Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
నా పేరు జాదవ్ మేము ప్రస్తుతం షిరిడి దగ్గర కోపర్ గాంవ్ లో ఉంటున్నాము.
నేను షిరిడి లో సాయి ద్వారకామాయి భవన్లో supervisor గా పనిచేస్తున్నాను. నాకు చిన్నప్పటినుండి కష్టపడటమే తెలుసు.
నేను స్కూల్లో చదివేటప్పుడు మధ్యలో సెలవులు వస్తే రోజుకి ఐదు రూపాయలకి కూలి పని చేశాను. ఇంట్లో మాది అంత మంచి పరిస్థితి కాదు.
మాకు ఊర్లో హోటల్ ఉండేది, దాని బిజినెస్ సరిగా జరిగేది కాదు. అందుకని నేను పనిచేస్తూ చదువుకోవలసి వచ్చింది.
హోటల్ లో టీలు తయారు చేసిస్తే నేను వెళ్లి అమ్ముకువస్తుండే వాడిని. 10th అయ్యింది. ఫస్ట్ ఇయర్ ఇంటర్లో చేరటానికి నా దగ్గర ఒకే ఒక ప్యాంటు షర్ట్ ఉన్నాయి.
కాలేజీ కదా, మరో జత బట్టలు కావాలి. కుట్టించుకునేందుకు మాకు స్థోమత లేదు. మా పటేలు కొడుకు నాకు ఒక జత బట్టలు తాను వాడి తీసేసినవి ఇచ్చాడు.
ఆ 2 జతలతోనే నేను 2 ఇయర్స్ గడిపాను. వారానికి ఒక్కసారి మాత్రమే వాటిని ఉతికేవాడిని. నేను సెకండ్ ఇయర్ ఇంటర్ పాసవ్వలేదు. రెండు సబ్జక్ట్స్ ఉండిపోయాయి.
మళ్ళీ పరీక్షకు కట్టాలంటే డబ్బులు లేవు. మా అన్నయ్యకి దుకాణం ఉంది. శని ఆది సోమ వారాల్లో సంత జరుగుతుండేది.
ఆ దుకాణం ముందు పేడ అలకడం నీళ్లు కొట్టడం చేసేవాడిని. BSF లో ఉద్యోగాలు ఉన్నాయని ఫ్రెండ్ అప్లికేషన్ పెడితే అతను interview కోసం వెడితే నన్ను తన కూడా తీసుకువెళ్లాడు.
అతనికి ఉద్యోగం రాలేదు కానీ వాళ్ళు నన్ను తీసుకున్నారు. రెండు నెలల తర్వాత కాల్ లెటర్ పంపుతామన్నారు, వచ్చింది.
ట్రైనింగ్ కి ఇండోర్ కి పంపించారు. నేను ఒక వారం ఉండేసరికి నాకు నీళ్లు పడక వచ్చేసాను. ఆ తర్వాత పూనాలో మా అక్క ఉంది. అక్కడికి వెళ్ళాను.
అక్క, బావ నీకు పని దొరికితే చెయ్యి , లేకపోతే కూర్చొని హాయిగా తిను అన్నారు. ఒక వర్క్ షాపులో రోజుకి ఎనిమిది రూపాయలకి పని చేశాను.
ఆ తర్వాత బజాజ్ ఆటో, టెంపో ఇలా చాలా కంపెనీలలో పనిచేసాను.
మా అన్నయ్య మధ్యలో వచ్చి కోపర్ గాంవ్ లో ” సంజీవిని షుగర్ ఫ్యాక్టరీ ” పెడుతున్నారు అక్కడ మనిద్దరం చాయ్ దుకాణం పెడదాము రమ్మన్నాడు.
పూనాలో 8 – 10 సంవత్సరాలు పనిచేసాక కోపర్ గాంవ్ వచ్చాను. అక్కడ షాప్ పెట్టాము. 1993 లో నాకు పెళ్లి అయ్యింది.
అమ్మాయి తాలూకా వాళ్ళు నన్ను రోజూ చూస్తూ ఉంటారట. 1997 లో మాకు ఒక పాప పుట్టింది. కొన్నాళ్ళు అయ్యాక నాకు కొంత డబ్బు ఇవ్వు షాపు నీ పేర పెట్టేస్తాను అన్నాడు మా అన్నయ్య.
నేను ఆ మాట నిజమని అనుకోని మా ఆవిడ నగలు తీసి అమ్మి 25000 రూపాయలు ఇచ్చాను. డబ్బులు తీసుకున్నాక మా అన్నయ్య నాకు డబ్బులు ఇవ్వలేదు, షాపు ఇవ్వలేదు.
డబ్బులు వాడేసుకున్నాడు. 10 లీటర్ల టీ అమ్మే షాపు , హాఫ్ లీటర్ టీ అమ్మే పరిస్థితికి వచ్చింది.
చాలా నష్టం వచ్చేసింది. అప్పటికీ నేను ప్రతి గురువారం కోపర్ గాంవ్ నుండి షిరిడి కి చెప్పులు లేకుండా నడిచి రావడం వచ్చేటప్పుడు నడిచి వచ్చి, తిరిగి వెళ్ళేటప్పుడు ఎదో ఒక వాహనం (బైక్, బస్సు) ను ఆశ్రయించి వెళుతూ ఉండే వాడిని.
సమాధి మందిరం చుట్టూ ప్రదక్షిణాలు చేసేవాడిని నన్ను ఎలాగైనా ఇక్కడికి (షిరిడి) కి తీసుకురా బాబా ఇదే నా ప్రార్ధన. ఆ తరవాత నాకు సాయి భవన్లో ఉద్యోగం దొరికింది.
వాళ్ళు నాకు ఉద్యోగం ఇచ్చే ముందు నేను సమాధి మందిరంలో ప్రదక్షిణలు చేసి చావడికి వెళ్ళాను ” బాబా రోజులు గడిచి పోతూ ఉన్నాయి, నాకు మాత్రం నౌకరి రావడం లేదు అనుకున్నాను.
తల వంచి బాబా పాదాలు పైన నమస్కారం చేసుకుంటూ ఉండగా నా తల పైన పువ్వు పడింది. ఆ పువ్వు ని నా చేతి లోకి తీసుకున్నాను నాకు బాబా నుండి పర్మిషన్ లభించింది అనిపించి నా కోరిక తప్పక తీరుస్తాడు అనే నమ్మకం కుదిరింది.
ఒక రోజు పేపర్ ఒకటి గాలికి కొట్టుకొని నా దగ్గరికి వచ్చింది, ఆ పేపర్ లో అశోక్ కాంబేకర్ ఆయన సంస్థానంలో ట్రస్ట్ మెంబర్, ఆయనతో పాటు నా స్నేహితుడి ఫోటో ఉంది.
అప్పుడు నాకు ఆ ఫోటో చూసి బాబా నీ దగ్గర నాకు రెండు పూటలా రెండు రొట్టెలు పెట్టి చీపురు తో ఊడ్చే పని అయినా నాకు ఇప్పించు అని అనుకున్నాను.
అంతకు ముందు షిరిడి వచ్చేవాడిని వెళ్ళేవాడిని ఎప్పుడూ ఆయన మీద శ్రద్ద కలగలేదు.
ఇంతలో ఆ ఫోటో లో ఉన్న నా స్నేహితుడు మా ఇంటి ముందు నుండి సైకిల్ మీద వెడుతున్నాడు (అతని పేరు రాజేంద్ర సత్పతి).
అతన్ని వెంటనే పిలిచి ”నాకు ఎలాగైనా షిరిడి లో ఉద్యోగం ఇప్పించు అని” అన్నాను.
ఫోన్ చేసి సాయి భవన్ లో చైర్మన్ కి చెప్పాడు ” రెండు నెలల్లో నీకు రూమ్ బాయ్ గా ఉద్యోగం రావొచ్చు” అని చెప్పాడు.
ఒక రోజు నేను నా స్నేహితుడు కోపర్ గాంవ్ నుండి నడిచి వస్తుంటే సావుల్ విహిర్ దగ్గరికి వచ్చేటప్పటికి, నేను నా స్నేహితుడు ఇద్దరం ఉన్నాము.
ఒక ముసలి వ్యక్తి గడ్డం అదీ ఉంది. మహారాష్ట్ర మనిషి లాగా ఉన్నాడు. బస్టాండ్ దగ్గరగా నిలబడి ఉన్నాడు. అప్పుడు సమయం 4.30 అయ్యింది.
ఆ రోజు గురువారం నా కాళ్లకు చెప్పులు లేవు చలికాలం బాగా మంచు కురుస్తుంది. ” బస్టాండ్ ఎక్కడా” అని నన్ను అడిగాడు. ఇదే బస్టాండ్ అన్నాను.
అతని వెనుకకు చూపించి ” మీరు ఎక్కడికి వెడుతున్నారు అని మమ్మల్ని అడిగారు, మేము షిరిడి వెళ్తున్నాము” అన్నాను.
షిరిడి ఎలా వెళ్ళాలి? అన్నాడు. మేము బండి మీద వెళ్లొచ్చు ” అని చెప్పాము ”.
”మీతో కూడా వస్తాను” అన్నాడు. సరే రమ్మన్నాను. ఆయన మాతో పాటు నడిచి బయలుదేరాడు .
”ఇంత ఉదయాన్నే ఇంత చలిలో కాళ్ళకి చెప్పులు కూడా లేవు ఇంత దూరం ఎలా వెడతారు?” అన్నాడు. బాబా తీసుకువెళతారు తీసుకువస్తారు అన్నాను.
మా స్నేహితుడు కొంచెం దూరం వెళ్ళాక టీ తాగుదాం అన్నాడు. ఆ ముసలాయన నా దగ్గర టీ కోసం డబ్బులు లేవు అన్నాడు. డబ్బులు నేను ఇస్తాను అని చెప్పాను. ముగ్గురం టీ తాగాము.
దత్త మందిరం దాక (లెండీ తోట) వచ్చాక ముగ్గురం దండం పెట్టుకుంటూ మా ఫ్రెండ్ తో నేను అన్నాను, ఈయనకి మనం బాబా దర్శనం చేయిద్దాము అని చెబుతూ పక్కకి చూస్తే ఆ ముసలాయన ఇంక కనపడలేదు.
లెండీ తోట అంతా వెతికాము, ఇంక కనపడలేదు. బాబాయే మాతో పాటు నడిచి వచ్చాడు టీ తాగాడు అని అర్ధం అయ్యింది.
The above miracle has been typed by: Mrs. Rajarajeswari Sainathuni
Latest Miracles:
- తొలిసారి ఒంటరిగా షిరిడి వెళ్ళిన నాకు, ఎటువంటి ఇబ్బంది లేకుండా చేసిన బాబా వారు
- నాకు ప్రాణభిక్ష పెట్టి, తమ చేతి స్పర్శ తో నా కాళ్ళ బాధల నుండి విముక్తి చేసిన బాబా …!
- ” ఊదీ ” మహిమతో ఎంతటి నొప్పి అయినా మటుమాయం …………………!
- బాబా అడిగి చెల్లించుకున్న దక్షిణ వైనం!!–Audio
- మా ఆవిడా రెండు రూపాయలు దక్షిణ ఇవ్వగానే ”నువ్వు నన్ను షిరిడిలో కలుస్తావు మనం కలుద్దాము” అని మరాఠీ వాని రూపములో వచ్చిన ఆయన అన్నారు.
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Recent Comments