Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Voice Support By: Mrs. Jeevani
ఒకసారి ద్వారకామాయిలో ఉన్న దామూ అన్నాకు ”సాయిబాబావద్ద అనేకమంది గుమిగూడుచున్నారు. వారందరూ బాబా వలన మేలు పొందెదరా?” అనే సందేహం వచ్చింది.
సాయి ”మామిడి చెట్లవైపు పూతపూసి యున్నప్పుడు చూడుము. పువ్వులన్నియూ పండ్లు అయినచో, ఎంత మంచి పంట అగును? కానీ అట్లు జరుగునా? పువ్వుగానే చాలమట్టుకు రాలిపోవును. గాలికి కొన్ని పిందెలు రాలి పోవును. కొన్ని మాత్రమే మిగులును” అన్నారు అతనితో.
అట్లే సాయిని అంటిపెట్టుకుని ఉన్న వ్యక్తులే మధురాతి మధురమైన మామిడి పండ్లుగా మారి, అమృత రసాన్ని సాయి భక్తులకు అందచేసారు. వారిలో అద్వితీయుడు దాసగణు మహారాజ్.
అల్లరి చిల్లరగా తిరిగే దాసగణుకు పోలీసు ఉద్యోగం దొరికింది. అయితే పోలీసు శాఖలో ఉన్నత పదవి కోసం పరీక్షలు ప్యాస్ అయ్యాడు. సాయి బాబా వద్దకు అయిష్టంగానే వచ్చాడు.
బాబా అతనిని పోలీసు ఉద్యోగాన్ని వదిలివేయమన్నారు. ఇదిగో, అదిగో అంటూ వాయిదాలు వేసేవాడు. చివరకు తప్పనిసరిగా ఉద్యోగానికి రాజీనామా చేసాడు.
అప్పుడు సాయి వద్దకు వచ్చి ”నాకిక జీవనాధారమేమి?” అని అడిగాడు. బహుశా ఇదే సాయినాథుని గణూ కోరిన చివరి కోరిక.
భార్య పిచ్చిది. ఆమెకు పిచ్చి నయంచేయమని సాయిని కోరలేదు. పుత్ర సంతానం లేదు. సాయిని కోరలేదు.
సాయిబాబాకు మొదటి చరిత్రకారుడు దాసగణు. బాబాకు చివరగా తన రచనను వినిపించిన వ్యక్తి దాసగణు. సాయి సాహిత్యంలో ప్రథమ పరిశోధకుడు దాసగణు.
హరికథా కాలక్షేపం చేసేవాడు. ఆయన హరికథలు విని ఎందరో ప్రభావితులై షిరిడీకి చేరి సాయి భక్తులైనారు.
అందరకూ అర్థమయ్యేలా ఈశావాస్యోపనిషత్తుని సులభ భాషలో వ్రాయటానికి సంకల్పించగా, బాబా అతనిని కాకా సాహెబ్ పనిపిల్ల నీకు మర్మమును బోధించును అన్నారు.
అందరూ అది హాస్యంగా సాయి పలికాడు అనుకున్నారు. కానీ, దాసగణు సాయిని నమ్మాడు, లబ్ధిపొందాడు.
ఆయనకు గర్వం లేదు. మసీదు ఊడ్చే చీపురు తాను అనేవాడు. ఆయనది వర్షాకాలపు చదువు, అదీ మూడవ తరగతి వరకే.
ఆతడు రచించిన కొన్ని గ్రంథాలు పండితపామరులను మెప్పించటమేకాక విశ్వవిద్యాలయాల్లో పాఠ్య గ్రంథాలయ్యాయి.
ఆయన 1962 కార్తీక కృష్ణ చతుర్దశినాడు సాయిలో లీనమయ్యాడు పండరీ పురంలో. ఆయన వాక్కు నిజమైంది.
‘షిరిడీ మాఝే పండరిపుర’ కదా!
Compiled By:- ముళ్ళపూడి పాండురంగ సాయినాథ్ & మున్నలూరిబోస్
Collected and Presented By: Mr: Sreenivas Murthy
Latest Miracles:
- సాయి స్తవన మంజరి…..సాయి@366 సెప్టెంబర్ 9….Audio
- ప్రసాదం – ధన ప్రసాదం…..సాయి@366 ఆగస్టు 19….Audio
- సాయిని పస్తులుంచిన డాక్టరు! …..సాయి@366 ఏప్రిల్ 28….Audio
- మనసులోని కోరిక…..సాయి@366 అక్టోబర్ 28….Audio
- ఓం శ్రీ సాయి హనుమాన్ …..సాయి@366 ఏప్రిల్ 1…..Audio
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Recent Comments