Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Voice Support By: Mrs. Jeevani
షిరిడీలో సాయిబాబాను దర్శించానికి సామాన్యులే కాదు, ఎందరో మాన్యులు కూడా వచ్చేవారు.
సాయి సత్తాను వారు చాటే వారు కూడా. అలా ఆనందనాథ్, గంగాఫీుర్ మొదలైన వారెందరో విచ్చేసేవారు.
ఇక సాయిబాబా మహా సమాధి చెందారు. భౌతికంగా ఆయన కానరాకున్నా, ఆయనను సూక్ష్మ రూపంలో దర్శించగల అసమాన్యులు ఎందరో వేంచేసేవారు.
అట్టి వారిని శ్రీ శివనేశన్ స్వామీజీ సాదరంగా ఆహ్వానించే వారు.
శ్రీ రామిజీ, శ్రీమతి అనాయ్ అనే పుణ్య దంపతులకు మే 5, 1926లో నాగపూర్ జిల్లా, కటోల్ తాలూకా పారాడ్‌సింగాలో అనసూయ మాత జన్మించింది.
ఆమెకు బాల్యం నుండి భగవద్భక్తి అధికంగా ఉండేది. ఆమె భగవన్నామ సంకీర్తన చేయునపుడు బాహ్య దేహ స్కృతి కోల్పోయేది. ఈమె కూడా సాయి బాబా వలె లీలలను చూపేది.
సాయిబాబా ఒకసారి ఇమాంభాయితో ”అతిథులు వస్తున్నారు. నాలుగు కోళ్ళను తీసుకురా” అని పంపారు. ఎవరా అతిథులు అని ఉత్సుకత.
అతడే ఆ రాత్రి మసీదు తెర వెనకు దాక్కున్నాడు. పాపం సాయికి ఆ సంగతి తెలియదనే భావంతో.
రాత్రి రెండు గంటలకు అడుగుపైగా వ్యాసమున్న అగ్ని గోళం మసీదులోనికి దూసుకు వచ్చింది. మిరుమిట్లు గొల్పే కాంతితో మశీదు నిండిపోయింది.
అప్పాభిల్ కూడా అక్కడనే ఉన్నాడు. సాయి అరబిక్ భాషలో ఏదో ఉచ్చరించారు. 10 – 15 నిముషాల తర్వాత అంతా మామూలైంది.
ఇక అనసూయ మాత విషయానికొస్తే మనలను చూచుటకు చుట్టాలు వస్తారు అన్నది అక్కడున్న భక్తులతో. ఒక పిడుగు వచ్చి కాంతిని వెదజల్లుతూ భూమిలోనికి దిగిపోయింది.
ఈమెను అనేక సాధు సత్పురుషులు దర్శించారు.
ఈమె షిరిడీకి వచ్చి (సాయి సమాధి అనంతరం) సాయి క్షేత్రాన్ని దర్శించింది. అప్పుడు శ్రీ శివనేశన్ స్వామీజి ఆమె పాదములపై తన శిరస్సు నుంచి నమస్కరించారు.
ఇది సాధు సత్పురుషుల యందు స్వామికి గల భక్తి ప్రపత్తులను తెలుపు చున్నది. సాయిని దర్శించు వారలెవరైననూ వందనీయులే.
సాయిని దర్శించిన సాధు సత్పురుషులను వారి వారి జయంతి, వర్థంతుల నాడైనా స్మరించుట మన కర్తవ్యము.
Compiled By:- ముళ్ళపూడి పాండురంగ సాయినాథ్ & మున్నలూరి బోస్
Collected and Presented By: Mr: Sreenivas Murthy
Latest Miracles:
- భోళా సాయి! …..సాయి@366 మే 31…Audio
- నమ్మినవారు నవ్వులపాలు కారు! …..సాయి@366 మే 15….Audio
- ఎవడొస్తాడో చూస్తా! …..సాయి@366 మే 22….Audio
- శివమ్మతాయి…..సాయి@366 మే 29….Audio
- వివాహ భోజనం!…..సాయి@366 మే 18….Audio
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Recent Comments