Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
భిక్కుబాయి సాయిబాబాకు పూలమాల, పేడాలు, తెచ్చి సమర్పించింది. సాయి వాటిని త్రోసిపారవేశారు. స్వీకరించలేదు.
బహఉద్దీన్ షానక్సాబంద్ ను ఒక భక్తుడు భోజనానికి ఆహ్వానించాడు. బహఉద్దీన్ తో వచ్చిన వారంతా భోజనం చేయటం మొదలుపెట్టినా ఆ సూఫీ యోగి ఆహారాన్ని ముట్టలేదు.
“అబ్బాయి! నీవు పిండి కలిపి, రొట్టెలు కాల్చి మాకు వడ్డించేవరకు చూస్తున్నాను, ఇంకా నీవు ఎంతో కోపంతో ఉన్నావు. ఆ ఆహారం నీ కోపంతో కలుషితమైపోయింది. ఆ ఆహారం ద్వారా సైతాను లోపల ప్రవేశించి వాడి ప్రతాపాన్ని చూపెడతాడు” అని తాను తీసుకోకపోవటానికి కారణం చెప్పారు.
సాయికి భిక్కూబాయి ఎంతో విషాదంతో సమర్పించింది. భక్తి, ప్రేమలతో సమర్పణ చేస్తేనే ఆ దైవం స్వీకరిస్తాడు.
సత్పురుషులు అందరినీ ఆదరిస్తారు. ఒకసారి బహఉద్దీన్ వద్దకు ఎవరో భక్తుడు వచ్చి సలాం చేశాడు. బహఉద్దీన్ ప్రతినమస్కారం చేయలేదు.
ఆ భక్తుడు నొచ్చుకుని వెళ్ళిపోయాడు. కొంచెంసేపు తరువాత బహఉద్దీన్ స్పృహలోకి వచ్చాడు.
వెంటనే అక్కడ ఉన్న ఒక వ్యక్తి ద్వారా తనవద్దకు వచ్చి వెళ్ళిపోయిన వ్యక్తికి ఈ విషయం చెప్పిరమ్మని పంపారాయన. అంతటి వినయమూర్తి బహఉద్దీన్.
బహఉద్దీన్ దైవచింతనలో పడితే సర్వస్వాన్ని మరచిపోయేవాడు. ఆయన గతంలో శిష్యుడిగా ఉన్నప్పుడు ఎటోవెళ్ళిపోయాడు.
దైవచింతన నుండి ప్రపంచంలోనికి వచ్చిన తరువాత, వెనుకకు మరలాడు గురు గృహానికి.
కాళ్ళు నొప్పులు పుడుతున్నాయి. పాదాలకు ముండ్లు గుచ్చుకుని నడవటం సాధ్యం కావటంలేదు. ఎలాగో ఆలాగ గురు గృహానికి చేరాడు.
ఆ గురువు సయ్యద్ అమీర్ కులాల్ “అతడిని లోపలకు రానీయకండి” అని ఆజ్ఞాపించాడు అక్కడున్న శిష్యులను. శిష్యులు అతనిని లోపలకు రానీయలేదు. తలుపులు మూశారు.
బహఉద్దీన్ అక్కడే గుమ్మం చెంత కూలబడ్డాడు. ఎముకలు కోరికే చలి పైగా గాలి. బహఉద్దీన్ కు గురువుపై రవ్వంత కోపంరాలేదు సరికదా పైగా గురు కృప కోసం, ఆయనను ఎప్పుడు దర్శిద్దామా అన్న తపనతో ఉన్నాడు.
గుండెలో పదిలపరుచుకున్న ఆ దైవం చలిగాలి నుండి కాపాడింది. తెల్లవారుతొంది.
చీకటిలో చూడక బహఉద్దీన్ పై కాలు వేశాడు గురువు. వెంటనే గ్రహించాడు. శిష్యుని తన ఒడిలో చేర్చుకుని, పాదాలలోని ముండ్లను తీసివేశాడు. గురుకృపకు, దైవ కటాక్షం తోడైంది.
ఒకసారి గురువే అన్నాడు అల్లా నీకెన్ని శక్తులు ఇచ్చాడో, నీకు కూడా తెలియదు అని.
బహఉద్దీన్ సూఫీలో నక్సబంద్ శాఖను ప్రారంభించాడు.
ఆయన మార్చి 28, 1318 లో జన్మించారు.
ఆయనవలె మనం కూడా దైవానికి గుండెలో గూడు కట్టుదము గాక!
Written by: Mullapudi Panduranga Sainath & Munnaloori Bose.
Collected and Presented By: Mr: Sreenivas Murthy
Latest Miracles:
- గొడ్డలికి పరిమళం…. మహనీయులు – 2020… మార్చి 19
- బాల గురువు … …. మహనీయులు – 2020… మార్చి 30
- గురు పాదుకా స్తోత్రం
- దారం…. …. మహనీయులు – 2020… ఆగస్టు 24
- నా గానం, నా ప్రాణం…. మహనీయులు – 2020… నవంబర్ 28
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Recent Comments