సాయి రసాన్ని చూపించిన రసాయన శాస్త్రజ్ఞుడు…..సాయి@366 జనవరి 9….Audio



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba



Voice Support By: Mrs. Jeevani


సాయి లీలలన్నీ విచిత్రంగా ఉంటాయి. కాకా సాహెబ్ దీక్షిత్ సాయిబాబా పేరు వినగానే సాయి భక్తుడయ్యాడు.

సద్గుణాలన్నీ కాకా సొమ్ము. గురు భక్తి ఆయన కిరీటం. సద్గ్రంథ పారాయణం దైనిందిన కృత్యం.

ఇటువంటి కాకాని కాదని గురు వ్యవస్థ అంటే నమ్మకంలేని, సాయిని చూడటానికి కూడా వెళ్ళటానికి సంశయించే  హేమాడ్ పంత్ తో     మరో  గురు  చరిత్ర అయిన శ్రీ సాయి సచ్చరిత్రను లిఖింప చేయటం సాయి లీల.

అలాగే ఆంధ్రప్రదేశ్ లో సాయినాధుని మరో లీల.

డాక్టర్ వి.వి. బాలకృష్ణకు అతి దగ్గర వారు సాయిబాబాను గూర్చి చెప్పేవారు. బాలకృష్ణ గారు మనిషికో పిచ్చి అనుకునే వారు.

ఇంకా “ఇటువంటి (సాయిపై రచనలు) పుస్తకాలు నా కివ్వకండి” అనే వారు కూడా.

మాగాణీ భూమిని నందనవనంగా తీర్చి దిద్దటం కాదు, ఎడారి భూమిని సస్యశ్యామలంగా చేసి చూపాలి. అది సాయి పద్దతి.

బాలకృష్ణ సాయి భక్తుడైనాడు. అప్పుడు ఆయనలో ఆవేదన మొదలైంది. “తెలిసో తెలియకో చేసిన గురునింద (సాయి నింద) వల్ల దాదాపు 12 సంIIలు సాయిబాబా నన్ను దూరంగా ఉంచారేమో అనిపిస్తుంది.

అయినా సాయి కరుణ అపారం. అందుకే కనీసం 1990 లో నైనా అక్కున చేర్చుకున్నారు” అన్నారు.

అక్కున చేర్చుకొనుటయే కాకుండా కష్టసాధ్యమైన “సద్గురు సాయి స్మరణం” ఆయనకే సాయి లిఖింపచేసారు.

హేమాడ్ పంత్ తన సాయి సచ్చరితలో సాయిపై అనేక గ్రంధాలు ఇదివరకే వెలువడ్డాయి అంటూ ఆయా రచయితలను, రచయిత్రులను స్మరించారు సంతోషంగా.

బాలాజీ తాలింను సాయి తనను ఎన్నో కోణాల నుండి తిలకింప చేసి, విగ్రహ రూపానికి ఆకారమై మలచేటట్లు చేసుకున్నారు.

సాయి సాహిత్యాన్ని డాక్టర్ బాలకృష్ణ వివిధ కోణాలలో దర్శించి, సాయి రసాయనాన్ని మనకు అందించారు.

హేమాడ్ పంత్ ను మరోసారి ఈ సమయంలో తలచుకోవటం సబబే. హేమాడ్ పంత్ చివరి 1,2  అధ్యాయాలను పూర్తిగా రచింపలేదు.

కానీ, డా II బాలకృష్ణ సాయిపై రచనను సంపూర్తి గావించారు. కాని, ముద్రిత ప్రతిని చూసేలోపే ఆయన జనవరి 9, 1998 లో సాయిలో ఐక్యం అయ్యారు.

‘సద్గురు సాయి స్మరణం’ ఏప్రిల్ 1998 లో విడుదలైంది .

Written by: Mullapudi Panduranga Sainath &  Munnaloori Bose.

Collected and Presented By:  Mr: Sreenivas Murthy

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles