Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Voice Support By: Mrs. Jeevani
సాయిబాబా మహా సమాధి చెందక పూర్వమే, సాయి అనుజ్ఞతోనే నిర్మించిన ప్రప్రధమ సాయి మందిరం మహారాష్ట్రలోని భివపురిలో ఉన్నది.
ఆ ప్రధమ మందిర నిర్మాణ కర్త శ్రీ కేశవ్ రామచంద్ర ప్రధాన్. భక్తులకు అనేక అనుభవాలు కలిగాయి, సాయినాథుడే ఆ మందిరంలోనికి వేంచేసి ఉన్నట్లు.
ఇక భక్త జన ప్రవాహం అధికం కాసాగింది. అందరకూ కనీస సౌకర్యాలు కల్పించాలని ప్రధాన్ ఆశ.
1939లో ప్రధాన్ గారు పరమ పదించటంతో ఆ మందిర బాధ్యత ఆయన అల్లుడు వి.వి. గుప్తె స్వీకరించారు.
భక్త జనుల సౌకర్యార్ధం నిర్మాణాలను చేపట్టాలి. ధనం కొరతగా ఉన్నది వారికి. అందుకని సాయి భక్తుడైన నారాయణ పురోహిత్ అనే వ్యక్తితో ‘శ్రీ సాయి సచ్చరిత్ర’ పారాయణ ప్రారంభింప చేశారు మందిరం వారు.
శ్రద్ధను బట్టి పారాయణ ఫలితం ఉంటుందని ప్రత్యేకించి ఎవ్వరూ చెప్పనక్కర లేదు.
3, 4 రోజులుగా శ్రీ సాయి సచ్చరిత్ర పారాయణ కొనసాగుతోంది. ఒకనాటి రాత్రి స్వప్నంలో ”నా ధుని ఎక్కడ? ధుని లేనిది షిరిడీ ఎలా కాగలదు?” అని ప్రశ్నించారు సాయి.
ఇంకా బాబా రాళ్ళను రువ్వారు కూడా ఆ స్వప్నంలోనే. పురోహితుడు ఆశ్చర్యపోయాడు ఆ స్వప్నానికి.
మొదటి స్వప్నానికి ఉదాసీనంగా ఉన్నాడు. మరునాటి రాత్రి కూడా సాయినాథుడు స్వప్నంలో కనిపించి అదే సందేశాన్ని ఇచ్చాడు.
పారాయణ అనంతరం స్వప్న వృత్తాంతాన్ని దాదరు వెళ్ళి గుప్తే గారికి విన్నవించాడు పురోహితుడు.
గుప్తే సాయి భక్తులతో ఆ విషయం చర్చించి ధుని నిర్మాణానికి సిద్ధపడ్డాడు. ధనం విచిత్రంగా అందింది. ఆ ధుని 8 అడుగుల పొడవు 4 అడుగుల వెల్పుతో నిర్మితమైంది.
1949 శ్రీరామనవమి (ఏప్రిల్)లో ఆ ధునిని శ్రీ సాయి సచ్చరిత్రకారుడైన హేమాడ్పంత్ మనుమడు శ్రీ ఎ.ఆర్. వాలవాల్కర్ కరకమలములచే ప్రజ్వలింపబడింది.
ఇక సాయినాథుని లీలలకు కొదవా?
శ్రీ శివనేశన్ స్వామి గారు కూడాసాయి ద్వారకామాయిలో ధునికి విశేష ప్రాధాన్యత ఇచ్చారు.
మనకు షిరిడీలో కనిపించే ముగ్గురు మాతలున్నారు అంటారాయన: (1) ద్వారకామాయి (2) సాయి మా (3) ధుని మా.
ధుని సాయి మందిరానికి కొసమెరుపు కాదు, కలికి తురాయి.
ధుని మాతకు ప్రణతులర్పిద్దాం, పునీతులవుదాం!
Compiled By:- ముళ్ళపూడి పాండురంగ సాయినాథ్ & మున్నలూరి బోస్
Collected and Presented By: Mr: Sreenivas Murthy
Latest Miracles:
- తొందరవద్దు…..సాయి@366 ఏప్రిల్ 2….Audio
- సచ్చరిత్ర పారాయణ ఫలం …..సాయి@366 జూన్ 18…Audio
- జగమే ‘జ్ఞానేశ్వరి’ ….సాయి@366 సెప్టెంబర్ 17…Audio
- సాయినాథుని ధుని…..సాయి@366 ఏప్రిల్ 4….Audio
- సజీవ గురువు! …..సాయి@366 ఏప్రిల్ 13…Audio
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Recent Comments