రిక్షాలో తీసుకెళ్లి షిరిడీ చూపించిన బాబా !



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


బాబా పరిచయం అయ్యాక చాలా రోజుల వరకూ నేను షిరిడీ వెళ్ళలేదు.

అందరూ షిరిడీ ఇలా ఉంటుంది అలా ఉంటుంది అని వర్ణిస్తుంటే నాకు చూడాలనిపించి ఈయన్ని అడిగాను.

ఎక్కడికైనా వెళదాము కానీ షిరిడీ మాత్రము నేను రాను అనేవారు. చాలా చోట్లకి తీసుకెళ్లారు. కానీ షిరిడీ అంటే మాత్రం ససేమిరా అనేవారు.

ఎందుకు బాబా నన్ను షిరిడీ తీసుకువెళ్ళడం లేదు. ఆయన షిరిడీ అసలు ఒప్పుకోవడం లేదు. నన్ను ఒక్కదాన్ని ఎవరు తీసుకువెడతారు అని ఏడ్చుకుంటూ పడుకున్నాను.

నిద్ర పట్టేసింది. ఆ నిద్రలో ఓ కల. ఆ కల లో ఓ రిక్షా కనపడింది. ఆ రిక్షా పక్కనే దాన్ని నడిపించేవాడూ వున్నాడు. తలకి పనికి వెళ్ళే వాళ్ళు కట్టుకుంటారే అలా పాగా కట్టుకున్నాడు.

నేను ఎక్కడికో వెళ్లి వస్తున్నాను. ”రా బండి ఎక్కు అన్నాడు”, ”ఈ రిక్షా మీద షిరిడీ దాకా తీసుకువెడతావా” అని అడిగాను.

”ఎవరైనా ఈ రిక్షా లో షిరిడీ వెళతారా” అని కూడా అడిగాను. ”ముందు నువ్వు రిక్షా ఎక్కు” అన్నాడతను సరే అన్నాను, రిక్షా ఎక్కాను.

చాలా మెల్లగా తొక్కుతున్నాడు రిక్షా. ”ఈ రిక్షా మీద నన్ను ఎప్పటికి షిరిడీ తీసుకువెళతాడు? నేను షిరిడీ ఎప్పుడు చూస్తాను? ఇంత మెల్లగా తొక్కుతున్నాడు” అని అనుకుంటున్నాను.

ఇంతలో అతను రిక్షా ఒకచోట ఆపాడు ”అదిగో చూడు ఆ కనపడే ఊరే షిరిడీ, ఆ కనపడుతుండే అదే గుడి గోపురం. నేను తీసుకురాలేను రాలేను అంటున్నావుగా అదిగో చూడు” అన్నాడు.

చూసాను ఒక గోపురం కనపడింది. ఇలా కలవచ్చిన నాలుగు రోజులకి మా ఆడపడచు వాళ్ళాయన మా ఇంటికి వచ్చి షిరిడీ వెళదాము వస్తారా అని అడిగాడు.

ఈయన నాకు కుదరదు నేను రాను, ఆ తీసుకు వెళ్ళేది మీ చెల్లెలిని తీసుకువెళ్ళండి మీ చెల్లెలికి షిరిడీ వెళ్ళటం అంటే ఇష్టమే ఆవిడ్ని తీసుకువెళ్ళండి, అన్నారు.

టికెట్స్ బుక్ చేసారు. షిరిడీ వెళ్ళాము దర్శనం చేసుకున్నాము.

నాకు కలలో కనిపించిన గోపురమే అక్కడ నాకు కనిపించింది. నాకెంతో సంతోషం, ఆశ్చర్యం వేసాయి.

నేను చూడలేకపోతున్నానని బాధపడుతుంటే బాబా షిరిడీ గుడిని నాకు కలలో దర్శనం చేసాడు.

The above miracle has been typed by: Mrs. Raja Rajeswari Sainathuni

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles