Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Voice Support By: Mrs. Jeevani
తెలుగువారి ఇలవేల్పు పురాణ పురుషుడైన శ్రీ వేంకటేశ్వరుడు. ఇటీవల కాలంలో శ్రీ సాయిబాబా తెలుగువారి ఇలవేల్పు అయ్యాడనిపిస్తోంది.
సాయిబాబా మహాసమాధి చెందక పూర్యమే ఎందరో తెలుగు వారు సాయిబాబాను దర్శించారు, సాయి భక్తులైనారు.
ఉదాహరణ: బెహరా బాబూరావు, వాడ్రేవు వీరేశలింగం, మంత్రిప్రగడ లక్ష్మీ నరసింహ రావు, నందిపాటి జగన్నాయకులు సాయి మహాసమాధి అనంతరం షిరిడీని దర్శించి ధన్యులైన తెలుగు వారెందరో. సాయి కృపకు పాత్రులైన వారెందరో.
వెంట్ర ప్రగడ గ్రామ నివాసి శ్రీ నాగభైరవ వెంకటరత్నం గారు, ఆయన అర్ధాంగి చి|| సౌ || నాగరత్నమ్మ గారు.
ఆమెకు శరీరముపై దద్దుర్ల వ్యాధి వచ్చినది. ఆ భార్యా భర్తలు మిగుల బాధపడిరి. ఎందరెందరో ఇంగ్లీషు, ఆయుర్వేద వైద్యశిఖామణులు చికిత్స చేసిరి. కానీ ఫలితము లేదు. వారు షిరిడీ సాయిబాబాను గూర్చి విన్నారు.
ఆ భార్యా భర్తలు షిరిడీ యాత్ర చేసి సాయి మహాత్ముని సమాధిని దర్శించిరి. ఆ సమయముననే అచ్చటకు వేంచేసియున్న సాయీవ్యాస శ్రీ బి.వి. నరసింహ స్వామి గారిని కలిసారు.
ఇక ఔషదములను ఆమె తీసుకొనుట మానివేసినది. శ్రీ సాయిబాబా విభూతి ప్రసాదమును సేవించుట మొదలుపెట్టినది. అలా కొంతకాలమునకు వ్యాధి పూర్తిగా కనుమరుగైనది.
ఊది మహాత్మ్యము వారికి అవగతమయినది. వారు సాయి భక్తులైనారు. వారికి సంతానము కలిగినది.
కృతజ్ఞతగా వారు వెంట్రప్రగడ లో సాయి మందిరము నెలకొల్పదలచినారు.
1941 నవంబరు 16న సాయి మందిర నిర్మాణమునకు శంకుస్థాపన జరిగినది. 1942 జనవరి 22న సాయి మందిర ప్రతిష్ట జరిగినది.
ద్వారకామాయిలో సాయి సన్నిధిన వెలసిన నిత్యహోమాగ్ని నుండి శ్రీ పి.ఎం. మోహనరావు గారిచే తేబడిన అగ్నిని శాస్త్రోక్తముగా ఏప్రిల్ 4, 1943లో ధునిగా ప్రతిష్టింపబడినది.
1951 ఫిబ్రవరి 22న శ్రీ బి.వి. నరసింహ స్వామి గారిచే చలువరాతి విగ్రహ రూపములో సాయి ప్రతిష్ట జరిగినది.
తాను ఊదివలన లబ్ధిపొంది, ఇతరులకు అట్టి శుభమును ధుని ద్వారా లభింప చేసిన వెంకటరత్నం దంపతులు అభినందనీయులు.
ధునిని ప్రతిష్టించిన మోహన రావు గారు సాయి కృపచే మనకు ఎన్నో మధుర గీతములను అందించారు.
”నూరి పోసే మందు కాదండి నూరు వరహాలిస్తే రాదండి” అని పాడుకోవటమే కాదు, అనుభవములోనికి తెచ్చుకోవచ్చు సాయి ఊది మహిమను.
Compiled By:- ముళ్ళపూడి పాండురంగ సాయినాథ్ & మున్నలూరి బోస్
Collected and Presented By: Mr: Sreenivas Murthy
Latest Miracles:
- ఆరతుల భావము…..సాయి@366 ఏప్రిల్ 9….Audio
- ప్రసాద ప్రాప్తి!…..సాయి@366 ఏప్రిల్ 3…..Audio
- అల్లా వెలిగించిన దీపం …..సాయి@366 జూన్ 4….Audio
- సువాసనలంటే మక్కువా! …..సాయి@366 మే 4….Audio
- ముగ్గురమ్మలు …..సాయి@366 ఏప్రిల్ 24….Audio
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Recent Comments