Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
నా పేరు సత్యనారాయణ. మా సొంత ఊరు భీమవరం. మేము ప్రస్తుతం హస్తినాపురం, హైదరాబాదు లో ఉంటాము.
నేను ఇంటర్మీడియట్ బోర్డులో పని చేసి రిటైర్ అయ్యాను. మా ఇంట్లో 1954 సంవత్సరం నుండి బాబా ఫోటో ఒకటి ఉండేది.
నాకు ఆయన గురించి తెలియదు. మేము హైదరాబాదు వచ్చిన కొత్తల్లో నేను సాయిబాబాది ఒక హిందీ సినిమా చూసాను.
అది చూసాక నాకు ఎక్కడో ఒక లైబ్రరీ లో శ్రీ ఎక్కిరాల భరద్వాజ మాస్టర్ రాసిన శ్రీ సాయి లీలామృతం పుస్తకం దొరికింది.
అది నేను ఇంటికి తీసుకువచ్చి నాకు దాని విలువ తెలియక మంచంలో పడుకుని, ఎలా బడితే అలా దాన్ని ఒక నవలలాగా చదివాను.
అంతా అయిపోయాక బాబా మహత్యం ఇంత ఉందా? అయితే చూద్దాం అనుకుని నాకప్పటికే ఒకతను 1000 రూపాయల డబ్బులు ఇవ్వాలి, అతను ఎన్ని సార్లు అడిగినా ఇవ్వటం లేదు. అతను ఆ డబ్బులు కనుక ఇచ్చేస్తే అప్పుడు నిన్ను నమ్ముతాను అనుకున్నాను.
మరునాడు మామూలుగానే నేను ఆఫీసుకి బయలు దేరి వెళ్లి ఇంకా సైకిల్ స్టాండ్ లో పెట్టాను కూడా లేదు, నాకు డబ్బులు ఇవ్వవలసిన వ్యక్తి నా దగ్గరకే పరుగున వచ్చి నా డబ్బులు నాకిచ్చి వెళ్ళిపోయాడు.
నేను చాలా ఆశ్చర్యపోయాను, ఈయనలో ఇంత మహత్యం ఉందా అని,
ఇంటికి వెళ్ళాక అప్పటిదాకా ఎలా పడితే అలా చదివిన పుస్తకం ఇప్పుడు భక్తి శ్రద్ద లతో కుదురుగా కింద కూర్చొని చదవటం చేస్తున్నాను.
అప్పటినుండి ఆయన మీద శ్రద్ద, భక్తి పెరిగాయి. ఆ తర్వాత మేము నలుగురు స్నేహితులం కలిసి షిరిడి వెళ్ళాము.
అప్పట్లో అక్కడ బాబా గద్దె ఎక్కి అభిషేకం చేసి బాబాకి నేనే స్వయంగా నా చేతులతో దండ వేసాను.
అంతే! నేను నా బాహ్య స్మృతి కోల్పోయాను. నన్ను అక్కడ ఉన్న సెక్యూరిటీ వాళ్ళు పట్టుకుని కిందకి దింపారు.
ఒకసారి మా ఆవిడ (వెంకట సత్యవతి)కి ఒంట్లో బాగోలేదు, కుడి కాలు కదలనీయక, బాగా నెప్పి, బాధగా ఉండేది, కాలు లాగేస్తూ ఉండేది.
ఎన్నో మందులు వాడాము చాలా ఇబ్బంది పడుతోంది. ఆర్థోపెడిక్ ప్రొఫసర్ ఒకాయన నా దగ్గరికి ఏదో పని మీద వచ్చాడు.
నేను ఆయనతో నా భార్య సత్యవతి విషయం అంతా చెప్పాను. ఇది నేను తప్పకుండా బాగు చెయ్యగలనంటూ మా ఇంటికి వచ్చి సత్యవతి ని చూసి నా వల్లకాదంటూ ఉస్మానియాకి తీసుకెళ్ళమన్నాడు.
నేను ఆయన చెప్పినట్లే ఉస్మానియాకి తీసుకెళ్ళాను. అక్కడ డాక్టర్స్ చూసి ఆపరేషన్ అవసరం అని చెప్పారు.
ఇద్దరమూ ఇంటికి వచ్చాము, ఇంక చేసేదేమి లేదు కాబట్టి ఆపరేషన్ కోసం సాయం అవసరం కాబట్టి మా అత్తగారికి, మా అమ్మగారికి ఉత్తరాలు రాసాను. మరునాడు నేను ఆఫీస్ కి వెళ్ళిపోయాను.
ఇంట్లో సత్యవతి ఒక్కతే ఉంది. తాను స్నానం చేసుకువచ్చి బాబా ముందు నిలబడి
”బాబా ఆపరేషన్ అంటున్నారు, నాకేమో భయంగా ఉంది, ఈ నెప్పి బాధ భరించ లేకుండా ఉన్నాను, నువ్వే ఏదో ఒకటి చేసి నా బాధని తీసివెయ్యి బాబా” అంటూ బాబా ముందు సాష్టాంగ నమస్కారం చేసి ఏడుస్తూ ఉండి పోయింది.
అలాగే ఉండి పోయి అటు నిద్రో మెలకువో తెలియని స్థితిలో ఉండగా మా బావమరిది కొడుకు నెలల పిల్లవాడు ఆ సమయంలో పాకుతున్నాడు.
వాడు సత్యవతి దగ్గరికి పాకుతూ వచ్చి ఆమెకి కాలంతా మర్దనా చేసాడట. ఆ బాబు బంగారు రంగులో ఉన్నాడట. కాసేపటికి సత్యవతి అతి సామాన్యంగా లేచిందట, తనకి ఎంతో తేలికగా ఉందట,
పక్క గదిలో మంచం పైన నిద్ర పోతున్న పిల్లవాడు మంచం దిగి నా దగ్గరకు ఎలా వచ్చాడసలు అనుకుంటూ, గబగబా లేచి వెళ్లి పిల్లవాడు ఎక్కడ ఉన్నాడో అని చూసిందట.
ఎక్కడ ఈవిడ పడుకోబెట్టిందో అక్కడే మంచం మీద హాయిగా నిద్ర పోతున్నాడు.
నా దగ్గరికి వచ్చి నాకాలు మర్దనా చేసిందెవరు మరి. అంటే ఆ బంగారు బాబు బాబానా! అవును బాబానే అని అనుకునేటప్పటికి చూస్తే తన కాలు నొప్పి విషయం చెప్పింది. ఎంతో ఆశ్చర్యం, ఆనందం కళ్ళ నీళ్లతో అనుభవించాము.
నేను ఒకసారి షిరిడి వెళ్ళినప్పుడు మధ్యాహ్న హారతి అయ్యాక దర్శనానికి జనం తక్కువగా ఉంటారని అప్పుడు నేను బాబాని దర్శించేందుకు వెళ్లి సమాధి మీద చేతులానించి దండం పెట్టినా కోరికల చిట్టా విప్పాను.
అలా ఎంత సమయం గడిచిపోయిందో నాకు తెలియదు. ఆ సమాధి లో నుంచి నాకు షాక్ లాగా తగిలి, ”ఇంక చాలు” అని వినిపించింది.
నేను తలకాయ పైకి ఎత్తి చూస్తే నా వెనక పెద్ద లైన్ ఉంది. అంతే అప్పటినుండి నేను బాబాని కోరికలు కోరటం మానుకున్నాను.
మా అమ్మాయి పెళ్ళికి తాంబూలాలు మార్చుకున్నాము. మేము హస్తినాపురానికి కొత్తగా ఇల్లు కట్టుకుని వెళ్ళాము.
అక్కడ ఇల్లు తక్కువగా, అక్కడో ఇల్లు, అక్కడో ఇల్లు ఉన్నాయి. అది చూసి మా వియ్యంకుడు వీళ్ళేమిటి, ఇలా అడవిలో ఇల్లు కట్టుకుని ఇలా ఉంటున్నారు, వీళ్ళకి భయం లేదా? అనుకున్నాడట.
ఆరోజు ఆయన ఇంటికి వెళ్ళగానే ఆ రాత్రి ఆయనికీ ఒక కల వచ్చిందట. ఆ కలలో మా ఇల్లు, మా ఇంటి గుమ్మంలో, బాబా నిలబడి ”వీడికి నేను ఉన్నాను” అని చెప్పాడట.
అంతే! మా వియ్యంకుడు మా ఇంటికి ఎప్పుడు వచ్చిన గుమ్మానికి దండం పెట్టుకుని లోపలికి వస్తాడు.
మా అమ్మాయి వాళ్ళు కూకట్ పల్లి లో ఉంటారు. వాళ్ళ ఇంటి పైన పెంట్ హౌస్ ఉంది. ఆ ఇంట్లో ఒక యువ జంట ఉండేవారు.
వాళ్ళు ఎప్పుడైనా బయటికి వెళ్ళినప్పుడు ఏమైనా అవసరం ఉంటుందని వాళ్ళ ఇంటి తాళం చెవి ఒకటి డూప్లికేట్ వీళ్ళకి ఇచ్చారట.
వాళ్ళు ఒక రోజు బయటికి వెళ్లారట. ఆ రాత్రి వాళ్ళు ఇంటికి రాలేదట. తెల్లారక మా అమ్మాయి పైకి వెళ్లి చూసిందట.
వాళ్ళ ఇంటి తాళం పగలగొట్టి ఉందట. దొడ్డి గుమ్మం గూడా అలాగే ఉందట. దొంగలు పడ్డట్టు అర్ధం అయ్యి, మా అమ్మాయికి చాలా భయం వేసింది.
లోపలికి తొంగి చూసిందట. గుమ్మానికి ఎదురుకుండా సాయినాథుడు పలకరిస్తునట్లుగా కనిపడినాడట.
ఆయనలా కనపడేసరికి మా అమ్మాయిలో కొంచెం ధైర్యం వచ్చిందట. ఆయనే ఆ వచ్చిన దొంగలను ఏదో బెదిరించి పంపించేసి ఉంటాడు,
లేకపోతే, వాళ్ళ సామానుతో పాటు మా అమ్మాయి పరువు కూడా పోయి ఉండేది, ఎందుకంటే మరి వాళ్ళ తాళం డూప్లికేట్ మా అమ్మాయి దగ్గర వుంది కదా!
శ్రీ సాయినాధ చరణారవిందార్పణమస్తు
శుభం భవతు
The above miracle has been typed By: Mrs. Raja Rajeswari Sainathuni
Latest Miracles:
- భక్తురాలు నైవేద్యం గా పెట్టిన కిచిడి, దక్షిణను మారు రూపంలో వచ్చి స్వీకరించిన బాబా వారు
- గురుపౌర్ణమి రోజు భక్తురాలి ఇంటికి వెళ్లిన బాబా వారు.
- మా ఇంటిలో జ్యోతి (పూజ) పెట్టించుకోమని వేరే భక్తురాలి రూపంలో వచ్చి చెప్పిన బాబా వారు….
- నా కోరికను తీర్చిన బాబా.
- సాధు రూపంలో బాబా వారు వచ్చి పాము బారినుండి కాపాడుట
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Recent Comments