తప్పులు చేయుట మా వంతు!…..సాయి@366 మే 7….Audio



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba



Voice Support By: Mrs. Jeevani


భక్తికి కొలతలు లేవు.

భక్తుడు దైనిందిన జీవనంలో గాని, ప్రత్యేక సమయంలో గాని తన కోసంగాని, ఇతరుల కోసంగాని, దైవ సహాయం అర్దించడం జరుగుతుంది.

ఆ దైవము కారణము ఏదైనా సరే, భక్తుని కోరికనుగాని, అభీష్టమును గాని, సంకల్పమును గాని నెరవేర్చుటకు సిద్ధపడతాడు.

ఆహారము లభించక, శిష్యులతోపాటు పస్తులుండిన వ్యాసునకు ఆగ్రహము కలుగుట కూడ తగదన్నవి మన పురాణములు.

ఇక ప్రత్యక్ష దైవమైన సాయి విషయము అందులకు భిన్నముగా ఉండునా? ఉండదా?

భాస్కర మగథి, ఆయన భార్య ఇరువురు సాయి భక్తులే.

ప్రతి గురువారం ఒక పూలమాలను బాబాకు అర్పించి మరునాడు భార్యాభర్తలు ఇరువురు ఆ పూలమాలను చౌపాతి వద్ద గల సముద్రములో కలిపే వారు.

ఆ రోజు మే 7, 1986. భార్యా, భర్తలిరువురు మామూలుగా మాట్లాడుకొను చుండగా ఆ మాటలు భక్తి వైపు మళ్ళినవి.

”ఇక నుండి మీరు సాయిబాబా పూజ మానివేయండి. ఆయన మనకు ఏమి చేసినాడు? మనము ధనికులముగాము” అని ఆయన భార్య అన్నది.

ఇంకను ఆమెకు కోపము హెచ్చినది.సాయి పటము, ఆరతుల, స్థవనమంజరి పుస్తకములను, పూలమాలను సంచిలో పెట్టుకొని భర్తతో కలసి చౌపాతి దగ్గరున్న సముద్రములో పారవేసినది.

ఇంకను సంచిలో పుస్తకములు, పూవులు ఉన్నవేమోన్న అనుమానముతో సంచిని బోర్లించినది సముద్రములోనికి.

ఇక ఆ భార్యాభర్తలు ఇంటికి చేరారు. భాస్కర మగథి మనసులోనే సాయిని ప్రార్ధించుకున్నాడు.

తరువాత శుక్రవారమునాడు భాస్కర మగథి ఆ సంచీని ఒకసారి తెమ్మన్నాడు.

భార్య ”తెస్తున్నాను” అని జవాబిచ్చింది. వెంటనే ఆమె కెవ్వున కేక వేసింది. ఆమె వద్దకు భర్త పోగా, ఆమె ఆ సంచిని చూపినది.

ఆ సంచిలో సముద్రములో పారవేసిన సాయి పటము, ఆరతుల, స్థవనమంజరి పుస్తకములు, పూలమాల మొదలైనవి ఉన్నాయి.

ఆమెకు సాయి మహత్తు తెలిసినది. క్షమింపుమని భర్తని కోరినది. క్షమించు వాడు సాయియే అనినాడు భార్యతో.

ఆ భార్యాభర్తలు సాయిని క్షమింపుమని కోరిన, ఆ సిద్ధ పురుషుడు అందుకు సిద్ధమే!

Compiled  By:- ముళ్ళపూడి పాండురంగ సాయినాథ్ & మున్నలూరి బోస్

Collected and Presented By: Mr: Sreenivas Murthy

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles