Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
నాకు B . com చదవాలని ఉంటే మా నాన్నకి B . A చదివించాలని ఉండేది. మొత్తం మీద నేను కాలనీలోనే B . A డిగ్రీ పాసయ్యాను.
అప్పట్లో నారా చంద్రబాబు నాయుడు C.M. గా ఉన్నప్పుడు ఇంటర్ క్వాలిఫికేషన్ కే టీచర్ పోస్టింగ్స్ ఇచ్చి ఆ తర్వాత ట్రైనింగ్ (B . ed) చేయమన్నారు.
ఆ సమయం లో నేను ట్రైనింగ్ కి అప్లై చేశాను. నాకు ట్రైనింగ్ సెంటర్ కూడా ఎక్కడో చాలా దూరంగా ఉండేది.
నన్ను చూసి మేనేజ్ మెంట్ నువ్వు రోజూ రానవసరం లేదు అంటూ వాళ్ళు మెసేజ్ చేసారు. ఎప్పుడైనా అప్పుడప్పుడు మాత్రమే ట్రైనింగ్ కి వెళ్తాను.
అప్పట్లో నాకు ”షిరిడి” కి వెళ్లాలనే కోరిక బాగా ఉండేది. ఎప్పుడు నాన్నని అడిగినా కానీ వెలుదువుగానిలే, అనేవారే కానీ ఎప్పుడూ పంపించలేదు.
నాకు బాబాను చూడాలని చాలా ఆశగా ఉండేది. నాకు B . ED కౌన్సెలింగ్ సమయంలో ఇంట్లో నేను షిరిడి షిరిడి అంటూ ఉంటే తిరుపతి కి బుక్ చేసారు.
ఇంచు మించు ఒకే సమయంలో అటు తిరుపతి ఇటు B . ED కౌన్సిలింగ్ ఒకటి, రెండు రోజుల తేడా మాత్రమే ఉంది, ఎలాగా అని ఆలోచిస్తూ ఉండగా, ఒక సెమినార్ కి చిన్న జీయర్ స్వామిజీ వస్తారని తెలిసి ఆ కార్యక్రమానికి నన్ను మా స్నేహితురాలు బండి మీద తీసుకెళ్లింది.
మధ్య దారిలో ఎదో అడ్డం వచ్చింది, బ్రేక్ వేసి బండి ఆపాల్సింది కంగారులో బండి రైజ్ చేసింది, ఇద్దరం కింద పడిపోయాము.
కింద నుండి పైకి లేచాము. కొంచెం ఒళ్ళు నెప్పులుగా ఉన్నాయి. నెమ్మదిగా ఇంటికి వచ్చేసాము.
కానీ మరునాటికి నాకు నడుము దగ్గర బాగా నొప్పి వస్తోంది. డాక్టర్ దగ్గరికి వెడితే x ray తీయించుకోమన్నారు.
x ray లో ఏమీ తెలియలేదు కానీ, ఇంట్లో మాత్రం నేను బండి మీద నుండి పడినట్లు నిజం చెప్పలేదు, డాక్టర్స్ కి నిజం చెప్పాను,
డాక్టర్ రిపోర్ట్ లో బండి మీద పడినట్లు రాయబోతుంటే ఇంట్లో తెలిస్తే గొడవ అవుతుందని వద్దు అన్నాను, మరో డాక్టర్ కి చూపిస్తే M . R . I తీయాలన్నారు.
M . R . I అంటే దాదాపు ఒక గంటన్నర సమయం పాటు మనిషి శరీరాన్ని ఒక మిషన్ లోకి పంపుతారు అసలు కదలనే కూడదు. కదిలితే మళ్ళీ మొదలు పెట్టి చేయాల్సి ఉంటుంది.
నా ఒంటి పరిస్థితి బట్టి నేను అలా గంటన్నర సమయం ఉండటం నాకు చాలా కష్టమైన పని, MRI అయ్యాక అందులో ఏమైనా సమస్య కనపడితే తప్పక ఆపరేషన్ చేయాల్సి వస్తుందని డాక్టర్ అన్నాడు.
సరే ముందు MRI కానీయమన్నాను, నేను ఒక్కదాన్నే ఉన్నాను, మా ఇంట్లో వాళ్లకి విషయం తెలియదు.
మిషన్ లోకి నన్ను పంపుతున్నారు, నాకు అర్ధమైపోతుంది నా శక్తి సరిపోవడం లేదు, ఇంకా ”బాబా నువ్వే దిక్కు నేనీ టెస్ట్ కదలకుండా చేయించుకునేటట్లు నువ్వే చూడాలి. తర్వాత రిపోర్ట్ లో ఏం రాకూడదు బాబా” అంటూ దండం పెట్టుకున్నాను.
ఒక ఆకారం నన్ను అసలు కదలనీయకుండా పట్టుకోవడం స్పష్టం గా తెలుస్తోంది.
రిపోర్ట్ చూసి ఆపరేషన్ చెయ్యాలని చెప్పారు, కానీ నేను బాబా మీద భారం వేసి రోజూ బాబా గుడికి వెళ్లి ” ఊదీ ” వేసుకుంటూ నడుముకు కూడా ” ఊదీ ” రాసుకుంటూ వచ్చాను. నెప్పి ఎగిరిపోయింది.
ఏ ఆపరేషన్ అవసరం లేకుండానే నేను బాబా దయవలన మాములుగా అయిపొయాను.
The above miracle has been typed by: Mrs. Raja Rajeswari Sainathuni
Latest Miracles:
- ఊదీ లీల – తగ్గిన కడుపు నొప్పి
- ఊధీ మహిమ – ఊపిరితిత్తుల వ్యాది మటుమాయం–Audio
- బాబా మహిమతో దొరికిన ముక్కుపుడక
- బాబా ఊదీ మహిమతో ఇంట్లో ఉన్న దృష్ట శక్తులు మాయమగుట.
- రిక్షాలో తీసుకెళ్లి షిరిడీ చూపించిన బాబా !
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
2 comments on “” ఊదీ ” మహిమతో ఎంతటి నొప్పి అయినా మటుమాయం …………………!”
Sai Baba
April 24, 2020 at 5:19 pmబాబా వారు అనేక సందర్భాలలో తన భక్తులతో ”
ఎవరైతే సదా నన్ను ధ్యానిస్తారో వారిని నేను కాపాడటానికి ఎల్లా వేళల నా చేతులు చాచి ఉంటాయి అన్నారు.”
పై లీల లో భాక్తురాలు మనస్ఫూర్తిగా వేడుకోవడము ద్వారా
“బాబా ఆమె యొక్క శరీరాన్ని తన అధీనము లోకి తీసుకొని కదలకుండా చేసారు.”
Sai Baba
April 24, 2020 at 5:19 pmBaba many times gave assurance to Devotees that those chant my name repeatedly and refugee in me then I will stay behind them.
In the above miracle, When she constantly meditates upon Baba then Baba took her body absolutely under control and keep without any moment.