వీడ్కోలు పలుకులు …..సాయి@366 జూలై 13…Audio



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba



Voice support by: Mrs. Jeevani


సాయిబాబా చాలా గడసరి. ఆయన లీలలు ఎవరికీ అంతు చిక్కవు. చివరకు ఆయన సచ్చరిత్ర రచయిత హేమాడ్‌పంత్‌కు కూడా.

ఎందుకంటే 52 అధ్యాయాలు రచింప చేసి, ఆ రచనకు ముగింపు చేయనీయక వేరొకరికి అవకాశం ఇచ్చిన సాయి లీల ఎవరికి తెలుసు?

సాయి సచ్చరిత్రకు రెండు మాటలు వ్రాసిన నాగేశ్‌ ఆత్మారాం సావంత్‌ చివరి 52వ అధ్యాయం తమ మరణానికి రెండు రోజుల ముందు ముద్రించటానికి పంపారు అని వ్రాశాడు.

హేమాడ్‌పంత్‌ మరణించింది 1929 జూలై 15వ తేదీ. అంటే 52వ అధ్యాయం జూలై 13న పూర్తయింది. అవే హేమాడ్‌ పంత్‌ వీడ్కోలు పలుకులు అని భావించవచ్చు.

77వ ఓవీలో ”ఒక చిన్న దోమ మేరు పర్వతాన్ని ఎత్తగలదా? లేక ఒక పిచ్చుకకు సాగరంలోని నీళ్ళను ఖాళీ చేయటం సాధ్యమా? కానీ సద్గురువు వెన్నంటి ఉంటే అద్భుతమైన పనులు చేయిస్తారు” అంటారు హేమాడ్‌పంత్‌.

అందులకు ఆయనే ఒక ఉదాహరణ. ఒక పారాయణ గ్రంథము వ్రాయాలంటే శాస్త్ర పరిజ్ఞానము, పాండిత్యము సరిపోవు. సద్గురు కృప కావాలి. ఈ మాటనే అందరూ నిర్ద్వంద్వంగా పలికారు.

భావార్థ రామాయణం రచయిత ”నేను అజ్ఞానిని, మూర్ఖుడిని, కవితలల్లటం వ్యాఖ్యానము తెలియని నా తలపై జనార్ధనుడు (ఏకనాథుని గురువు) చేయి పెట్టి తన శక్తితో రామాయణాన్ని చెప్పిస్తున్నాడు” అని వ్రాశారు.

”పూర్వ జన్మలలో ఇష్టం వచ్చినట్లు ప్రవర్తించి పతనాన్ని పొందాము (మనం). కనీసం ఇప్పుడైనా సద్గతిని పొందటానికి ఇంద్రియ సుఖాలను వదిలే శక్తి లభించు గాక” అంటాడు 40వ ఓవీలో హేమాడ్‌పంత్‌.

గత జన్మల తాలూకు దుఃఖాలను, కష్టాలను ఓర్చుకునే శక్తిని, ప్రస్తుత జన్మలో ఇంద్రియ సుఖాల భ్రాంతులకు లొంగని నేర్పును, ఇంకా మిగిలిపోయిన కర్మలను తొలగించునట్టి ఏకైక సాధనము గురువు.

సాయి భక్తులకు సాయియే జన్మల సాగరాన్ని దాటించే నావికుడు. అయితే అట్టి సద్గురువుపై విశ్వాసం ఉండాలి.

ఎందరో సద్గురువుపై విశ్వాసం పెట్టుకుని ఆధ్యాత్మిక పురోభివృద్ధి సాధించారు – ఒక ఉదాహరణగా హేమాడ్‌పంత్‌నే తీసుకోవచ్చు.

చివరకు జగత్తును నడిపించే వాడు, బుద్ధిని ప్రేరేపించే వాడు అయిన సద్గురు చరణాలయందు భక్తితో కలాన్ని, మస్తకాన్ని అర్పిస్తున్నాను అంటారు 89వ ఓవీలో.

ఎవరు మాత్రం అంతకంటే ఉత్తమ సమర్పణను చేయగలరు? ఊహించగలరు?

Compiled  By:- ముళ్ళపూడి పాండురంగ సాయినాథ్ & మున్నలూరి బోస్

Collected and Presented By: Mr: Sreenivas Murthy

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles