అందరిని ఆదరించు ….. సాయి @366 ఫిబ్రవరి 7….Audio



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba



Voice Support By: Mrs. Jeevani


”ఆత్మ సాక్షాత్కారము పొందిన పిమ్మట ప్రజల క్షేమమునకై పాటుపడు సాధువులు గాని, యోగులు గాని ఉండుట మిక్కిలి అరుదు.

సాయిబాబా ప్రజలకై పాటుబడినవారిలో అగ్రగణ్యుడు” అని వ్రాసారు ప్రత్తి నారాయణ రావు గారు.

సాయిబాబా తన జీవిత కాలమంతా ప్రజలను సన్మార్గంలో పెట్టటానికి వినియోగించారు.

సాయిబాబాకు దాపరికము లేదు, సాయి నివసించిన మసీదుకు తలుపులు గాని, కిటికీలు గాని లేవు.

ఆయనను ఎవరైనను కలువ వచ్చును. అందరూ ఆయన దరి చేరవచ్చు. తారతమ్యములు లేని వాడే సాయి.

బూటీ అనే కోటీశ్వరుడు సాయి దర్బారుకు చేరాడు.

విద్వాంసులు పండితులే కాదు చదువు రాని వారు పేదలు కూడ సాయి దీవెనలు పొందారు.

షిరిడీ సత్పురుషుని దర్బారుకు జ్యోతిష్యులు వచ్చి భవిష్యత్తును గొప్పగా చెప్పేవారు. వారు, వీరు అని ఏమి అన్ని జాతుల వారు సాయిని శరణు కోరారు.

ఉదాహరణగా ఫిబ్రవరి 7, 1912వ సం|| సాయిబాబా ఆరుబయట ఆశీనుడై ఉండగా ఒకడు తాను నేర్పిన విద్యలను కోతిచేత చేయిస్తుంటే, చూస్తున్నారు.

సాయి ఎంతటి ఆధ్యాత్మిక స్థాయిలో ఉన్నారు. తాను ఇతరుల వలె బయటకు వచ్చి కోతులను ఆడించే వాడి ఆటను చూడటమా? ఇది ఆశ్చర్యకరమే.

అందులో అంతరార్ధం ఉంది. మానవులే కోతులు. తానే (సాయే) విధాత. కర్మ పగ్గాలను చేత బుచ్చుకుని, మానవులు ఆడే నాటకాన్ని తిలకిస్తున్నాడు, సాయిబాబా.

ఆ కోతిని ఆడించే వానితో పాటుగా గాయకురాలు, నాట్యకత్తె కూడ ఉన్నారు.

మంచి కంఠస్వరం ఉన్న ఆమె మతపరమైన పాటలు పాడింది. వాటిని సాయి విన్నాడు.

అక్కడున్నవారందరూ విన్నారు. బజారులో పాటలు పాడేవాళ్ళేమి తానేమి అని చూడడు సాయి.

దీనిని బట్టి మానవుడు ఎంతటి ఉన్నతుడైనా, ధనికుడైనా, తనను దరి చేరిన వారెంత స్థాయిలో ఉన్నప్పటికి, వారిని తృణీకరించకుండా, వారి విశ్వాసాలను విని, చూచి, గౌరవం ఇవ్వాలి – ఎందుకంటే సాయి ఇచ్చిన ఉన్నత పదవికి లేదా స్థాయికి మచ్చ తేరాదు.

Compiled  By:- ముళ్ళపూడి పాండురంగ సాయినాథ్ & మున్నలూరి బోస్

Collected and Presented By: Mr:Sreenivas Murthy

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles