Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Voice support by: Mrs. Jeevani
వామన్ ప్రాణ్ గోవింద్ పటేల్ షిరిడీకి వెళ్ళి సాయిబాబాను దర్శించాడు. ఆనందం పొందాడు.
సాయిబాబా అనుమతి తీసుకుని ఎడ్ల బండిలో కోపర్గాం స్టేషన్‌కు బయలు దేరాడు తన సామానుతో.
బండి వాడు మంచి జామ పండ్లు తెస్తానని, దగ్గరలో ఉన్న తోటలోకి వెళ్ళాడు. వామన్ కూడా బండి దిగాడు. ఎంతకీ బండి వాడు తిరిగి రాలేదు. విసుగు చెందిన వామన్ అటు, ఇటు తిరుగుతున్నాడు.
వామన్ కొత్త బూట్లు వేసుకున్నాడు. అవి చిత్రమైన ధ్వని చేస్తున్నాయి. ఎద్దులు బెదిరి పోయాయి. ఎడ్లు బండితో సహా షిరిడీ వైపు పరుగెత్తసాగాయి.
ఈ లోగా బండి వాడు వచ్చి వామన్ తన బండిని ఎవరికో అమ్మి వేశాడని కోపర్గాం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు.
టాంగాపై పోలీసులు బయలు దేరారు. వామన్‌ను కోపర్గాం స్టేషన్‌లో ఉంచారు. అక్కడ వామన్ తాను నేరస్తును కాను అని గట్టిగా వాదించాడు. వామన్‌ను నిర్దోషిగా నిర్ణయించారు.
బండి వాడు అర్థం చేసుకున్నాడు వామన్ నిర్దోషి అని. ఎవరో బండి వాడు లేకుండా బండి పోతుంటే చూసి, ఆ బండిని అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్‌లో అప్పగించారు.
ఇదంతా అయ్యేటప్పటికి రాత్రి అయింది. ”రేపు ఉదయం రండి బండిని, సామానులను ఇస్తాం” అని పోలీసులు చెప్పారు.
వామన్, బండి వాడు షిరిడీకి చేరారు. వామన్ షిరిడీలోని భావు భోజన శాలలోని బల్ల మీద నిద్రించాడు. తెల్లవారింది. ఇద్దరూ కోపర్గాం వెళ్ళారు. బండిని, సామానులను తీసుకున్నారు.
అయితే సాయి వద్ద అనుమతి తీసుకున్న తరువాత ఇంతటి కష్టం ఎందుకు కలిగింది అనే ప్రశ్న వచ్చింది వామన్‌కు. ఆలోచించాడు.
ఇతర భక్తుల వలె తాను కూడా సాయి చిత్ర పటాలను సాయి చేతికి ఇచ్చి, తిరిగి వాటిని ప్రసాదంగా పొందాలని అనుకున్నాడు. కాని, ఆ పని చేయలేదు. కారణం గ్రహించాడు వామన్.
ఎవరైనా ఒక కార్యాన్ని చేయాలని ఆలోచిస్తుంటే, అది పూర్తి అయ్యే వరకు సాయి వెళ్ళనీయడు. అది సాయి తత్వం అని ఆయన గ్రహించాడు.
దీనికి ఉదాహరణగా మరో సంఘటన 1957 ఆగస్టు 1న జరిగింది. చందూలాల్ పాఠక్ షిరిడీని దర్శించాడు.
ఆగస్టు 1న తాను అనుకున్న దక్షిణను సమర్పించ కుండా షిరిడీ నుండి బయలు దేరాడు. ఎక్క వలసిన బస్సు తప్పి పోయింది.
అప్పుడు గుర్తుకు వచ్చింది దక్షిణ సంగతి. వెనుకకు తిరిగి వెళ్ళి దక్షిణ సమర్పించాడు.
అసంపూర్తిగా ఏ పనీ చేయకూడాదు!
Compiled By:- ముళ్ళపూడి పాండురంగ సాయినాథ్ & మున్నలూరి బోస్
Collected and Presented By: Mr: Sreenivas Murthy
Latest Miracles:
- మత సహనం – మార్పిడి …..సాయి@366 జూలై 17…Audio
- వామన్ శశి ఇస్లాంపూర్ కర్…..సాయి@366 జూన్ 3….Audio
- కూలీ రెండు రూపాయలు ….. సాయి@366 మార్చి 15…Audio
- సరిగ్గా నెలకే!…..సాయి@366 నవంబర్ 15….Audio
- గుజరాతీ జరీ శాలువ …..సాయి@366 ఆగస్టు 10…Audio
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Recent Comments