Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Voice support by: Mrs. Jeevani
గోపాలరావు గుండుకు శిధిలమైన ద్వారకామాయి మసీదును అందంగా రూపొందించాలనే కోరిక కలిగింది. నిర్ణయించేది బాబాయే.
ఆ జీర్ణోద్ధరణ యోగం ఆతని భాగ్యంలో లేదులా ఉన్నది. వేరొకరికి ఆ కార్యాన్ని అప్పగించారు సాయి.
రఘనాథ్ జున్నార్‌కర్ సాయినాథుని భక్తుడు. ఆయనకు మహారాష్ట్రలో చలన చిత్రసీమలో దర్శకునిగా, ఫొటో గ్రాఫరుగా, ఎడిటరుగా వివిధ శాఖలలో ఎంతో అనుభవం ఉంది.
ఆయన 1951లోనే మరాఠీ భాషలో సాయినాథునిపై చలనచిత్రం నిర్మించ సంకల్పించాడు. కానీ ఆ ప్రయత్నం సఫలీకృతం కాలేదు.
పాతిక సంవత్సరాల తరువాత అంటే 1976లో మరల ప్రారంభించాడు. ఈసారి కూడా అతనివల్ల కాలేదు. అప్పుడు జున్నార్కర్ తెలుసుకున్నాడు – దీనిని చేయటం సాయినాథునికి ఇష్టం లేదని.
ఇక ఆ ప్రయత్నం నుండి విరమించు కున్నాడు. సాయిని కాదని ఒక్క అడుగు వేసేవాడు కాదు ఆయన.
తనవద్ద చలన చిత్రానికి సంబంధించిన రచన ఉన్నది. ఆయనకు ఒక ఆలోచన వచ్చింది. సాయినాథునిపై ఒక నవలను వ్రాస్తే ఎట్లాగుంటుంది? అని. అది జున్నార్‌కర్ ఆలోచన కాదు, సాయినాథునిదే. వెంటనే అన్ని సమకూరసాగాయి.
సచ్చరిత్ర వ్రాయటం వేరు, సినిమా తీయటం వేరు, నవల వ్రాయటం వేరు. ఈ మూడింలో సాయి ప్రథానంగా ఉన్నా, తెలిపే పద్ధతులు, సంఘటనలు, విధానాలు వేర్వేరుగా ఉంటాయని జున్నార్‌కర్‌కు తెలుసు.
సాయిపై ప్రథమంగా నవల వ్రాసిన పేరును, ధనాన్ని సంపాదించాలనే తహతహ అతనికి లేదు.
జున్నార్‌కరే తన నవలకు మూలంగా హేమాడ్‌పంత్ సచ్చరితను, బి.వి. నరసింహ స్వామి గారి రచనలను తీసుకున్నారు.
మొదటగా మరాఠీలో ఆయన వ్రాసిన నవలకు సాకోరీలోని గోదావరి మాత శుభాశీస్సులను కోరగా, ఆమె తన శుభాశీస్సులను మరాఠీ, ఆంగ్ల నవలలకు కూడా పంపింది.
ఆ సమయంలో ఆయనకు ఆంగ్లంలో నవల వ్రాద్దామనే ఆలోచనలేదు. అది సాయి ప్రేరణ.
మరాఠీ నవల ఊహించనంతగా ప్రజాదారణ పొందింది. వెంటనే ఆయన ఆంగ్లంలో A MISSION DIVINE అనే పేరుతో రచించారు.
అది 19 అక్టోబరు 1980 విజయదశమి రోజున బొంబాయిలోని ‘సాయి నికేతన్’లో సాయి లీల ఎడిటర్ ఎన్.డి. పర్చూరి గారిచే ఆవిష్కరించబడింది.
సాయియే విశ్వమంతా నిండి ఉన్నారనే భావననే ఈ నవల మథురంగా పాఠకులకు తెలుపుతుంది.
Compiled By:- ముళ్ళపూడి పాండురంగ సాయినాథ్ & మున్నలూరిబోస్
Collected and Presented By: Mr: Sreenivas Murthy
Latest Miracles:
- A Mission Divine …Sai@366 – 19th October….Audio
- వేయి కనులు చాలవుగా!…..సాయి@366 అక్టోబర్ 7…Audio
- కాలదర్ప దమనుడు…..సాయి@366 అక్టోబర్ 13…Audio
- అర్ధం కాదు పరమార్ధం…..సాయి@366 అక్టోబర్ 30….Audio
- ఆరతుల భావము…..సాయి@366 ఏప్రిల్ 9….Audio
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Recent Comments