నీ స్మృతిని కడవరకు వెలగనీ!…..సాయి@366 మే 23….Audio



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba



Voice Support By: Mrs. Jeevani


ప్యారీ కిషన్‌ ‘యం.వి. ధనలక్ష్మి’ అనే నౌకకు కెప్టెన్‌. సాయిపై దృఢ నమ్మకమున్న మనిషి.

ఒకసారి ఆయన కెప్టెన్‌గా నడుపుతున్న నౌకలోనికి సముద్రపు నీరు జోరుగా ప్రవేశించింది. ఆయన వెంటనే అందరికి తగు సూచనలిచ్చి లైఫ్‌ జాకెట్లు ఇచ్చి సముద్రంలోకి దూకమన్నాడు.

అందరూ నౌకనుండి దూకిన తరువాత ఆయనకు లైఫ్‌ జాకెట్టు దొరకలేదు. సాయిబాబాను మనసారా తలచి సముద్రంలోనికి దూకాడు. ఆ దినం మే 21, 1972.

సమయం అర్ధరాత్రి 12 గంటలవుతోంది. తమను కాపాడమని ‘SOS’ ఇచ్చాడు ఇక దైవాధీనం. చుట్టూ చిమ్మ చీకటి. సాగరపు అలలు 15, 20 అడుగుల ఎత్తుకు ఎగసిపడుతున్నాయి.

ఎప్పుడు తెల్లవారేను? ఎవరు వచ్చి కాపాడతారు? గడ్డిపోచ దొరికినా చాలు పట్టుకు అనుకున్నాడు. సాగరంలో అలా తేలుతూ, ఈదుతూ పోతుంటే ఖాళీ కోడిగుడ్ల చెక్క పెట్టి కొట్టుకు వస్తున్నది.

దానిని కనుమరుగు కానివ్వకుండా అటేపోయి పట్టుకున్నాడు. అప్పటికే మరో ఇద్దరు ఆ చెక్క పెట్టెను పట్టుకున్నారు.

ఆ ముగ్గురుకు తగిన పట్టును ఆ చెక్క పెట్టె ఇవ్వగలుగుతుందా? ఇంకా ఎంతసేపు? భారంగా సెకన్లు, నిమిషాలవుతున్నాయి. నిమిషాలు కష్టంగా గంటలవుతున్నాయి. గంటలు ఒక రోజు దాటాయి.

మే 23 వచ్చేసింది. అతను సాయినాథుని మరువలేదు. ఆకలి వేస్తోంది. దాహం మవుతోంది, నీరసం వస్తోంది, శరీరాన్ని ఉప్పునీరు తినివేస్తోంది.

ఆయనకు అదే సమయంలో జ్వరం కూడా వచ్చింది. అతనికి సాయినాథునిపై నమ్మకం ఏ మాత్రం సడలలేదు.

ఆ మహా సముద్రంలో మనస్సును స్థిరంగా సాయిపై లగ్నం చేసినా, శరీరం అందుకు సహకరించాలి గదా!

దాదాపు ముప్పది గంటలు గడిచాయి – ఇంతలో దూరంగా కాంతి రేఖ. ఒక నావ వస్తోందని గ్రహించాడు. దగ్గరకు వచ్చింది, అది ‘యం.వి.జలఖండ’.

తన తోటి ఇద్దరు నౌకను చేరారు. తాను నౌకలోనికి పోవటానికి ప్రయత్నించాడు, పట్టు తప్పింది. మరల ప్రయత్నించాడు స్పృహ తప్పింది.

అంతే. కన్నులు తెరచి చూచాడు స్పృహ వచ్చాక. తనను సురక్షితంగా నౌకలోనికి తెచ్చిపడవేశాడు సాయి అనుకున్నాడు.

ఆ రోజు మే 23, 1972.

చివరి క్షణంలో కూడా సాయిపై విశ్వాసాన్ని కోల్పోలేదు ప్యారీకిషన్‌ వాలి – అదీ జీవిత సాగరంలో కాదు – నిజ సాగరంలో.

Compiled  By:- ముళ్ళపూడి పాండురంగ సాయినాథ్ & మున్నలూరి బోస్

Collected and Presented By: Mr: Sreenivas Murthy

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles