గెంతుతూ వచ్చిన గోదావరి…..సాయి@366 నవంబర్ 20….Audio



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba



Voice Support By: Mrs. Jeevani


సాయిబాబా ఏ పనిని వాయిదా వేయడు. కొన్ని సందర్భాల్లో ముందుగానే హెచ్చరికలు చేస్తాడు, లేదా అప్ప టికప్పుడు హెచ్చరిస్తాడు.

బాపూ సాహెబ్‌ జోగ్‌ దంపతులు షిరిడీలో సాయిబాబా సన్నిధిలో స్ధిరపడ్డారు.

ఒకసారి 1910 నవంబరులో గోదావరి నదికి పర్వదినం వచ్చింది. గోదావరి షిరిడీకి కొద్ది దూరంలో కోపర్గాం అనే ఊరి ద్వారా ప్రవహిస్తుంది.

రేపు పర్వ దినం అనగా జోగ్‌ తాము కోపర్గాం వెళ్ళి గోదావరిలో స్నానాలు చేయటానికి బాబాను అనుమతి కోరాడు. ”రేపు చూద్దాంలే!” అన్నాడు సాయి నిర్లిప్తంగా.

”బాబా, పర్వకాలం రేపు ఉదయం ఏడు గంటలను ముగుస్తుంది. అందుకని మేము తెల్లవారు జామున నాలుగు గంటలకల్లా  బయలుదేరి వెళ్ళాలి. అప్పుడే స్నానం చేయగలుగుతాము” అన్నాడు జోగ్‌.

సాయి మాట ఒక్కటే ”రేపు చూద్దాంలే” అని.

జోగ్‌ దంపతులు నిరుత్సాహపడ్డారు. అటువంటి పర్వదినం జీవిత కాలంలో చాలా అరుదుగా వస్తుంది.

సాయి మాటను కాదని కోపర్గాం వెళ్ళే ఉద్దేశ్యమే లేదు వారికి. ఆ రాత్రి ఎలాగో గడిపారు ఆ దంపతులు.

తెల్లవారుతోంది. అప్పుడే ఏదో కోలాహలం. చాలమంది షిరిడీ వాసులు పరుగెత్తుకుంటూ వచ్చి ”షిరిడీకి గోదావరి నీళ్ళొచ్చాయి” అంటూ అరవసాగారు.

అప్పటి ప్రభుత్వం గోదావరి జలాలను పంపుదామని ఎప్పుడో కాల్వలు తవ్వించింది. ఇంకా కొన్ని నెలలు గడిస్తే గాని కోపర్గాం నుండి గోదావరి జలాలను ప్రభుత్వం వదలదు.

కానీ. అకస్మాత్తుగా ఆ గోదావరి జలాలను ఎలా వదిలారు? అదే ఆశ్చర్యం.

జోగ్‌ పరుగెత్తుకుంటూ బాబా వద్దకు వచ్చాడు. అతనితో సాయి ”రాత్రంతా నన్ను తిట్టుకుంటూనే గడిపావు కదా! భగవంతుని కరుణ చూడు. గంగ (గోదావరి) మన వద్దకే వచ్చింది కదా! వెళ్ళి అందరూ స్నానాలు చేసిరండి” అని పలికారు.

”రేపు చూద్దాంలే!” అనే మాటకు ఇంత అర్థం ఉందా! అని ఆశ్చర్యపోయాడు జోగ్‌.

ఆనాడు సాయి పాదాల చెంత గంగ ప్రవహించింది దాసుగణు కోసం. ఈ నాడు సాయి ఆదేశంతో గెంతుతూ వచ్చింది కోపర్గాం నుండి.

అసలు పాప ప్రక్షాళన చేసే సాయి పాదాలు ఉండగా, వేరే స్నానాలు కావాలా?

Compiled  By:- ముళ్ళపూడి పాండురంగ సాయినాథ్ & మున్నలూరిబోస్

Collected and Presented By: Mr: Sreenivas Murthy

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles