మా ఇంటిలో జ్యోతి (పూజ) పెట్టించుకోమని వేరే భక్తురాలి రూపంలో వచ్చి చెప్పిన బాబా వారు….



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


జ్యోతి వెలిగించే ముందు ఆయన రెండు ఫోటోలు బాబా పీఠం పైన పెట్టారు.

నాకు అంతా కొత్త ఏం చెయ్యాలోతెలీదు. అదే విషయం నేను ఆయనతోనూ, ఆయన కూడా వచ్చిన వాళ్ళతో చెప్పాను.

ఏం ఫరవాలేదు. నేనుండి అన్ని చెబుతాను అంటూ ఒకావిడ వుండిపోయింది పూజ అభిషేకం ఎలా చేయాలో చూపించింది.

మూలన ఈశాన్యంలో కాళీగా వుంచకూడదు అని ఆ మూలకి ఒక గణపతి విగ్రహం, ఒక చిన్న బాబా విగ్రహం రెండూ పెట్టాను.

అభిషేకం చెయ్యటానికి బీరువాలోంచి వెండి విగ్రహం తీసి అక్కడ పెట్టి ఏర్పాట్లు చేశాను. అది అందరూచూసారు, ఇది రాత్రి జరిగిన సంఘటన.

అందరూ అన్నారు కూడా గురువు గారికి ఆర్భాటాలంటే ఇష్టం వుండవు, అలా వెండివేవీ పెట్టకులే అన్నారు. కానీ నేను పట్టించుకోలేదు.

తెల్లవారాక గబా గబా తయారయ్యి అభిషేకం చేద్దామని చూస్తే ఆ గిన్నెలో పెట్టిన వెండి బాబా విగ్రహం కనిపించలేదు. ఇల్లంతా వెతికాము ఎక్కడా కనపడలేదు.

ఇంకా చేసేది లేక అంతకు ముందే ఈశాన్యంలో పెట్టిన గణపతిని పీఠం మీదకి తెచ్చి, దానితో పాటు అప్పటిదాకా షోకేస్‌ లో ఉన్న బాబా విగ్రహం ఏదో మెటల్‌ది ఉంటే అది పెట్టి అభిషేకం చేసారు.

పూజ కూడా అయ్యింది, అందరు పారాయణాలు మొదలు పెట్టారు. ఆ తర్వాత ఎందుకో బీరువా తీస్తే అందులో ఎదురుగా నేను నిన్న రాత్రి పిఠం పైన పెట్టిన బాబా వెండి విగ్రహం ఉంది.

అది బీరువాలోకి ఎలా చేరిందో తెలీదు. బహుశా గురువు గారికి ఆర్భాటాలు ఇష్టం లేక పోవటం మూలంగా, బాబాయే తనంతటతాను గా బీరువాలోకి వెళ్లి పోయాడులా వుంది.

ఆ తర్వాత గిన్నెలో ఉంచిన బాబా విగ్రహానికి పూలతో పూజ చేసేటప్పటకి, బాబా విగ్రహం కనిపించకుండా పూలలో బాబా మునిగిపోయాడు.

బాబా ఉదయం నుండి సాయంత్రం దాక నన్ను చూసి నవ్వుతున్నాడు. నేను ఎటువెడితే అటు తిరుగుతున్నట్టు గా అనిపించింది.

ఆ పూలలో ఉన్న బాబా కనపడటం లేదని పూలన్నీ కిందకి ఒత్తాను. హారతి సమయం అయిందని నేను హారతి వెలిగించి, హారతి ఇవ్వడానికి తయారయ్యాను.

ఉన్నట్టుండి బాబా నా నెత్తిన ఒక దెబ్బ వేసారు. ఆ దెబ్బకి నేను మోకాళ్ళమీద కూలబడి పోయాను.

ఒక చేతిలో హారతి అలాగే ఉంది. “నిన్నూ నీ పూజా విధానం చూసి నాకు నవ్వు వస్తోంది, నీ కోసం మీ ఇంటికి రావడానికి నేను మూడు సార్లు వస్తే తరిమేసావు” అని బాబా అన్నారు.

“నేను నిన్ను తరిమి వేసానా?” అని నన్ను చూసి ఎందుకు నవ్వుతున్నావు” అన్నాను. “అవును నిన్నూ నీ పూజా విధానం చూసి నాకు నవ్వు వస్తోంది” అని మళ్ళీ అన్నారు బాబా.

ఈయన్ని ఎప్పుడు తరిమేసాను. ఈయన అలా ఎందుకు అంటున్నారు అని అనుకున్నాను.

నన్ను ఆ చంద్రకళ గారు కదా మూడు సార్లు అడిగారు అనుకొని ఆవిడ్ని అడిగాను. మీరు వచ్చి నన్ను అన్నిసార్లు అడగబట్టి నేను ఈ జ్యోతి ఇలా పెట్టుకోవటం జరిగింది అని అన్నాను.

ఆవిడ తెల్లబోయి ”ఏమిటి! నేను నిన్ను జ్యోతి గురించి అడిగానా? పైగా ఇన్ని సార్లు అడిగినా?” అని అడిగింది.

అంటే మా ఇంటికి వచ్చింది ఆ చంద్రకళ గారు కాదు. సాక్షాతూ ఆ బాబాయే, ఆవిడ రూపంలో వచ్చి నన్ను పూజ చేసుకోమని ఆదేశించారు.

ఒక వారం అలా జరిగింది. రెండో. వారం నాకు ఎప్పటి నుంచో. బాగా ఎలర్జీ గా వుంది. వొళ్ళంతా మంటలు దురదలూ ఉంటాయి దానికి నేను మందులు వాడుతున్నాను.

ఒక రోజు నేను మందులు వేసుకోలేదు. అయ్యో మందులు వేసుకోలేదు అని అనుకుంటే చంద్రకళ గారు అన్నారు “ఏమి ఫరవాలేదు. మందులు వేసుకోకు బాబా మీద భారం వేసేయ్‌” అంది.

నేను మాత్రలు వేసుకోకుండా పడుకున్నాను. అర్ధరాత్రి బాబా జ్యోతి బాగా ఎక్కువగా వెలగటం. మొదలు పెట్టింది.

నేను మాత్రలు వేసుకోకుండా పడుకున్నాను. నాకు నిద్ర కానీ మెలుకువ కానీ స్థితిలో దీపం అలా పెద్దదిగా మండుతున్నట్లుగా తెలుస్తోంది.

ఒక్క సారిగా కళ్ళు తెరిచి మంచం మీద నుండి లేచి వచ్చి బాబా దగ్గర చూస్తే నిజంగానే దీపం పెద్దదిగా మండుతోంది.

నేను అక్కడే బాబా ముందు కూర్చున్నాను. నా మనసంతా బాధ గా అయిపొయింది,

ఏం బాబా! ఏం తప్పు జరిగింది. నేనేమయినా పొరపాటు చేశానా ఎందుకంత హెచ్చుగా దీపం మండుతోంది. అని ఎడుస్తూ దండం పెట్టుకున్నాను.

జ్యోతి క్రమంగా మాముల స్థితికి చేరుకుంది. ఆ తర్వాత క్రమంగా నా మంటలు, దురదలూ తగ్గాయి. ఎల్లర్జీ కూడా తగ్గిపోయింది.

నేను ఇప్పటి వరకు. ఈ ఎలర్జీ కి ఎటువంటి మందులు వాడటం లేదు. అంతా బాబా దయ.

The above miracle has been typed by: Sreenivas Murthy Muppalla

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles