ప్రసాదం – ధన ప్రసాదం…..సాయి@366 ఆగస్టు 19….Audio



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba



Voice support by: Mrs. Jeevani


దాసగణు పోలీసు శాఖలో ఉద్యోగం చేసేవాడు. ఆ శాఖలో ఉన్నత పదవులకోసం వ్రాయవలసిన పరీక్షలు వ్రాసి ఉత్తీర్ణుడయ్యాడు.

సాయిబాబా ఆతనిని పోలీసు శాఖలో ఉద్యోగం చేయటం సబబు కాదనుకున్నాడు. చిట్టచివరకు సాయి చెప్పినట్లుగా పోలీసు శాఖ నుండి బయటకు వచ్చేశాడు.

ఇక ఆయన జీవన భృతి ఎట్లా? అనేది సమస్య.

”ఉద్యోగం వదిలేస్తే, నా పరిస్థితి ఏమి బాబా?” అని అడిగినప్పుడు సాయి ”నేను పోషిస్తాను” అన్నాడు.

ఆ విధంగానే దాసగణుకు జీవితంలో లోటురాని విధంగా సాయి ఏర్పాటు చేస్తున్నాడని గ్రహించాడు దాసగణు.

ఆ ఒక్కటీ చాలు-

దాసగణు హరికథలు చెప్పేవాడు. ఆరతి పళ్ళెంలో ఎంతో డబ్బును వేసేవారు భక్తులు.

తన కోసం ఆ ధనాన్ని వాడుకోలేదు దాసగణు. ఎందుకంటే, తన యజమాని సాయి అని మనసారా నమ్మాడు.

1925లో మధ్యప్రదేశ్‌లోని దేవస్‌ రాజుగారి అతిథిగా దాసగణు వెళ్ళాడు.

ఏడు రోజులపాటు శ్రీకృష్ణ జన్మాష్టమి (సామాన్యంగా ఆగస్టు నెలలో వస్తుంది) సందర్భంగా దాసగణు హరికథలు చెప్పాడు. అతని గానామృతానికి అందరూ ఆనందించారు.

మహారాజు కూడా ఆనందించాడు.

మహారాజు వెండి పళ్ళెములో నూట ఒక్క రూపాయలుంచి దాసగణుకు బహూకరించాడు.

దాసగణు అతి సున్నితంగా ఆ ధనాన్ని తిరస్కరించాడు. మహారాజు చతురుడు. ”ఆ డబ్బు కృష్ణ ప్రసాదమే!” అన్నాడు ఆయన.

ఆ మాటను కాదనలేకపోయాడు దాసగణు. ఎందుకంటే అది సత్యమే. దాసగణు అంగీకరించి ఆ ధనాన్ని స్వీకరించాడు. ”ఇక ప్రసాదాన్ని వితరణ చేద్దాం!” అన్నాడు దాసగణు.

దైవానికి నివేదించిన ఇతర ప్రసాదాలతోపాటుగా, దాసగణు ఆ నూట ఒక్క రూపాయలను జతచేసి, ప్రసాద వితరణ గావించాడు.

మహారాజు దాసగణు సమయస్పూర్తికి చకితుడయ్యాడు, సంతోషించాడు. మనకు లభించిన ధనము, ఏ రూపములోనున్నా, రూపాయల రూపంలోనే ఉండనక్కరలేదు, అది సాయి ప్రసాదమే.

దానిని అందరకూ వితరణ చేయాలి.

అది సాయినాథుని దగ్గరకు చేర్చే సాధనం కూడా!

Compiled  By:- ముళ్ళపూడి పాండురంగ సాయినాథ్ & మున్నలూరి బోస్

Collected and Presented By: Mr: Sreenivas Murthy

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles