ఎంత దయామయుడు బాబా. నా నొప్పి బాధ రెండు రోజులలో తగ్గిపోయాయి.



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


ఒకసారి నేను దసరాకు నాటకాలు వేయడానికి ఒప్పుకున్నాను. బాబా గుడి దగ్గర బాబాగా వేస్తున్నారు. ఆయన చాలా పెద్ద వయసువారు. నేను లక్ష్మి బాయి గా వేసేదాన్ని.

ఏవో పద్యాలు, పాటలు పాడాలని చెప్పారు. అప్పటికి ఆ  నాటకం చాలా సార్లు వేసాను. 40 సంవత్సరాల అనుభవం ఉంది నాకు.

రేపే నాటకానికి వెళ్ళాలి. నేను ఉండేది సనత్ నగర్ లో, నాటకం వేయవలసింది మల్కాజ్ గిరి లో, ముందు రోజు ఉదయం నేను బాత్రూమ్ లో కాలు జారి పడ్డాను.

ఎక్కడ ఏం దెబ్బలు తగల్లేదు. కానీ నా కుడి చెయ్యి మని కట్టు దగ్గర వాచి నొప్పిచేసింది. ఏవో మాత్రలు వేసుకున్నాను గాని నాకేమి గుణం కనపడలేదు.

ఇలా చెయ్యి నొప్పి పెట్టుకొని నేను నాటకానికి ఏం వెళ్తాము అనుకున్నాను. తెల్లారింది నాటకం ఆ రోజే నాకేమో చెయ్యి బాగా నొప్పి పెడుతుంది.

ఆ నాటకం లో బాబా వేషం వేసే ప్రసాద్ గారు నన్ను తీసుకురమ్మని ఆటో మాట్లాడి పంపారు. నన్ను తీసుకురమ్మని ఆటో అతనికి చెప్పారట.

ఆటో వాడితో బాబూ నాకు ఒంట్లో బాగో లేదు. చెయ్యి లేవడం లేదు, బాగా నొప్పి చేసింది. అందుచేత నేను రావడం కుదరదు అని అలా ప్రసాద్ గారితో చెప్పు అని ఆటో వాడిని పంపించేసాను.

ఆటో వాడు మరో గంటన్నరలో మళ్ళీ వచ్చి అమ్మా ఆయన మిమ్మల్ని వెంటపెట్టుకుని రమ్మన్నారు అన్నాడు.

నేను ఎలా వస్తాను, నా పరిస్థితి ఇలా ఉంది అని చెప్పానా, నా చెయ్యి లేవడం లేదని నువ్వు చూసావుగా ఆ విషయం ఆయనతో చెప్పకపోయావా, అని అన్నాను.

అతను ” చెప్పనమ్మా! చెయ్యే కదా బాగుండనిది, కాలు, నోరు బాగానే ఉన్నాయి కదా! కాలితో నడవగలదు, నోటితో పద్యాలు చెప్పగలదు కదా, వచ్చేయమని చెప్పామన్నారు ” అన్నాడు వాడు.

ఇంకేం చెయ్యను చెయ్యి లేవటంలేదు అన్నా కూడా ఈ పెద్దాయన వదలడు కాబోలు.

ఈ నాటకాలు వేయించే వాళ్ళకి నటీనటుల సాధక బాధకాలతో ప్రమేయం లేదు. ఎలా ఉన్నా నాటకం వేసెయ్యాలి అంటారు.

ఈయన గుడి వాళ్ళ దగ్గర డబ్బు తీసుకున్నాడు, నాటకం వేయకపోతే ఈయన్ని తిడతారు అందుకని నేను రాలేని పరిస్థితిలో ఉన్నాను అని చెప్పినా కూడా వినకుండా వెంట పెట్టుకురమ్మని నన్ను చంపుతున్నాడు. అని తిట్టుకుంటూ ఆటో ఎక్కాను.

ఆటో వెళ్లి మల్కాజ్ గిరి లో ఆ ప్రసాద్ గారింటి ముందు ఆగింది. వాళ్ళింటి పక్కనే గుడి.

నేను ఆటో దిగి ఆయన దగ్గరికి వెళ్లి ఏమిటి బాబాయ్ గారు, నేను రాను రాలేను అంటే కూడా వినిపించుకోకుండా రమ్మన్నారట, నేను నాటకం వెయ్యలేనండి. నన్ను చూడండి నా చెయ్యి రావటం లేదు.

నాటకం ఎలా వేస్తాను నాటకం లో ఈ చేత్తో పని ఉంది మీకు (బాబా) దండం పెట్టాలి. వాపుంది, కట్టుంది ఎలాగండి వేయడం?

ఈ చేత్తో మేకప్ ఎలా వేసుకోను, చీర ఎలా కట్టుకోను, జడ కూడా వేసుకోలేను, ఎందుకండీ బాబాయ్ గారు నన్ను ఇబ్బంది పెడతారు అని అన్నాను,

అలాగంటే ఎలాగమ్మా, ఆ గుడి వాళ్ళు పాంప్లెట్స్ వేసుకున్నారుగా మరి అన్నాడు.

అయితే ఏంటండీ బాబు బాగుండకపోయినా చెయ్యమంటారా అని అడిగాను.

అప్పుడాయన వాళ్ళ ఇంట్లో ఉన్న నిలువెత్తు బాబా విగ్రహం ముందు తీసుకెళ్లి, ఆ విగ్రహం కేసి చూస్తూ ” ఏంటయ్యా ఇలా పడేసావు , చూడు ఎలా బాధపడుతుందో, నాటకం వెయ్యాలా? ని భక్తురాలి పాత్ర ఆవిడ వెయ్యాలా? ఎలా వీలవుతుంది ఇలా ఉంటే. ఇచ్చేయ్ చెయ్యి ఇచ్చేయ్ ఆవిడకి ” అన్నాడు.

ఊదీ తీసి నా చేతికి పూసి, ఆ ….. ఇంక తయారవ్వమ్మా, సమయం అవుతుంది” అని చెప్పి కొంచెం లోపలి కి వెళ్లి వాళ్ళ శ్రీమతి ని పిలిచాడు.

ఏమోయ్ ఈ అమ్మాయి పాపం పడిందట! చెయ్యి పని చెయ్యడం లేదు, అందుచేత చీర కట్టి, జడ వేసి కాస్త తయారు చేసి పంపు ” అని చెప్పి వీధి లోకి వెళ్ళిపోయాడు.

ఆ మహాఇల్లాలికి కూడా పెద్ద వయసే. అయినా భర్త అంటే భయం, వణుకు, గడగడలాడుతూ ఆవిడ నన్ను లోపలి తీసుకెళ్లి మొహం కడిగి మేకప్ వేసి, మహారాష్ట్ర చీర కట్టు కట్టి, జడ కొప్పు, పూలు పెట్టి గుడి దగ్గర దింపింది.

నాటకం మొదలయ్యింది. వేరే వాళ్ళు వాళ్ళ వాళ్ళ పాత్రలకున్న డైలాగులు చెప్పి దిగిపోతున్నారు. నా వంతు వచ్చింది.

పాటలు, పద్యాలు, డైలాగులు అయ్యాయి. నాటకం చివరికొచ్చింది.

నేను బాబా పాదాలకి వంగి నమస్కారం చెయ్యాలి. రెండు పాదాలకు రెండు చేతులు అంటించి నమస్కారం చేసి స్టేజి దిగాను.

నాటకం అయిపోయాక ఆ పెద్దాయన వచ్చి ” ఎమ్మా లక్ష్మి ఏమైంది నీ చెయ్యి ” అని అడిగారు. అప్పుడు గుర్తొచ్చింది నా చెయ్యి మాములుగా పనిచేస్తోందని.

వాపు మాత్రం అలాగే ఉంది. అప్పుడు కుదిరింది నాకు బాబా మీద గురి. కళ్ళమ్మట నీళ్లు వచ్చాయి. ఎంత దయామయుడు బాబా. నా నొప్పి బాధ రెండు రోజులలో తగ్గిపోయాయి.

The above miracle has been typed by: Mrs. Rajarajeswari Sainathuni

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles