Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Voice Support By: Mrs. Jeevani
కాకా సాహెబ్ స్నేహితుడు బాంద్రాలో ఉండేవాడు.
అతను సాయిబాబా పటం ముందు నిలబడి పూజ చేస్తున్నాడు. సాయిబాబాను అలంకరించానికి మల్లె పూలు తెచ్చాడు.
కానీ, సాయిబాబాకు పూలను సమర్పిస్తే వాటిని ముక్కు దగ్గర పెట్టుకుంటారని అతనికి జ్ఞాపకం వచ్చింది.
వెంటనే ఒక పువ్వును సాయిబాబా ముక్కు వద్ద ఉంచాడు. ముక్కు దగ్గర పెట్టిన ఆ పూవును మరల క్రింద పెడదామనే ఆలోచన వచ్చింది, కానీ ఆ మల్లెపూవు సాయి నాసిక వద్ద అతుక్కుపోయింది.
అతడు ఆ పుష్పాన్ని అలాగే ఉంచాడు. సాయంకాలం వరకు ఆ మల్లెపూవు అలాగే ఉంది.
సాయి భక్తిని ఆస్వాదించే పద్ధతులే వేరుగా ఉంటాయి. సాయిబాబా శ్రీరామ నవమి ఉత్సవాలను ప్రారంభింప చేశాడు షిరిడీలో.
వార్కరీ సాంప్రదాయములో వలె సాయి నికేతన్ నుండి ఒక బృందం కాలినడకన షిరిడీ చేరెను.
సాయి నికేతన్ బొంబాయిలోని షిరిడీ సంస్థానపు ముఖ్య కార్యాలయము. 1982లో ఒక బృందము సుమారు 80 మంది కాలినడకన షిరిడీ చేరి, శ్రీరామ నవమి ఉత్సవములో పాల్గొని తిరిగి వచ్చిరి.
వారు షిరిడీ నుండి వచ్చి మే 2న (1982) సాయి నికేతన్ ఆఫీసులో సత్యనారాయణ వ్రతం చేసుకున్నారు.
ఆ సమయంలో సాయి, ఇతర దైవాలకు పూల దండలను వేశారు వారు. సత్యనారాయణ వ్రతం పూర్తి కాగానే అందరికి తీర్ధ ప్రసాదాల వితరణ చేశారు.
4వ తారీకున చూడగా సాయికి సమర్పించిన ఒక పూల దండ పెరిగినట్టు అనిపించింది.
పటమునకు సరిపడ దండ వేయగా అది పొడవుగా పెరిగింది. అసలు దండ కంటే 4న చూసిన దండ రెట్టింపు పొడవైంది.
సాయి తన చిత్రాతి చిత్రమైన లీలను చూపిస్తూనే ఉంటారు అప్పుడప్పుడు. సాయినాథుని ఆ దండను చూడటానికి భక్తులు తండోప తండలుగా సాయి నికేతన్‌కు వచ్చిరి.
సాయి విచిత్రాలను వ్యక్తుల గృహాలలోను, మందిరాలలోనే కాదు, కార్యాలయాలలో కూడా ప్రదర్శిస్తాడు.
ఎటొచ్చి, అంతటి నమ్మకాన్ని సాయిపై పెట్టుకోవటమే మన తక్షణ కర్తవ్యము.
కొంతమంది ఇటువంటి వాటిని ”అద్భుతాలు” అంటారు కాని నిజానికి ఇటువంటివి సాయి ”దివ్య” లీలలని మనం గ్రహింతుము గాక!
Compiled By:- ముళ్ళపూడి పాండురంగ సాయినాథ్ & మున్నలూరి బోస్
Collected and Presented By: Mr: Sreenivas Murthy
Latest Miracles:
- సాయినాథుని ధుని…..సాయి@366 ఏప్రిల్ 4….Audio
- తుంగభధ్ర తట వాసినే నమః …..సాయి@366 మే 10….Audio
- నమ్మినవారు నవ్వులపాలు కారు! …..సాయి@366 మే 15….Audio
- సాయి సాహిత్యవనంలో పాశ్చాత్య పుష్పం …..సాయి@366 మే 8….Audio
- అల్లా వెలిగించిన దీపం …..సాయి@366 జూన్ 4….Audio
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Recent Comments