సత్పురుషుడు కుంభార్ …..సాయి@366 ఏప్రిల్ 20….Audio



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba



Voice Support By: Mrs. Jeevani


శ్రీమతి తర్కడ్‌ భోజనం చేస్తున్నప్పుడు తన వద్దకు వచ్చిన కుక్కకు, పందికి రొట్టె ముక్కను ఇచ్చింది రామచంద్ర ఆత్మారాం తర్కడ్‌ భార్య.

ఆకలితోనే తన వద్దకు ఆ జంతువులు వచ్చాయని ఆమె గ్రహించింది, స్పందించింది.

మనం చూచే మొక్కలు/చెట్లు కూడా శీతల తాపాలకు లోనవుతాయి. అవి అలా లోనవుతాయని మనకు తెలియ చెప్పిన సాయి భక్తుడు భావ్‌ మహారాజ్‌ కుంభార్‌.

ఆయన 1937 ఏప్రిల్‌ 20న దేహాన్ని విడిచారని అంటే కాదు 1938 ఏప్రిల్‌ 20న అని మరొక తేదీ కూడా చెపుతారు. ఏది ఏమైనా ఏప్రిల్‌ 20న మహాసమాధి చెందారన్నది ఏకగ్రీవమైన అంశం.

షిరిడీలో ఈయన మహాసమాధి చోటు చేసుకోవటం విశేషమే. ఈయన కర్మలు చేసి చూపాడు. ఒకరి మెప్పు కోసం కాదు.

కర్మలంటే యజ్ఞ యాగాదులు కాదు, సాయి సంస్థానపు జాగాను ఈయన శుభ్రము చేసేవాడు. ఇంకా, షిరిడీలోని వీధులను కూడా శుభ్రపరచే వారంటారు. ఈ సేవ ఇతరులకు ఏ మాత్రం కష్టం కలగకుండా చేసేవాడు.

ఈయన భిక్షాటన చేసి జీవించే వాడు. ఎవరైనా డబ్బులు ఇస్తే, డబ్బు అవసరమైన వారికి ఇచ్చేవాడు.

తన వద్ద ఉన్న బట్టలను చలికి మొక్కలు తట్టుకొన లేక పోతున్నాయి అని వాటిపై కప్పేవారు. మనిషి ఆకలిని గ్రహించవచ్చును గాని మొక్కలు చలికి తట్టుకొనలేక పోతున్నాయని గ్రహించటం విశేషమే.

”నా తండ్రి రొట్టెలో నాలుగవ వంతు ఇచ్చాడు, మధురమైన గాధలు చెప్పారు” అనే వాడు సాయిని గురించి. నిష్కామ సేవయే ఈయన తరగని ఆస్తి.

ఆయన సాయిలో ఐక్యమైన రోజున షిరిడీ ప్రజలందరు కన్నీరు మున్నీరయ్యారు.

ఈయన సమారాధన (12వ రోజున) విశేష స్పందన పొందింది. మరునాడు ఈయన చక్కని చిత్ర పటాన్ని సాయి సమాధి మందిరంలో ఉంచారు.

నేటికిని అనేక మంది సాయి భక్తులు తమకు సంతానము కలగగానే ఆ పసికందును ఈయన సమాధి చెంత ఉంచి అక్కడ మన్నును ఆముదములో కలిపి తమ పిల్లలకు పడతారు.

దీని వల్ల ఆయనలోని కొన్ని దయా గుణములైనా తమ పిల్లలకు అబ్బుతాయని వారు విశ్వసిస్తారు.

నేడు ఏప్రిల్‌ 20. కనీసం ఈ రోజునుండైనా మన మనసును కలవర పెట్టు, చికాకు పరచు అనైతిక ఆలోచనలను ఎప్పటికప్పుడు తుడిచివేయుదుము గాక.

ఇదే ఆ సత్పురుషునికి మనం ఇచ్చే అసలైన నివాళి.

Compiled  By:- ముళ్ళపూడి పాండురంగ సాయినాథ్ & మున్నలూరి బోస్

Collected and Presented By: Mr: Sreenivas Murthy

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles