Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Voice support by: Mrs. Jeevani
”పత్రం పుష్పం ఫలం తోయం యో మే భక్త్యా ప్రయచ్ఛతి తదహం భక్త్యుపహృతమశ్నామి ప్రయతాత్మనః…” అంటారు శ్రీకృష్ణుడు భగవద్గీతలో.
అంటే ”అర్జునా! ఏ భక్తుడైనను నాకు ప్రేమతో పత్రమును గాని, పుష్పమును గాని, ఫలమును గాని, నీరు గాని సమర్పించు చున్నాడో అట్టి భక్తుడు ప్రేమతో అర్పించిన ఆ పత్రము, పుష్పము ఫలాదులను ప్రేమతో అంగీకరించు చున్నాను” అని అర్థము.
పత్ర సమర్పణ విషయంలో రుక్మిణీ దేవి ప్రసిద్ధి చెందినది.
సాయి సాహిత్యంలో మేఘశ్యాముడు, హేమాడ్‌పంత్ మొదలైన వారు ప్రఖ్యాత భక్తులు.
సెప్టెంబరు 9, 1918న వినాయక చవితి. 5 రోజులు ఉత్సవం జరిగింది. నిమజ్జనం కూడా అయిపోయింది.
15న స్వప్నం వచ్చింది హేమాడ్‌పంత్‌కు. దంబోలీకి చెందిన స్వామి విమలానంద ఆయన స్వప్నంలో కనిపించి రేపు మధ్యాహ్నం 12 గంటలకల్లా వంద తమలపాకులు, వక్కలు పట్టుకుని వచ్చి నాకు సమర్పించమని చెప్పారు.
తెల్లవారింది. ఇంట్లో వంద తమలపాకులు ఉన్నాయి. వాటిని వక్కలతో స్వామికి ఆ సమయంలోపు సమర్పించటం సాధ్యంకాదు. కనుక సాయికి పంపుదాము అనుకున్నాడు.
ఆ సత్పురుషులు ఇరువురైనా, ఒక్కటే అనే భావం హేమాడ్‌పంత్‌కు ఉంది. అప్పుడే ఎవ్వరో మేడ మెట్లు ఎక్కుతున్న చప్పుడైంది. తీరా చూస్తే వచ్చింది షిరిడీ నివాసి అన్నా చించినీకరు.
హేమాడ్‌పంత్ తనకు వచ్చిన స్వప్నాన్ని, తాను తీసుకున్న నిర్ణయాన్ని చెప్పాడు. అయితే అన్నా చించినీకర్ అప్పుడే షిరిడీ వెళ్ళడు.
ఆ రోజు, మరునాడు కాక ఆ తరువాత వచ్చే మంగళవారం బి.వి. దేవు షిరిడీ వెళుతున్నాడని చెప్పాడు.
వారు బి.వి. దేవును కలసి వంద తమలపాకులు, వక్కలు, దక్షిణ సాయికి సమర్పించ వలసినదిగా ఇచ్చారు.
బి.వి. దేవు అనుకోని పనులవలన మంగళవారం నాడు కాక, రెండు రోజుల తరువాత షిరిడీలోని సాయి సన్నిధికి చేరాడు.
హుటాహుటిన సాయినాథుని వద్దకే వెళ్ళి వంద తమలపాకులు, వక్కలు, దక్షిణ హేమాడ్‌పంత్ పంపినట్లు సాయికి తెలిపి సమర్పించాడు.
ఆకులు కాస్త వాడినవి. సాయి ఆకులను తీసుకొని తన గద్దెపై పెట్టుకుని ఆప్యాయంగా వాటివంక చూశాడు.
ఆకులు వాడినా సాయికి ఫర్వాలేదు, మనసులోని భక్తి వాడకుండా ఉంటే చాలు. పత్రం సమర్పయామి.
Compiled By:- ముళ్ళపూడి పాండురంగ సాయినాథ్ & మున్నలూరిబోస్
Collected and Presented By: Mr: Sreenivas Murthy
Latest Miracles:
- పాఠకుడే పారాయణ గ్రంధకర్త …..సాయి@366 జూలై 15…Audio
- కడివెడు మజ్జిగ…..సాయి@366 ఆగస్టు 28…Audio
- వీడ్కోలు పలుకులు …..సాయి@366 జూలై 13…Audio
- “సాయి సచ్చరిత్ర” జయంతి…..సాయి@366 నవంబర్ 26….Audio
- మాట సాయం! …..సాయి@366 ఏప్రిల్ 15….Audio
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Recent Comments