వామన్ శశి ఇస్లాంపూర్ కర్…..సాయి@366 జూన్ 3….Audio



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba



Voice Support By: Mrs. Jeevani


”నా గురువైన వామన శాస్త్రి మరణించారు. అందువల్ల నేనొక అనాథ బాలకుణ్ణి. ఇంకా పసితనంలో ఉన్న నన్ను నువ్వే సంభాళించాలి.

బాబా! నువ్వే సకల సాధు స్వరూపుడవు, నువ్వే వామన శాస్త్రివి” అని దాసగణు సాయిబాబాను ప్రార్ధించాడు.

వామన్‌ శశి ఇస్లాంపూర్‌కర్‌ సాయిబాబా సమకాలికుడే. వామన్‌ శశి శ్రీ కళ్యాణ మహారాజ్‌ అనే మహనీయుని పరంపరకు చెందిన సాంప్రదాయ రామదాసి.

ఆయన సంస్కృత భాషలో పారంగతుడు. బ్రిటీష్‌ ప్రభుత్వం 1894లో ఆయనకు ఎదో సంస్కృత గ్రంథం పరిశోధన నిమిత్తం శ్రీగోండ్‌ అనే ప్రదేశానికి పంపింది.

అక్కడ ఆయనకు సహాయకారిగా దాసగణు ఉన్నాడు. వామన శాస్త్రి సదాచారణ, శాంత స్వభావం మొదలైనవి దాసగణుకు నచ్చాయి. పూజ్య భావం ఏర్పడ్డది.

తాను పారమార్ధిక లక్ష్యంతో సాగాలని, అందుకు తగిన గురువుగా వామన్‌ శశిని ఎన్నుకున్నాడు దాసగణు.

పని పూర్తరంది. వామన్‌ శశి దాసగణుకు తన వ్రేలి ఉంగరాన్ని బహుమానంగా ఇవ్వబోయాడు. ”మహారాజ్‌, ఇది నాకు వద్దు. నాకు మంత్రోపదేశం చేసి నన్ను కృతార్ధుణ్ణి చేయండి” అని కోరాడు.

వామన్‌ దాసగణు ఆర్తిని చూచాడు. ప్రసన్నుడైనాడు. మంత్రోపదేశం చేశాడు.

ఒక నెల జీతాన్ని గురుపాదుకల చెంత సమర్పించాలని దాసగణు కోరిక. ”ఒక నెల జీతంతో ఏమవుతుంది గణపతిరావ్‌.

నేను నీ మొత్తం ఉద్యోగాన్నే గురుదక్షిణగా తీసుకుంటాను. కానీ, దానికి ఇంకా సమయముంది. ప్రస్తుతానికైతే రెండు పైసలు దక్షిణగా ఇవ్వు” అని 2 పైసలను స్వీకరించారు.

రెండు పైసల దక్షిణ, ఉద్యోగమును వదలివేయు (దక్షిణగా సమర్పించటం) వామన్‌ శశి ఇస్లాంపూర్‌కర్‌, సాయిబాబాల ఏకత్వాన్ని తెలియచేస్తున్నాయి.

ఇస్లాంపూర్‌కర్‌ తన శేష జీవితాన్ని కాశీలో గడపదలచి దాసగణుతో చెప్పగా అతను రెక్కలు తెగిన పక్షిలా విలవిలలాడాడు.

వామన్‌ శశి ”గణపతిరావ్‌, ఇదివరకు షిరిడీ సాయిబాబా వద్దకు వెళ్ళావు గదా! ఆయన చరణాలనాశ్రయించు. ఆయనే మార్గదర్శకం చేస్తాడు ఆయన, నేను వేరుకాదు” అని అనునయించాడు.

వామన్‌ శశి కాశీకి వెళ్ళాడు. ఆయన చెప్పిన రోజున జ్యేష్ట శుద్ధ ఏకాదశినాడు (జూన్‌ నెలలో) మహా సమాధి చెందాడు.

దాసగణు ప్రతి సంవత్సరం ఆ రోజున గురువుగారి పుణ్య తిథి జరిపేవాడు. సాయిబాబా అంగీకరించాడు.

దాసగణు గురుత్వ నాణేనికి బొమ్మ, బొరుసులు వామన్‌ శశి, సాయిబాబా.

Compiled  By:- ముళ్ళపూడి పాండురంగ సాయినాథ్ & మున్నలూరి బోస్

Collected and Presented By: Mr: Sreenivas Murthy

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles