Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Voice Support By: Mrs. Jeevani
గణపతి డోండ్ కదం కుటుంబంతో సహా నాసిక్‌నుండి మన్మాడ్ పోతున్నాడు షిరిడీలో సాయిని దర్శించాలని. ఆ రైలు పెట్టెలో వీరు తప్ప మరెవ్వరూ లేరు.
అడవి గుండా పోతోంది రైలు. భిల్లులు ఒకరి తరువాత ఒకరు పరుగెత్తి రైలు ఎక్కారు ప్రయాణికులను దోచుకోవానికి. వారు దొంగలని ఆ కుటుంబానికి తెలియదు.
గణపతి భక్తి మార్గ ప్రదీప్‌ను పెద్దగా చదువు తున్నాడు, భజనలు కూడా చేయసాగాడు, వచ్చిన వారు కూడా భజనలో పాలుపంచు కుంటారని.
అయిదు నిమిషాలు గడిచాయి. ఆ భిల్లులు అందరూ ఒకరి తర్వాత ఒకరు ఎవరో తరుముతున్నట్లు రైలు దిగి పారిపోయారు.
ఏమి జరిగిందో గణపతికి అర్థంకాక వెనుతిరిగి చూడగా ఒక ఫకీరు గంభీరంగా కూర్చుని ఉన్నాడు. ఎక్కే ముందు లేని ఫకీరు ఇప్పుడు ఎలా వచ్చినట్లు? అని ఆశ్చర్యపోయాడు.
మరలా చూడగా ఫకీరు అక్కడ లేడు. ఇదంతా కల కాదు కదా? అని ఆశ్చర్యపోయాడు గణపతి.
షిరిడీ చేరి సాయిని దర్శించగా సాయి ”క్షేమంగా ప్రయాణించారా?” అని అడిగాడు. అప్పుడు అవగతమైంది గణపతికి సాయియే ఆ ఫకీరని. ఇది సాయి మహా సమాధికి పూర్వం జరిగిన లీల.
అహమ్మదాబాద్ నివాసి రతి చిమన్‌లాల్‌కు మే 22, 1948న జరిగిన సంఘటన.
ఆయన ఇంకా మరి కొంతమంది స్నేహితులతో అహమ్మదాబాద్ పోవటానికి రైలు ఎక్కారు. పేకాడుతూ మాట్లాడుకుంటున్నారు. రైలు నిజాం ప్రాంతం దాటింది. గుల్బర్గా చేరింది.
రతిలాల్ మెదడులో ఆందోళన మొదలైంది. భారత దేశమంతా విభజన సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది.
ఆ ప్రదేశమంతా తీవ్రవాద కార్య కలాపాలకు కేంద్రం. తోటి వారితో ఏదో ప్రమాదం జరగబోతోందని చెప్పాడు. అందరూ నవ్వారు.
కాని రతిలాల్ సాయి నామ సమస్మరణ ప్రారంభించాడు. అర గంట గడచింది. రైలు గాణుగాపూర్ చేరింది.
సాయుధులైన గుంపు ప్రయాణికులను దోచుకోవటం ప్రారంభించింది. రతీలాల్ మాత్రం సాయి నామ స్మరణ ఆపకుండా చేయసాగాడు.
ఎక్కడి నుండో ఒక పఠాన్ వచ్చి రతిలాల్ పెట్టె ముందు నిలబడ్డాడు. దోపిడీ దారులెవరు అతనితో తలపడ లేదు. రైలు కదలి షోలాపూర్ చేరింది.
రతీలాల్ ఉన్న కంపార్టుమెంటు తప్ప మిగిలిన కంపార్టుమెంట్లలోని వారు ఫిర్యాదు చేశారు దోపిడీ గురించి.
ఇక ఆ పఠాన్ ఎవరు? ఇంకెవరు సాయియే! అనే మాట కేవలం రతిలాల్‌దే కాదు, వారందరిది కూడా!
సాయి ప్రయాణములలో కూడా మనను కాపాడు గాక!
Compiled By:- ముళ్ళపూడి పాండురంగ సాయినాథ్ & మున్నలూరి బోస్
Collected and Presented By: Mr: Sreenivas Murthy
Latest Miracles:
- శ్రీ సాయి రక్ష సర్వజగద్రక్ష…..సాయి@366 ఏప్రిల్ 14….Audio
- విమానంలో సాయి సన్నిధికి …..సాయి@366 జూలై 5….Audio
- భోళా సాయి! …..సాయి@366 మే 31…Audio
- డ్రైవర్ ఇంజనును నడుపుటకు ప్రయత్నించినాడు. కాని రైలు కదలలేదు.–Audio
- రాత్రి నిద్రించని సాయి…..సాయి@366 డిసెంబర్ 21….Audio
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Recent Comments