్నలూరిబోస్

Collected and Presented By: Mr: Sreenivas Murthy

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles