Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Voice Support By: Mrs. Jeevani
సాయిబాబా మహా సమాధి చెందే ముందు రోజు బాపు సాహెబ్ జోగ్ కు రుద్రాక్ష మాల ఇచ్చాడు.
జోగ్ సాకోరీలో ఉన్నప్పుడు ఉపాసనీకి ఆరతి ఇచ్చేటప్పుడు ఆయన మేడలో వేసేవాడు. ఇలా చాలా కాలం జరిగింది. చివరకు ఆ మాల ఉపాసనీ మేడలో చేరింది. జోగ్ సమాధి చెందాడు.
జూలై 27, 1928 గురుపూర్ణిమ రోజున. ఉపాసనీ తన మేడలో ఉన్న ఆ మాలను తీసి సతీ గోదావరి మేడలో వేశాడు. ఆమెకు మంత్ర దీక్ష ఇచ్చాడు.
అలా జోగ్ ద్వారా సాయి మేడలో రుద్రాక్ష మాల సతీ గోదావరికి దక్కింది.
సతీ గోదావరి ఎవరో కాదు. శ్రీ గజానన్ మహారాజ్ దేహ త్యాగం చేసే ముందు సతీ గోదావరికి తాతగారైన భాస్కర రావు వంశంలో జన్మిస్తానని చెప్పారు.
భాస్కర రావు కుమారుడైన వాసుదేవ రావుకు 1914 డిసెంబర్ 24 న కుమార్తె జన్మించింది.
గజానన్ మహారాజ్ తరచు ‘గం గం గోదావరి’ అనే వారు. అందువలన వాసుదేవ రావు పుట్టిన బిడ్డకు గోదావరి అని పేరు పెట్టారు.
శ్రీ విష్ణుమూర్తికి వైష్ణవి, ఈశ్వరునకు పార్వతి ఎలాగో గోదావరి తన యొక్క మాయా శక్తి, క్రియా శక్తి అనేవారు ఉపాసనీ.
ఉపాసనీ బాబా భారత చరిత్రలోనే అతి ప్రాచీనమైన సంప్రదాయాన్ని పునరుద్ధరించారు.
అన్ని యజ్ఞ యాగాదులకు సాకోరీ ఆశ్రమంలోని కన్యకలే ఆచార్యులుగా, హోతలుగా, రుత్విక్కులుగా, పౌరోహితులుగా, అర్చకులుగా వ్యవహరిస్తారు.
సర్వకార్య నిర్వహణ కన్యకలచే జరుపబడేవి. కేవలం పురుషులవి సేవా సహకారాలు మాత్రమే.
ఉపాసనీ సజీవ ప్రతిమ సతీ గోదావరి. ఆమె గీటురాయికి లొంగని మేలిమి బంగారం. అజాత శత్రుత్వం, నిర్లిప్తత నిరుపమానం. ఆమె అవిరళ కృషియే సాకోరీ కన్యాకుమారీ ఆశ్రమం.
డాక్టర్ జీ.యస్ . కెస్కర్ వద్దకు వచ్చిన ఒక రోగికి లెడర్ కిన్ మాత్రలు వ్రాశాడు వాడమని. రోగి వెళ్ళిపోయాడు.
గోదావరి మాత నుండి అనేక మందులు, లెడర్ కిన్ మాత్రలు వచ్చాయి. ఆ సాయంకాలం ఆ రోగి వచ్చి అంతటా ఆ మాత్రల కోసం గాలించామని, ఎక్కడా అవి దొరకలేదని చెప్పాడు.
వెంటనే డాక్టరుకు గోదావరి మాత పంపిన లెడర్ కిన్ మాత్రలు గుర్తుకు వచ్చి వాటిని ఆ రోగికి ఇచ్చాడు. రోగం నివారణ అయింది.
గోదావరి మాత ఆ మాత్రలను అప్పుడే ఎందుకు పంపింది? ఇది ఆమెపై విశ్వాసమున్న వారికి అర్ధం అవుతుంది – ఆమె చర్యలలోని ఆంతర్యం.
నేడు డిసెంబరు 24 . గోదావరి మాత జన్మ దినం. ఇంకా ఉపాసనీ మహారాజ్ సమాధి దినం.
మాతృత్రయాన్ని, సాయిని, ఉపాసనీని, గోదావరి మాతను స్మరించెదము గాక!
Compiled By:- ముళ్ళపూడి పాండురంగ సాయినాథ్ & మున్నలూరిబోస్
Collected and Presented By: Mr: Sreenivas Murthy
Latest Miracles:
- గెంతుతూ వచ్చిన గోదావరి…..సాయి@366 నవంబర్ 20….Audio
- జన్మ జన్మల బంధం …..సాయి@366 డిసెంబర్ 23….Audio
- ఉపాసనీ మహారాజ్ విగ్రహం …..సాయి@366 జనవరి 13….Audio
- ఊరక రారు మహాత్ములు!…. .. …. మహనీయులు – 2020… డిసెంబరు 24
- ప్రసాద ప్రాప్తి!…..సాయి@366 ఏప్రిల్ 3…..Audio
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Recent Comments