Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Voice support by: Mrs. Jeevani
ఆనాడు అక్టోబరు 7, 1954. షిరిడీ గ్రామమంతా కోలాహలంగా ఉంది. అంతవరకు పాదుకలతో రాజ్యమేలిన రామచంద్రుడు సాకేత సార్వభౌముడైనట్టు, ఆనాటి నుండి సాయిబాబా చలువరాతి విగ్రహరూపంలో తన ప్రజలకు దర్శనమిస్తున్నాడు.
‘నానృషిః కురుతే కావ్యం’ అంటారు. ఒక కావ్య రచనను రుషి మాత్రమే చేయగలిగితే, మానవ రూపంలో అవతరించిన దైవాన్ని పాలరాతిలో చూపగలగటం ఎవరివల్ల అవుతుంది.
సాయి ఒక్కొక్కరికి ఒక్కొక్క పని కేటాయిస్తాడు. హైదరాబాదులో జన్మించిన బాలాజి వసంత తాళీం, బొంబాయి నగరం చేరాడు.
సాయి తన కోసమే ఆయనకు శిల్ప కళను నేర్పినట్టున్నారు. అదీగాక సాయి ఆయనకు దర్శన భాగ్యాన్ని కలుగుచేశారు.
ఇంకేమున్నది, నిలువెత్తు చలువరాతి విగ్రహాన్ని సాయి తత్వవేత్త అయిన వామన్‌ప్రాణ్ గోవింద్ పటేల్ (సాయి శరణానంద) విజయదశమి పర్వ దినాన ప్రాణప్రతిష్ట చేశారు.
ప్రపంచ ప్రసిద్ధ శిల్పకారుడు డాక్టర్ నికోలే ”నేను అన్ని బొమ్మలు పరిశీలించాను. అలాంటి (షిరిడీ సాయి సమాధి మందిరంలో ఉన్న విగ్రహాన్ని మామూలు మానవులు తయారు చేసింది కాదు. ఇందులో దైవత్వం నిండి ఉంది” అంటారు.
ఆ పాలరాతి విగ్రహరూపంలో సింహాసనాధీశుడైన సాయిరూపును వర్ణించగల కవి లేడు, చూపును విశ్లేషించగల శాస్త్రజ్ఞుడు లేడు.
లేశమాత్రం ఆ కరుణా తరంగాలను అందుకుంటే జీవితమే మధురాతి మధురంగా మారుతుంది మరుక్షణం.
నేడు సాయి మహాసమాధి చెందారన్న విషాదం లేదు. సాయి అంటే బ్రహ్మ రూపం మార్చుకున్నాడు. అంతకు మించి మార్పులేదు.
ఆ కరుణాకటాక్షము ఎందరినో జ్ఞాన సోపానమును ఎక్కించింది, మరెందరినో విజ్ఞానఘనులను చేసింది, మరి కొందరి భౌతిక అవసరాలను, కోరికలను తీర్చింది,
అయితే అందరికీ ”నే నున్నాను” అనే అభయాన్ని ప్రసాదిస్తుంది.
ఆ సాయినాథుని క్షణకాల దర్శనమే చిరకాల జీవనానికి తోడు నీడ!
Compiled By:- ముళ్ళపూడి పాండురంగ సాయినాథ్ & మున్నలూరిబోస్
Collected and Presented By: Mr: Sreenivas Murthy
Latest Miracles:
- సాయినాథుని ధుని…..సాయి@366 ఏప్రిల్ 4….Audio
- సాయి పేరుతో చిన్న అబద్ధం!…..సాయి@366 ఆగస్టు 7….Audio
- వాళ్ళు ఉండేదాన్నిబట్టే!…..సాయి@366 అక్టోబర్ 12…Audio
- అందరిని ఆదరించు ….. సాయి @366 ఫిబ్రవరి 7….Audio
- నాగసాయి …..సాయి@366 జనవరి 7….Audio
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Recent Comments