నా గానం, నా ప్రాణం…. మహనీయులు – 2020… నవంబర్ 28



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


“ఎచట నుండిన రఘువర దాసు

చివరకు రాముని చేరుట తెలుసు”

అని వ్రాసారు సుందరకాండలో శ్రీ ఎం.యస్. రామారావు గారు.

తెలుగు నేలను రామ భక్తితో పునీతం చేసింది త్యాగయ్య, గోపరాజు, బమ్మెర పోతరాజు మాత్రమే కాదు. పెమ్మరాజు విశ్వేశ్వర రావుగారు కూడా రామ భక్తి సామ్రాజ్యంలో పాలుపంచుకున్న పుణ్యాత్ముడు.

చూలాలు పల్లాలమ్మ అడవికొలను గ్రామంలో ఉన్న జనార్దనస్వామి ఆలయ ప్రాంగణంలో ఉన్న ధ్వజస్తంభం వద్ద నొప్పులు వచ్చి, అక్కడే మగ బిడ్డను ప్రసవించింది. ఆ దినం 28 – 11 – 1914 – వైకుంఠ ఏకాదశి. ఆ బిడ్డడే పెమ్మరాజు విశ్వేశ్వర రావు.

అనంతరం ఆయన సియారఘవరదాసు అయ్యారు. తురీయాశ్రమం స్వీకరించి అవధూతేంద్ర సరస్వతీ స్వామి అయ్యారు.

ఆయనది కిన్నెర కంఠ స్వరం.

ఆయన అయోధ్య పరిక్రమను చేస్తూ పాడుతూ పోతుంటే, సాధు,సన్యాసులు, మండలేశ్వరులు ఆయన వెంట వచ్చేవారు. ఆయన కంఠస్వరం చైతన్య ప్రభువులను తలపించేది.

శ్రీరామ సాక్షాత్కారాన్ని పొందిన వారు శ్రీ జానకీ వల్లభ శరణ్. ఆయన రామత్రయోదశ మంత్రము, వైష్టవ దీక్ష ఇచ్చి సియారఘువరదాస్ అనే నామాన్ని ఇచ్చారు. గురు దక్షిణ ఇచ్చారు.

నిజానికి సియారఘువరదాస్ వద్ద ఇచ్చేనందుకు ఏమీ లేదు. ఆ మాటనే చెప్పారు సియారఘువరదాస్ గురువులకు.

కానీ గురువులకు ఏమి పుచ్చుకోవలెనో తెలుసు. సరయూ నది జలాలను తెమ్మన్నారు శిష్యుడైన సియారఘువరదాస్ ను.

“నీకున్న సంగీత విద్యను, పాట కచ్చేరీలకు, నాటకాలకు వినోదాలకు వినియోగించకుండా, భగవన్నామ సంకీర్తనకై వినియోగిస్తానని సరయూ జలాల సాక్షిగా ప్రమాణం చేయి” అన్నారు శిష్యునితో.

శిష్యుడు రఘువరదాస్ సంతోషంతో ఆ గురు దక్షిణ ఇచ్చాడు. అది అపూర్వ గురు దక్షిణ.

సాయిబాబా కూడా దాసగణు చే తన నామ సంకీర్తనను ప్రతిఫలాపేక్ష లేకుండా చేయించారు.

గంగా తీరాన రామ నామం సంకీర్తన చేసుకుంటూ పోతుంటే, మొసలి రఘువరదాస్ కాలును పట్టుకుంది.

వెంటనే ఒక మహనీయుడు ప్రత్యక్షమై ఆయనను చేయి పట్టి లాగి, దూరంగా విసిరివేశాడు.

మరోసారి గిట్టని వారు చేతబడి చేశారు రఘువరదాస్ కు. మాట పడిపోయింది.

ఒక సాధువు వచ్చి తులసీదాస్ రచించిన హనుమాన్ చాలీసాను ఆయనకిచ్చి “కన్నులతో చూస్తూ, మనసుతో చదువు హనుమాన్ రక్షిస్తాడు” అన్నాడు. అలాగే రఘువరదాస్ చేశాడు స్వస్థుడైనాడు.

తెలుగు నేలపై తొలిసారిగా హనుమాన్ చాలీసాను తెచ్చి, భక్తుల హృదయాలలో నేటికి చిరస్మరణీయుడైనాడు రఘువరదాస్. నేడు నవంబర్ 28. రఘువరదాస్ జన్మ దినం.

రఘువరదాస్ ను స్మరించెదము  గాక… జయాసియరం

Written by: Mullapudi Panduranga Sainath &  Munnaloori Bose.

Collected and Presented By: Sreenivas Murthy

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles