వాళ్ళు ఉండేదాన్నిబట్టే!…..సాయి@366 అక్టోబర్ 12…Audio



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba



Voice support by: Mrs. Jeevani


షిరిడీలో అడుగుపెట్టిన సాయి వద్దకు అనేకులు ముఖ్యంగా షిరిడీ వాసులు తమ వ్యాధులను నయం చేసుకునేందుకు వచ్చేవారు. అప్పుడు ఆయన ఒక హకీం. ఆ పిచ్చి ఫకీరుకు ఖ్యాతి వచ్చింది.

ఆపర ధన్వంతరిగా మారాడు. కర్మ వలన సంభవించే వ్యాధులను కూడా ఇట్టే తీసిపారేశాడు. మరో విశేషం ఏమిటంటే ఆయన స్వప్నాలలో (ద్వారా) వ్యాధులను నివారించటం.

సాయి మహాసమాధి చెందాడు అక్టోబరు 15, 1918న. అయితే ఆయన లీలలు మాత్రం కనుమరుగు కాలేదు. పిలిస్తే పలుకుతాడు. అందరూ పిలిచే వారే.

1986లో జరిగిన గాథ. ఈ సంఘటన ఒక మహిళకు జరిగింది. ఆమె తన పేరును వెల్లడి చేయటానికి ఇష్టపడలేదు.

ఆమె సాయి భక్తురాలు. ఆమెను ఒక సాయి సేవికగా చెప్పుకోవచ్చు. ఆమెకు కుడి రొమ్ము భాగాన పెద్ద గడ్డ లేచింది. మందులతో తగ్గలేదు. సర్జన్లు ఆపరేషన్‌ చేయుట ఒక్కటే మార్గమని చెప్పారు.

ఇక ఆమెను చేయించుకోవాలా వద్దా అని ఆలోచించుకోమన్నారు. ఆమెకు ఆపరేషన్‌ చేయించుకొనుట ఏమాత్రం ఇష్టంలేదు. కానీ చేయించుకొనక తప్పదని తెలుస్తోంది. చివరకు సాయినే శరణని నమ్మినది.

ఇక ఏ మాత్రం ఆలస్యం చేయకుండా షిరిడీ చేరి సాయిని ఆర్తితో ప్రార్ధించింది. అక్కడ ఉన్న పూజారితో తన విషయాన్ని చెప్పింది.

ఆమె చెప్పినదంతా విన్నాడు. ఊదిని పేస్టువలె తయారు చేసి, రోజుకు ఐదు సార్లు లేపనం చేయమన్నాడు.

సోమ, మంగళ, గురు వారాలలో నూనెతో నూట ఎనిమిది సార్లు ‘ఓం సాయి’ అనే నామాన్ని జపించి గుడ్డతో మర్దన చేయమన్నాడు.

సాయి నామాన్ని నిత్యం జపించమన్నాడు. సాయిపై పూర్తి విశ్వాసాన్ని ఉంచి భారాన్ని సాయిపై వేయమన్నాడు.

ఆ పూజారి సలహాను సాయి సలహాగా భావించింది ఆమె. ఆ సలహాను తూ.చా. తప్పకుండా కొన్నిరోజులు ఆచరించగా ఆ గడ్డ, ఆ వాపు క్రమ క్రమంగా తగ్గిపోయి పూర్తి ఆరోగ్యవంతురాలైంది.

సాయిపై సంపూర్ణ విశ్వాసంతో పూర్తి ఆరోగ్యవంతురాలైంది ఆమె అక్టోబరు 12, 1986న.

”వాళ్ళుండే దాన్ని బట్టే గదయ్యా మనం ఉండేది” అంటారు గొలగలమూడి వెంకయ్య స్వామి గారు. సాయి విషయంలో కూడా ఆ సూక్తి శిలాక్షరమే.

Compiled  By:- ముళ్ళపూడి పాండురంగ సాయినాథ్ & మున్నలూరిబోస్

Collected and Presented By: Mr: Sreenivas Murthy

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles